కీర్తనల గ్రంథము 68 : 1 (TEV)
దేవుడు లేచును గాక ఆయన శత్రువులు చెదరిపోవుదురు గాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధినుండి పారి పోవుదురు గాక.
కీర్తనల గ్రంథము 68 : 2 (TEV)
పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరగి నశించుదురు గాక.
కీర్తనల గ్రంథము 68 : 3 (TEV)
నీతిమంతులు సంతోషించుదురు గాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక వారు మహదానందము పొందుదురు గాక
కీర్తనల గ్రంథము 68 : 4 (TEV)
దేవునిగూర్చిపాడుడి ఆయన నామమునుబట్టి స్తోత్ర గానము చేయుడి వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణముచేయు దేవునికొరకు ఒక రాజమార్గము చేయుడి యెహోవా అను ఆయన నామమునుబట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి.
కీర్తనల గ్రంథము 68 : 5 (TEV)
తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై యున్నాడు
కీర్తనల గ్రంథము 68 : 6 (TEV)
దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడినవారిని విడిపించి వారిని వర్ధిల్ల జేయువాడు విశ్వాసఘాతకులు నిర్జలదేశమందు నివసించుదురు.
కీర్తనల గ్రంథము 68 : 7 (TEV)
దేవా, నీవు నీ ప్రజలముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు (సెలా.)
కీర్తనల గ్రంథము 68 : 8 (TEV)
భూమి వణకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగ జారెను ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను.
కీర్తనల గ్రంథము 68 : 9 (TEV)
దేవా, నీ స్వాస్థ్యముమీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరచితివి.
కీర్తనల గ్రంథము 68 : 10 (TEV)
నీ సమూహము దానిలో నివసించును దేవా, నీ అనుగ్రహముచేత దీనులకు సదుపాయము కలుగజేసితివి.
కీర్తనల గ్రంథము 68 : 11 (TEV)
ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.
కీర్తనల గ్రంథము 68 : 12 (TEV)
సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడుసొమ్ము పంచుకొనును.
కీర్తనల గ్రంథము 68 : 13 (TEV)
గొఱ్ఱల దొడ్లమధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నది వాటి యీకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్ప బడినట్టున్నది.
కీర్తనల గ్రంథము 68 : 14 (TEV)
సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోనుమీద హిమము కురిసినట్లాయెను.
కీర్తనల గ్రంథము 68 : 15 (TEV)
బాషాను పర్వతము దేవపర్వతము బాషాను పర్వతము శిఖరములుగల పర్వతము.
కీర్తనల గ్రంథము 68 : 16 (TEV)
శిఖరములుగల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకొన్న కొండను మీరేల ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును.
కీర్తనల గ్రంథము 68 : 17 (TEV)
దేవుని రథములు సహస్రములు సహస్రసహస్రములు ప్రభువు వాటిలో నున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయెను.
కీర్తనల గ్రంథము 68 : 18 (TEV)
నీవు ఆరోహణమైతివి పట్టబడినవారిని చెరపట్టుకొని పోతివి మనుష్యులచేత నీవు కానుకలు తీసికొనియున్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించునట్లు విశ్వాసఘాతకులచేత సహితము నీవు కానుకలు తీసి కొని యున్నావు.
కీర్తనల గ్రంథము 68 : 19 (TEV)
ప్రభువు స్తుతినొందును గాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణకర్తయై యున్నాడు.
కీర్తనల గ్రంథము 68 : 20 (TEV)
దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై యున్నాడు మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము.
కీర్తనల గ్రంథము 68 : 21 (TEV)
దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగుల గొట్టును. మానక దోషములు చేయువారి వెండ్రుకలుగల నడి నెత్తిని ఆయన పగులగొట్టును.
కీర్తనల గ్రంథము 68 : 22 (TEV)
ప్రభువు సెలవిచ్చినదేమనగానేను బాషానులోనుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలోనుండి వారిని రప్పించెదను.
కీర్తనల గ్రంథము 68 : 23 (TEV)
వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు.
కీర్తనల గ్రంథము 68 : 24 (TEV)
దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి యున్నారు. చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా
కీర్తనల గ్రంథము 68 : 25 (TEV)
కీర్తనలు పాడువారు ముందర నడచిరి. తంతివాద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు.
కీర్తనల గ్రంథము 68 : 26 (TEV)
సమాజములలో దేవుని స్తుతించుడి ఇశ్రాయేలులోనుండి ఉద్భవించినవారలారా, ప్రభు వును స్తుతించుడి.
కీర్తనల గ్రంథము 68 : 27 (TEV)
కనిష్ఠుడగు బెన్యామీను అను, వారి యేలిక అచ్చట నున్నాడు. యూదా అధిపతుల పరివారమచ్చట నున్నది జెబూలూను అధిపతులును నఫ్తాలి అధిపతులును ఉన్నారు.
కీర్తనల గ్రంథము 68 : 28 (TEV)
నీ దేవుడు నీకు బలము కలుగ నియమించియున్నాడు. దేవా, నీవు మాకొరకు చేసినదానిని బలపరచుము
కీర్తనల గ్రంథము 68 : 29 (TEV)
యెరూషలేములోని నీ ఆలయమునుబట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు.
కీర్తనల గ్రంథము 68 : 30 (TEV)
రెల్లులోని మృగమును ఆబోతుల గుంపును దూడలవంటి జనములును లొంగి, వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు.
కీర్తనల గ్రంథము 68 : 31 (TEV)
ఐగుప్తులోనుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవునితట్టు తమ చేతులు చాచుకొని పరుగెత్తివచ్చెదరు.
కీర్తనల గ్రంథము 68 : 32 (TEV)
భూరాజ్యములారా, దేవునిగూర్చి పాడుడి ప్రభువును కీర్తించుడి.(సెలా.)
కీర్తనల గ్రంథము 68 : 33 (TEV)
అనాదిగానున్న ఆకాశాకాశవాహన మెక్కువానిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము.
కీర్తనల గ్రంథము 68 : 34 (TEV)
దేవునికి బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలుమీద ఏలు చున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది
కీర్తనల గ్రంథము 68 : 35 (TEV)
తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలపరాక్రమ ముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: