కీర్తనల గ్రంథము 75 : 1 (TEV)
దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు.
కీర్తనల గ్రంథము 75 : 2 (TEV)
నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను.
కీర్తనల గ్రంథము 75 : 3 (TEV)
భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును.(సెలా.)
కీర్తనల గ్రంథము 75 : 4 (TEV)
అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
కీర్తనల గ్రంథము 75 : 5 (TEV)
కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను.
కీర్తనల గ్రంథము 75 : 6 (TEV)
తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు.
కీర్తనల గ్రంథము 75 : 7 (TEV)
దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును
కీర్తనల గ్రంథము 75 : 8 (TEV)
యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను.
కీర్తనల గ్రంథము 75 : 9 (TEV)
నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను.
కీర్తనల గ్రంథము 75 : 10 (TEV)
భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: