కీర్తనల గ్రంథము 35 : 1 (TEV)
యెహోవా, నాతో వ్యాజ్యెమాడు వారితో వ్యాజ్యె మాడుము నాతో పోరాడువారితో పోరాడుము.
కీర్తనల గ్రంథము 35 : 2 (TEV)
కేడెమును డాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము.
కీర్తనల గ్రంథము 35 : 3 (TEV)
ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము.
కీర్తనల గ్రంథము 35 : 4 (TEV)
నా ప్రాణము తీయగోరువారికి సిగ్గును అవమానమును కలుగును గాక నాకు కీడుచేయ నాలోచించువారు వెనుకకు మళ్లింప బడి లజ్జపడుదురు గాక.
కీర్తనల గ్రంథము 35 : 5 (TEV)
యెహోవా దూత వారిని పారదోలును గాక వారు గాలికి కొట్టుకొనిపోవు పొట్టువలె నుందురు గాక.
కీర్తనల గ్రంథము 35 : 6 (TEV)
యెహోవా దూత వారిని తరుమును గాక వారి త్రోవ చీకటియై జారుడుగా నుండును గాక.
కీర్తనల గ్రంథము 35 : 7 (TEV)
నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల నొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి.
కీర్తనల గ్రంథము 35 : 8 (TEV)
వానికి తెలియకుండ చేటు వానిమీదికి వచ్చును గాక తాను ఒడ్డిన వలలో తానే చిక్కుబడును గాక వాడు ఆ చేటులోనే పడును గాక.
కీర్తనల గ్రంథము 35 : 9 (TEV)
అప్పుడు యెహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణనుబట్టి నేను సంతోషించుదును.
కీర్తనల గ్రంథము 35 : 10 (TEV)
అప్పుడుయెహోవా నీవంటివాడెవడు? మించిన బలముగలవారి చేతినుండి దీనులను దోచుకొనువారి చేతినుండి దీనులను దరిద్రులను విడి పించువాడవు నీవే అని నా యెముకలన్నియు చెప్పుకొనును.
కీర్తనల గ్రంథము 35 : 11 (TEV)
కూటసాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులనుగూర్చి నన్ను అడుగుచున్నారు.
కీర్తనల గ్రంథము 35 : 12 (TEV)
మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కులేనివాడనైతిని.
కీర్తనల గ్రంథము 35 : 13 (TEV)
వారు వ్యాధితో నున్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని ఉపవాసముచేత నా ప్రాణమును ఆయాసపరచు కొంటిని అయినను నా ప్రార్థన నా యెదలోనికే తిరిగి వచ్చి యున్నది.
కీర్తనల గ్రంథము 35 : 14 (TEV)
అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతినొందినందున దుఃఖవస్త్రములు ధరించు వానివలె క్రుంగుచుంటిని.
కీర్తనల గ్రంథము 35 : 15 (TEV)
నేను కూలియుండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి నీచులును నేనెరుగనివారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి.
కీర్తనల గ్రంథము 35 : 16 (TEV)
విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.
కీర్తనల గ్రంథము 35 : 17 (TEV)
ప్రభువా, నీవెన్నాళ్లు చూచుచు ఊరకుందువు? వారు నాశనము చేయకుండ నా ప్రాణమును రక్షిం పుము నా ప్రాణమును సింహముల నోటనుండి విడిపింపుము
కీర్తనల గ్రంథము 35 : 18 (TEV)
అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను బహు జనులలో నిన్ను నుతించెదను.
కీర్తనల గ్రంథము 35 : 19 (TEV)
నిర్హేతుకముగా నాకు శత్రువులైనవారిని నన్నుగూర్చి సంతోషింపనియ్యకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించువారిని కన్ను గీట నియ్యకుము.
కీర్తనల గ్రంథము 35 : 20 (TEV)
వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటయోచనలు చేయుదురు.
కీర్తనల గ్రంథము 35 : 21 (TEV)
నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరచు కొనుచున్నారు. ఆహా ఆహా యిప్పుడు వాని సంగతి మాకు కనబడి నదే అనుచున్నారు.
కీర్తనల గ్రంథము 35 : 22 (TEV)
యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా మౌన ముగా నుండకుము నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము.
కీర్తనల గ్రంథము 35 : 23 (TEV)
నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యె మాడుటకు లెమ్ము.
కీర్తనల గ్రంథము 35 : 24 (TEV)
యెహోవా నా దేవా, నీ నీతినిబట్టి నాకు న్యాయము తీర్చుము నన్ను బట్టి వారు సంతోషింపకుందురు గాక.
కీర్తనల గ్రంథము 35 : 25 (TEV)
ఆహా మా ఆశ తీరెను అని మనస్సులో వారు అను కొనకపోదురు గాక వాని మింగివేసితిమని వారు చెప్పుకొనకయుందురు గాక
కీర్తనల గ్రంథము 35 : 26 (TEV)
నా అపాయమునుచూచి సంతోషించువారందరు అవ మానము నొందుదురుగాక లజ్జపడుదురు గాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తిపాలగుదురు గాక
కీర్తనల గ్రంథము 35 : 27 (TEV)
నా నిర్దోషత్వమునుబట్టి ఆనందించువారు ఉత్సాహధ్వనిచేసి సంతోషించుదురు గాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు.
కీర్తనల గ్రంథము 35 : 28 (TEV)
నా నాలుక నీ నీతినిగూర్చియు నీ కీర్తినిగూర్చియు దినమెల్ల సల్లాపములు చేయును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: