కీర్తనల గ్రంథము 64 : 1 (TEV)
దేవా, నేను మొఱ్ఱపెట్టగా నా మనవి ఆలకింపుము శత్రుభయమునుండి నా ప్రాణమును కాపాడుము.
కీర్తనల గ్రంథము 64 : 2 (TEV)
కీడుచేయువారి కుట్రనుండి దుష్టక్రియలు చేయువారి అల్లరినుండి నన్ను దాచుము
కీర్తనల గ్రంథము 64 : 3 (TEV)
ఒకడు కత్తికి పదును పెట్టునట్లు వారు తమ నాలుక లకు పదును పెట్టుదురు.
కీర్తనల గ్రంథము 64 : 4 (TEV)
యథార్థవంతులను కొట్టవలెనని చాటైన స్థలములలో చేదుమాటలను బాణములుగా సంధించుదురు.వారు భయమేమియు లేక అకస్మాత్తుగా వారినికొట్టెదరు
కీర్తనల గ్రంథము 64 : 5 (TEV)
వారు దురాలోచన దృఢపరచుకొందురు చాటుగా ఉరుల నొడ్డుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందురు.
కీర్తనల గ్రంథము 64 : 6 (TEV)
వారు దుష్టక్రియలను తెలిసికొనుటకు ప్రయత్నిం తురు వెదకి వెదకి ఉపాయము సిద్ధపరచుకొందురు ప్రతివాని హృదయాంతరంగము అగాధము.
కీర్తనల గ్రంథము 64 : 7 (TEV)
దేవుడు బాణముతో వారిని కొట్టును వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు.
కీర్తనల గ్రంథము 64 : 8 (TEV)
వారు కూలెదరు వారు కూలుటకు వారి నాలుకే కారణము. వారిని చూచువారందరు తల ఊచుదురు
కీర్తనల గ్రంథము 64 : 9 (TEV)
మనుష్యులందరు భయముకలిగి దేవుని కార్య ములు తెలియజేయుదురు ఆయన కార్యములు చక్కగా యోచించు కొందురు
కీర్తనల గ్రంథము 64 : 10 (TEV)
నీతిమంతులు యెహోవానుబట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు యథార్థహృదయులందరు అతిశయిల్లుదురు.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: