కీర్తనల గ్రంథము 67 : 1 (TEV)
భూమిమీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును
కీర్తనల గ్రంథము 67 : 2 (TEV)
దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక ఆయన తన ముఖకాంతి మామీద ప్రకాశింపజేయును గాక.(సెలా.)
కీర్తనల గ్రంథము 67 : 3 (TEV)
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక. న్యాయమునుబట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు భూమిమీదనున్న జనములను ఏలెదవు.(సెలా.)
కీర్తనల గ్రంథము 67 : 4 (TEV)
జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక
కీర్తనల గ్రంథము 67 : 5 (TEV)
దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురు గాక. ప్రజలందరు నిన్ను స్తుతించుదురు గాక.
కీర్తనల గ్రంథము 67 : 6 (TEV)
అప్పుడు భూమి దాని ఫలములిచ్చును దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును.
కీర్తనల గ్రంథము 67 : 7 (TEV)
దేవుడు మమ్మును దీవించును భూదిగంత నివాసులందరు ఆయనయందు భయభక్తులు నిలుపుదురు.

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: