కీర్తనల గ్రంథము 34 : 1 (TEV)
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును.
కీర్తనల గ్రంథము 34 : 2 (TEV)
యెహోవానుబట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించెదరు.
కీర్తనల గ్రంథము 34 : 3 (TEV)
నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము.
కీర్తనల గ్రంథము 34 : 4 (TEV)
నేను యెహోవాయొద్ద విచారణచేయగా ఆయన నాకుత్తరమిచ్చెను నాకు కలిగిన భయములన్నిటిలోనుండి ఆయన నన్ను తప్పించెను.
కీర్తనల గ్రంథము 34 : 5 (TEV)
వారు ఆయనతట్టు చూడగా వారికి వెలుగు కలిగెను వారి ముఖము లెన్నడును లజ్జింపకపోవును.
కీర్తనల గ్రంథము 34 : 6 (TEV)
ఈ దీనుడు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలోనుండి అతని రక్షించెను.
కీర్తనల గ్రంథము 34 : 7 (TEV)
యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
కీర్తనల గ్రంథము 34 : 8 (TEV)
యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 34 : 9 (TEV)
యెహోవా భక్తులారా, ఆయనయందు భయభక్తులు ఉంచుడి. ఆయనయందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువలేదు.
కీర్తనల గ్రంథము 34 : 10 (TEV)
సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయై యుండదు.
కీర్తనల గ్రంథము 34 : 11 (TEV)
పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవాయందలి భయభక్తులు మీకు నేర్పెదను.
కీర్తనల గ్రంథము 34 : 12 (TEV)
బ్రతుక గోరువాడెవడైన నున్నాడా? మేలునొందుచు అనేక దినములు బ్రతుక గోరువా డెవడైన నున్నాడా?
కీర్తనల గ్రంథము 34 : 13 (TEV)
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము.
కీర్తనల గ్రంథము 34 : 14 (TEV)
కీడు చేయుట మాని మేలు చేయుము సమాధానము వెదకి దాని వెంటాడుము.
కీర్తనల గ్రంథము 34 : 15 (TEV)
యెహోవా దృష్టి నీతిమంతులమీద నున్నది. ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి.
కీర్తనల గ్రంథము 34 : 16 (TEV)
దుష్‌క్రియలు చేయువారి జ్ఞాపకమును భూమిమీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా నున్నది.
కీర్తనల గ్రంథము 34 : 17 (TEV)
నీతిమంతులు మొఱ్ఱపెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలోనుండి వారిని విడిపించును.
కీర్తనల గ్రంథము 34 : 18 (TEV)
విరిగిన హృదయముగలవారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సుగలవారిని ఆయన రక్షించును.
కీర్తనల గ్రంథము 34 : 19 (TEV)
నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపిం చును.
కీర్తనల గ్రంథము 34 : 20 (TEV)
ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు.
కీర్తనల గ్రంథము 34 : 21 (TEV)
చెడుతనము భక్తిహీనులను సంహరించును నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచ బడుదురు
కీర్తనల గ్రంథము 34 : 22 (TEV)
యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధు లుగా ఎంచబడరు.
❮
❯