కీర్తనల గ్రంథము 72 : 1 (TEV)
దేవా, రాజునకు నీ న్యాయవిధులను రాజకుమారునికి నీ నీతిని తెలియజేయుము.
కీర్తనల గ్రంథము 72 : 2 (TEV)
నీతినిబట్టి నీ ప్రజలకును న్యాయవిధులనుబట్టి శ్రమ నొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును.
కీర్తనల గ్రంథము 72 : 3 (TEV)
నీతినిబట్టి పర్వతములును చిన్నకొండలును ప్రజలకు నెమ్మది పుట్టించును.
కీర్తనల గ్రంథము 72 : 4 (TEV)
ప్రజలలో శ్రమనొందువారికి అతడు న్యాయము తీర్చును బీదల పిల్లలను రక్షించి బాధపెట్టువారిని నలగగొట్టును.
కీర్తనల గ్రంథము 72 : 5 (TEV)
సూర్యుడు నిలుచునంత కాలము చంద్రుడు నిలుచునంతకాలము తరములన్నిటను జనులు నీయందు భయభక్తులు కలిగియుందురు.
కీర్తనల గ్రంథము 72 : 6 (TEV)
గడ్డికోసిన బీటిమీద కురియు వానవలెను భూమిని తడుపు మంచి వర్షమువలెను అతడు విజ యము చేయును.
కీర్తనల గ్రంథము 72 : 7 (TEV)
అతని దినములలో నీతిమంతులు వర్ధిల్లుదురు చంద్రుడు లేకపోవువరకు క్షేమాభివృద్ధి కలుగును.
కీర్తనల గ్రంథము 72 : 8 (TEV)
సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసునది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేయును.
కీర్తనల గ్రంథము 72 : 9 (TEV)
అరణ్యవాసులు అతనికి లోబడుదురు. అతని శత్రువులు మన్ను నాకెదరు.
కీర్తనల గ్రంథము 72 : 10 (TEV)
తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించె దరు షేబరాజులును సెబారాజులును కానుకలు తీసికొని వచ్చెదరు.
కీర్తనల గ్రంథము 72 : 11 (TEV)
రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు. అన్యజనులందరు అతని సేవించెదరు.
కీర్తనల గ్రంథము 72 : 12 (TEV)
దరిద్రులు మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును. దీనులను నిరాధారులను అతడు విడిపించును.
కీర్తనల గ్రంథము 72 : 13 (TEV)
నిరుపేదలయందును బీదలయందును అతడు కనిక రించును బీదల ప్రాణములను అతడు రక్షించును
కీర్తనల గ్రంథము 72 : 14 (TEV)
కపట బలాత్కారములనుండి అతడు వారి ప్రాణ మును విమోచించును. వారి ప్రాణము అతని దృష్టికి ప్రియముగా ఉండును.
కీర్తనల గ్రంథము 72 : 15 (TEV)
అతడు చిరంజీవియగును, షేబ బంగారము అతనికి ఇయ్యబడును. అతని క్షేమమునకై జనులు నిత్యము ప్రార్థన చేయు దురు దినమంతయు అతని పొగడుదురు.
కీర్తనల గ్రంథము 72 : 16 (TEV)
దేశములోను పర్వత శిఖరములమీదను సస్య సమృద్ధి కలుగును దాని పంట లెబానోను వృక్షములవలె తాండవమాడు చుండును నేలమీది పచ్చికవలె పట్టణస్థులు తేజరిల్లుదురు.
కీర్తనల గ్రంథము 72 : 17 (TEV)
అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చు చుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు.
కీర్తనల గ్రంథము 72 : 18 (TEV)
దేవుడైన యెహోవా ఇశ్రాయేలుయొక్క దేవుడు స్తుతింపబడును గాక ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు.
కీర్తనల గ్రంథము 72 : 19 (TEV)
ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్ . ఆమేన్.
కీర్తనల గ్రంథము 72 : 20 (TEV)
యెష్షయి కుమారుడగు దావీదు ప్రార్థనలు ముగిసెను.
❮
❯