కీర్తనల గ్రంథము 73 : 1 (TEV)
ఇశ్రాయేలుయెడల శుద్ధహృదయులయెడల నిశ్చయముగా దేవుడు దయాళుడై యున్నాడు.
కీర్తనల గ్రంథము 73 : 2 (TEV)
నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయెను.
కీర్తనల గ్రంథము 73 : 3 (TEV)
భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించువారినిబట్టి నేను మత్సరపడితిని.
కీర్తనల గ్రంథము 73 : 4 (TEV)
మరణమందు వారికి యాతనలు లేవు వారు పుష్టిగా నున్నారు.
కీర్తనల గ్రంథము 73 : 5 (TEV)
ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు ఇతరులకు పుట్టునట్లు వారికి తెగులు పుట్టదు.
కీర్తనల గ్రంథము 73 : 6 (TEV)
కావున గర్వము కంఠహారమువలె వారిని చుట్టుకొను చున్నది వస్త్రమువలె వారు బలాత్కారము ధరించుకొందురు.
కీర్తనల గ్రంథము 73 : 7 (TEV)
క్రొవ్వుచేత వారి కన్నులు మెరకలై యున్నవి వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చు చున్నవి
కీర్తనల గ్రంథము 73 : 8 (TEV)
ఎగతాళి చేయుచు బలాత్కారముచేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు. గర్వముగా మాటలాడుదురు.
కీర్తనల గ్రంథము 73 : 9 (TEV)
ఆకాశముతట్టు వారు ముఖము ఎత్తుదురు వారి నాలుక భూసంచారము చేయును.
కీర్తనల గ్రంథము 73 : 10 (TEV)
వారి జనము వారిపక్షము చేరును వారు జలపానము సమృద్ధిగా చేయుదురు.
కీర్తనల గ్రంథము 73 : 11 (TEV)
దేవుడు ఎట్లు తెలిసికొనును మహోన్నతునికి తెలివియున్నదా? అని వారను కొందురు.
కీర్తనల గ్రంథము 73 : 12 (TEV)
ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు. వీరు ఎల్లప్పుడు నిశ్చింతగలవారై ధనవృద్ధి చేసికొందురు.
కీర్తనల గ్రంథము 73 : 13 (TEV)
నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే
కీర్తనల గ్రంథము 73 : 14 (TEV)
దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది.
కీర్తనల గ్రంథము 73 : 15 (TEV)
ఈలాగు ముచ్చటింతునని నేననుకొనినయెడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చినవాడ నగుదును.
కీర్తనల గ్రంథము 73 : 16 (TEV)
అయినను దీనిని తెలిసికొనవలెనని ఆలోచించినప్పుడు
కీర్తనల గ్రంథము 73 : 17 (TEV)
నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమునుగూర్చి ధ్యానించువరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను.
కీర్తనల గ్రంథము 73 : 18 (TEV)
నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచియున్నావు వారు నశించునట్లు వారిని పడవేయుచున్నావు
కీర్తనల గ్రంథము 73 : 19 (TEV)
క్షణమాత్రములోనే వారు పాడై పోవుదురు మహాభయముచేత వారు కడముట్ట నశించుదురు.
కీర్తనల గ్రంథము 73 : 20 (TEV)
మేలుకొనినవాడు తాను కన్న కల మరచిపోవునట్లు ప్రభువా, నీవు మేలుకొని వారి బ్రదుకును తృణీక రింతువు.
కీర్తనల గ్రంథము 73 : 21 (TEV)
నా హృదయము మత్సరపడెను. నా అంతరింద్రియములలో నేను వ్యాకులపడితిని.
కీర్తనల గ్రంథము 73 : 22 (TEV)
నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని నీ సన్నిధిని మృగమువంటి వాడనైతిని.
కీర్తనల గ్రంథము 73 : 23 (TEV)
అయినను నేను ఎల్లప్పుడు నీయొద్దనున్నాను నా కుడిచెయ్యి నీవు పట్టుకొని యున్నావు.
కీర్తనల గ్రంథము 73 : 24 (TEV)
నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు
కీర్తనల గ్రంథము 73 : 25 (TEV)
ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు.
కీర్తనల గ్రంథము 73 : 26 (TEV)
నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు.
కీర్తనల గ్రంథము 73 : 27 (TEV)
నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించువారినందరిని నీవు సంహ రించెదవు.
కీర్తనల గ్రంథము 73 : 28 (TEV)
నాకైతే దేవుని పొందు ధన్యకరము నీ సర్వకార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చియున్నాను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: