కీర్తనల గ్రంథము 40 : 1 (TEV)
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టు కొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా మొఱ్ఱ ఆలకించెను.
కీర్తనల గ్రంథము 40 : 2 (TEV)
నాశనకరమైన గుంటలోనుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు. ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండమీద నిలిపి నా అడుగులు స్థిర పరచెను.
కీర్తనల గ్రంథము 40 : 3 (TEV)
తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమి్మకయుంచెదరు.
కీర్తనల గ్రంథము 40 : 4 (TEV)
గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధములతట్టు తిరుగు వారినైనను లక్ష్యపెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 40 : 5 (TEV)
యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పెదననుకొంటినా అవి లెక్కకు మించియున్నవి నీకు సాటియైనవాడొకడును లేడు.
కీర్తనల గ్రంథము 40 : 6 (TEV)
బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించియున్నావు. దహన బలులనైనను పాపపరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు.
కీర్తనల గ్రంథము 40 : 7 (TEV)
అప్పుడుపుస్తకపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చియున్నాను.
కీర్తనల గ్రంథము 40 : 8 (TEV)
నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది.
కీర్తనల గ్రంథము 40 : 9 (TEV)
నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించియున్నానని నేనంటిని యెహోవా, అది నీకు తెలిసేయున్నది.
కీర్తనల గ్రంథము 40 : 10 (TEV)
నీ నీతిని నా హృదయములో నుంచుకొని నేను ఊర కుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడిచేసి యున్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటికి మరుగుచేయలేదు.
కీర్తనల గ్రంథము 40 : 11 (TEV)
యెహోవా, నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపాసత్యములు ఎప్పుడును నన్ను కాపాడునుగాక
కీర్తనల గ్రంథము 40 : 12 (TEV)
లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొనియున్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల యెత్తి చూడలేకపోతిని లెక్కకు అవి నా తలవెండ్రుకలను మించియున్నవి నా హృదయము అధైర్యపడి యున్నది.
కీర్తనల గ్రంథము 40 : 13 (TEV)
యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము.
కీర్తనల గ్రంథము 40 : 14 (TEV)
నా ప్రాణము తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురు గాక నాకు కీడు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురు గాక.
కీర్తనల గ్రంథము 40 : 15 (TEV)
నన్ను చూచిఆహా ఆహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయ మొందు దురు గాక.
కీర్తనల గ్రంథము 40 : 16 (TEV)
నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక నీ రక్షణ ప్రేమించువారుయెహోవా మహిమ పరచబడును గాక అని నిత్యముచెప్పుకొందురు గాక.
కీర్తనల గ్రంథము 40 : 17 (TEV)
నేను శ్రమలపాలై దీనుడనైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము.
❮
❯