కీర్తనల గ్రంథము 63 : 1 (TEV)
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును
కీర్తనల గ్రంథము 63 : 2 (TEV)
నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లు లేకయెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
కీర్తనల గ్రంథము 63 : 3 (TEV)
నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
కీర్తనల గ్రంథము 63 : 4 (TEV)
నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
కీర్తనల గ్రంథము 63 : 5 (TEV)
క్రొవ్వు మెదడు నాకు దొరకినట్లుగా నా ప్రాణము తృప్తిపొందుచున్నది ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్నుగూర్చి గానము చేయుచున్నది
కీర్తనల గ్రంథము 63 : 6 (TEV)
కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
కీర్తనల గ్రంథము 63 : 7 (TEV)
నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను.
కీర్తనల గ్రంథము 63 : 8 (TEV)
నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
కీర్తనల గ్రంథము 63 : 9 (TEV)
నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దాని వెదకుచున్నారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు
కీర్తనల గ్రంథము 63 : 10 (TEV)
బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు నక్కలపాలగుదురు.
కీర్తనల గ్రంథము 63 : 11 (TEV)
రాజు దేవునిబట్టి సంతోషించును. ఆయనతోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిల్లును అబద్ధములాడువారి నోరు మూయబడును.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: