కీర్తనల గ్రంథము 4 : 1 (TEV)
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ముఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవేనన్ను కరుణించి నా ప్రార్థన నంగీకరించుము.
కీర్తనల గ్రంథము 4 : 2 (TEV)
నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు?ఎంతకాలము వ్యర్థమైనదానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైనవాటిని వెదకెదరు?
కీర్తనల గ్రంథము 4 : 3 (TEV)
యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలిసికొనుడి.నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన ఆలకించును.
కీర్తనల గ్రంథము 4 : 4 (TEV)
భయమునొంది పాపము చేయకుడిమీరు పడకలమీద నుండగా మీ హృదయములలోధ్యానము చేసికొని ఊరకుండుడి (సెలా.)
కీర్తనల గ్రంథము 4 : 5 (TEV)
నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవానునమ్ముకొనుడి
కీర్తనల గ్రంథము 4 : 6 (TEV)
మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు.యెహోవా, నీ సన్నిధికాంతి మామీద ప్రకాశింపజేయుము.
కీర్తనల గ్రంథము 4 : 7 (TEV)
వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించితివి.
కీర్తనల గ్రంథము 4 : 8 (TEV)
యెహోవా, నెమ్మదితో పండుకొని నిద్రపోవుదునునేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: