కీర్తనల గ్రంథము 56 : 1 (TEV)
దేవా, నన్ను కరుణింపుము మనుష్యులు నన్ను మింగ వలెనని యున్నారు దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించు చున్నారు.
కీర్తనల గ్రంథము 56 : 2 (TEV)
అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు దినమెల్ల నాకొరకు పొంచియున్నవారు నన్ను మింగ వలెనని యున్నారు
కీర్తనల గ్రంథము 56 : 3 (TEV)
నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్ర యించుచున్నాను.
కీర్తనల గ్రంథము 56 : 4 (TEV)
దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమి్మకయుంచి యున్నాను నేను భయ పడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
కీర్తనల గ్రంథము 56 : 5 (TEV)
దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు నాకు హాని చేయవలెనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి.
కీర్తనల గ్రంథము 56 : 6 (TEV)
వారు గుంపుకూడి పొంచియుందురు నా ప్రాణము తీయగోరుచు వారు నా అడుగు జాడలు కనిపెట్టుదురు.
కీర్తనల గ్రంథము 56 : 7 (TEV)
తాము చేయు దోషక్రియలచేత వారు తప్పించు కొందురా? దేవా, కోపముచేత జనములను అణగగొట్టుము
కీర్తనల గ్రంథము 56 : 8 (TEV)
నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో1 కనబడును గదా.
కీర్తనల గ్రంథము 56 : 9 (TEV)
నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలి యును.
కీర్తనల గ్రంథము 56 : 10 (TEV)
దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను
కీర్తనల గ్రంథము 56 : 11 (TEV)
నేను దేవునియందు నమి్మకయుంచి యున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?
కీర్తనల గ్రంథము 56 : 12 (TEV)
దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించు నట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించి యున్నావు.
కీర్తనల గ్రంథము 56 : 13 (TEV)
నేను నీకు మ్రొక్కుకొని యున్నాను నేను నీకు స్తుతియాగముల నర్పించెదను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13