కీర్తనల గ్రంథము 61 : 1 (TEV)
దేవా, నా మొఱ్ఱ ఆలకింపుము నా ప్రార్థనకు చెవియొగ్గుము
కీర్తనల గ్రంథము 61 : 2 (TEV)
నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంతయెత్తయిన కొండపైకినన్ను ఎక్కిం చుము.
కీర్తనల గ్రంథము 61 : 3 (TEV)
నీవు నాకు ఆశ్రయముగా నుంటిని. శత్రువులయెదుట బలమైన కోటగానుంటివి
కీర్తనల గ్రంథము 61 : 4 (TEV)
యుగయుగములు నేను నీ గుడారములో నివసించెదను నీ రెక్కల చాటున దాగుకొందును (సెలా.)
కీర్తనల గ్రంథము 61 : 5 (TEV)
దేవా, నీవు నా మ్రొక్కుబడుల నంగీకరించి యున్నావు నీ నామమునందు భయభక్తులుగలవారి స్వాస్థ్యము నీవు నాకనుగ్రహించి యున్నావు.
కీర్తనల గ్రంథము 61 : 6 (TEV)
రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువు గాక అతని సంవత్సరములు తరతరములుగడచును గాక.
కీర్తనల గ్రంథము 61 : 7 (TEV)
దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించును గాక అతని కాపాడుటకై కృపాసత్యములను నియమిం చుము.
కీర్తనల గ్రంథము 61 : 8 (TEV)
దినదినము నా మ్రొక్కుబడులను నేను చెల్లించు నట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: