కీర్తనల గ్రంథము 46 : 1 (TEV)
దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
కీర్తనల గ్రంథము 46 : 2 (TEV)
కావున భూమి మార్పునొందినను నడిసముద్రములలో పర్వతములు మునిగినను
కీర్తనల గ్రంథము 46 : 3 (TEV)
వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదలినను మనము భయపడము.(సెలా.)
కీర్తనల గ్రంథము 46 : 4 (TEV)
ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.
కీర్తనల గ్రంథము 46 : 5 (TEV)
దేవుడు ఆ పట్టణములో నున్నాడు దానికి చలనము లేదు అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయు చున్నాడు.
కీర్తనల గ్రంథము 46 : 6 (TEV)
జనములు ఘోషించుచున్నవి రాజ్యములు కదలు చున్నవి ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరగి పోవుచున్నది.
కీర్తనల గ్రంథము 46 : 7 (TEV)
సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు. యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
కీర్తనల గ్రంథము 46 : 8 (TEV)
యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమిమీద నాశనములు కలుగజేయువాడు.
కీర్తనల గ్రంథము 46 : 9 (TEV)
ఆయనే భూదిగంతములవరకు యుద్ధములు మాన్పు వాడు. విల్లు విరుచువాడును బల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే.
కీర్తనల గ్రంథము 46 : 10 (TEV)
ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమిమీద నేను మహోన్నతుడ నగుదును
కీర్తనల గ్రంథము 46 : 11 (TEV)
సైన్యముల కధిపతియగు యెహోవా మనకు తోడై యున్నాడు యాకోబుయొక్క దేవుడు మనకు ఆశ్రయమై యున్నాడు.
❮
❯