కీర్తనల గ్రంథము 6 : 1 (TEV)
యెహోవా, నీ కోపముచేత నన్ను గద్దింపకుమునీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము.
కీర్తనల గ్రంథము 6 : 2 (TEV)
యెహోవా, నేను కృశించి యున్నాను, నన్ను కరుణించుముయెహోవా, నా యెముకలు అదరుచున్నవి, నన్నుబాగుచేయుము
కీర్తనల గ్రంథము 6 : 3 (TEV)
నా ప్రాణము బహుగా అదరుచున్నది.యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక యుందువు?
కీర్తనల గ్రంథము 6 : 4 (TEV)
యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుమునీ కృపనుబట్టి నన్ను రక్షించుము.
కీర్తనల గ్రంథము 6 : 5 (TEV)
మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదుపాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు దురు?
కీర్తనల గ్రంథము 6 : 6 (TEV)
నేను మూలుగుచు అలసియున్నానుప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను.నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవు చున్నది.
కీర్తనల గ్రంథము 6 : 7 (TEV)
విచారముచేత నా కన్నులు గుంటలు పడుచున్నవినాకు బాధ కలిగించువారిచేత అవి చివికియున్నవి.
కీర్తనల గ్రంథము 6 : 8 (TEV)
యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడుపాపముచేయు వారలారా, మీరందరు నాయొద్దనుండి తొలగిపోవుడి.
కీర్తనల గ్రంథము 6 : 9 (TEV)
యెహోవా నా విన్నపము ఆలకించి యున్నాడుయెహోవా నా ప్రార్థన నంగీకరించును.
కీర్తనల గ్రంథము 6 : 10 (TEV)
నా శత్రువులందరు సిగ్గుపడి బహుగా అదరుచున్నారువారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్లుదురు.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: