కీర్తనల గ్రంథము 38 : 1 (TEV)
యెహోవా, కోపోద్రేకముచేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతచేత నన్ను శిక్షింపకుము.
కీర్తనల గ్రంథము 38 : 2 (TEV)
నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి. నీ చెయ్యి నామీద భారముగా నున్నది.
కీర్తనల గ్రంథము 38 : 3 (TEV)
నీ కోపాగ్నివలన ఆరోగ్యము నా శరీరమును విడిచి పోయెను నా పాపమునుబట్టి నా యెముకలలో స్వస్థతలేదు.
కీర్తనల గ్రంథము 38 : 4 (TEV)
నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి.
కీర్తనల గ్రంథము 38 : 5 (TEV)
నా మూర్ఖతవలన గలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
కీర్తనల గ్రంథము 38 : 6 (TEV)
నేను శ్రమచేత మిక్కిలి క్రుంగియున్నాను దినమెల్ల దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను.
కీర్తనల గ్రంథము 38 : 7 (TEV)
నా నడుము తాపముతో నిండియున్నది నా శరీరములో ఆరోగ్యము లేదు.
కీర్తనల గ్రంథము 38 : 8 (TEV)
నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను
కీర్తనల గ్రంథము 38 : 9 (TEV)
ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడు చున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి యుండలేదు.
కీర్తనల గ్రంథము 38 : 10 (TEV)
నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టియు తప్పిపోయెను.
కీర్తనల గ్రంథము 38 : 11 (TEV)
నా స్నేహితులును నా చెలికాండ్రును నా తెగులు చూచి యెడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు
కీర్తనల గ్రంథము 38 : 12 (TEV)
నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డు చున్నారు నాకు కీడుచేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్ల కపటోపాయములు పన్ను చున్నారు.
కీర్తనల గ్రంథము 38 : 13 (TEV)
చెవిటివాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని.
కీర్తనల గ్రంథము 38 : 14 (TEV)
నేను వినలేనివాడనైతిని ఎదురుమాట పలుకలేనివాడనైతిని.
కీర్తనల గ్రంథము 38 : 15 (TEV)
యెహోవా, నీ కొరకే నేను కనిపెట్టుకొనియున్నాను నా కాలు జారినయెడల వారు నామీద అతిశయ పడుదురని నేననుకొనుచున్నాను.
కీర్తనల గ్రంథము 38 : 16 (TEV)
ప్రభువా నా దేవా, నీవే ఉత్తరమిచ్చెదవు నన్నుబట్టి వారు సంతోషించక పోదురుగాక.
కీర్తనల గ్రంథము 38 : 17 (TEV)
నేను పడబోవునట్లున్నాను నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు.
కీర్తనల గ్రంథము 38 : 18 (TEV)
నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమునుగూర్చి విచారపడుచున్నాను.
కీర్తనల గ్రంథము 38 : 19 (TEV)
నా శత్రువులు చురుకైనవారును బలవంతులునై యున్నారు నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు.
కీర్తనల గ్రంథము 38 : 20 (TEV)
మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైనదాని ననుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి
కీర్తనల గ్రంథము 38 : 21 (TEV)
యెహోవా, నన్ను విడువకుము నా దేవా, నాకు దూరముగా నుండకుము.
కీర్తనల గ్రంథము 38 : 22 (TEV)
రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
❮
❯