కీర్తనల గ్రంథము 47 : 1 (TEV)
సర్వజనులారా, చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవునిగూర్చి ఆర్భాటము చేయుడి.
కీర్తనల గ్రంథము 47 : 2 (TEV)
యెహోవా మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి మహారాజై యున్నాడు.
కీర్తనల గ్రంథము 47 : 3 (TEV)
ఆయన జనములను మనకు లోపరచును మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును.
కీర్తనల గ్రంథము 47 : 4 (TEV)
తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పద ముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు.
కీర్తనల గ్రంథము 47 : 5 (TEV)
దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను.
కీర్తనల గ్రంథము 47 : 6 (TEV)
దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి.
కీర్తనల గ్రంథము 47 : 7 (TEV)
దేవుడు సర్వభూమికి రాజై యున్నాడు రమ్యముగా కీర్తనలు పాడుడి.
కీర్తనల గ్రంథము 47 : 8 (TEV)
దేవుడు అన్యజనులకు రాజై యున్నాడు దేవుడు తన పరిశుద్ధసింహాసనముమీద ఆసీనుడై యున్నాడు.
కీర్తనల గ్రంథము 47 : 9 (TEV)
జనముల ప్రధానులు అబ్రాహాముయొక్క దేవునికి జనులై కూడుకొనియున్నారు. భూనివాసులు ధరించుకొను కేడెములు దేవునివి ఆయన మహోన్నతుడాయెను.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: