కీర్తనల గ్రంథము 60 : 1 (TEV)
దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.
కీర్తనల గ్రంథము 60 : 2 (TEV)
నీవు దేశమును కంపింపజేసియున్నావు దానిని బద్దలు చేసియున్నావు అది వణకుచున్నది అది పడిపోయిన చోటులు బాగు చేయుము.
కీర్తనల గ్రంథము 60 : 3 (TEV)
నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి
కీర్తనల గ్రంథము 60 : 4 (TEV)
సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీయందు భయభక్తులుగలవారికి నీవొక ధ్వజము నిచ్చి యున్నావు.(సెలా.)
కీర్తనల గ్రంథము 60 : 5 (TEV)
నీ ప్రియులు విమోచింపబడునట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకుత్తరమిమ్ము
కీర్తనల గ్రంథము 60 : 6 (TEV)
తన పరిశుద్ధతతోడని దేవుడు మాట యిచ్చి యున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.
కీర్తనల గ్రంథము 60 : 7 (TEV)
గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజదండము.
కీర్తనల గ్రంథము 60 : 8 (TEV)
మోయాబు నేను కాళ్లు కడుగుకొను పళ్లెము ఎదోముమీద నా చెప్పు విసరివేయుదును ఫిలిష్తియా, నన్నుగూర్చి ఉత్సాహధ్వనిచేయుము.
కీర్తనల గ్రంథము 60 : 9 (TEV)
కోటగల పట్టణములోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
కీర్తనల గ్రంథము 60 : 10 (TEV)
దేవా, నీవు మమ్ము విడనాడియున్నావు గదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావు గదా?
కీర్తనల గ్రంథము 60 : 11 (TEV)
మనుష్యుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము దయ చేయుము.
కీర్తనల గ్రంథము 60 : 12 (TEV)
దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: