కీర్తనల గ్రంథము 41 : 1 (TEV)
బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును.
కీర్తనల గ్రంథము 41 : 2 (TEV)
యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు.
కీర్తనల గ్రంథము 41 : 3 (TEV)
రోగశయ్యమీద యెహోవా వానిని ఆదరించును రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు.
కీర్తనల గ్రంథము 41 : 4 (TEV)
యెహోవా నీ దృష్టియెదుట నేను పాపము చేసి యున్నాను నన్ను కరుణింపుము నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసియున్నాను.
కీర్తనల గ్రంథము 41 : 5 (TEV)
అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డమాట లాడుచున్నారు వాడు ఎప్పుడు చచ్చును? వాని పేరు ఎప్పుడు మాసిపోవును? అని చెప్పుకొనుచున్నారు.
కీర్తనల గ్రంథము 41 : 6 (TEV)
ఒకడు నన్ను చూడవచ్చినయెడల వాడు అబద్ధ మాడును వాని హృదయము పాపమును పోగుచేసికొను చున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు.
కీర్తనల గ్రంథము 41 : 7 (TEV)
నన్ను ద్వేషించువారందరు కూడి నామీద గుసగుస లాడుచున్నారు నశింపజేయవలెనని వారు నాకు కీడుచేయ నాలో చించుచున్నారు.
కీర్తనల గ్రంథము 41 : 8 (TEV)
కుదురని రోగము వానికి సంభవించియున్నది వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొను చున్నారు.
కీర్తనల గ్రంథము 41 : 9 (TEV)
నేను నమ్ముకొనిన నా విహితుడు నా యింట భోజ నము చేసినవాడు. నన్ను తన్నుటకై తన మడిమె నెత్తెను
కీర్తనల గ్రంథము 41 : 10 (TEV)
యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను.
కీర్తనల గ్రంథము 41 : 11 (TEV)
నా శత్రువు నామీద ఉల్లసింపక యుండుటచూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను.
కీర్తనల గ్రంథము 41 : 12 (TEV)
నా యథార్థతనుబట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు.
కీర్తనల గ్రంథము 41 : 13 (TEV)
ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వతకాలమునుండి శాశ్వతకాలమువరకు స్తుతింప బడును గాక. ఆమేన్. ఆమేన్.
❮
❯