కీర్తనల గ్రంథము 76 : 1 (TEV)
యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది.
కీర్తనల గ్రంథము 76 : 2 (TEV)
షాలేములో ఆయన గుడారమున్నది సీయోనులో ఆయన ఆలయమున్నది.
కీర్తనల గ్రంథము 76 : 3 (TEV)
అక్కడ వింటి అగ్ని బాణములను కేడెములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగగొట్టెను.(సెలా.)
కీర్తనల గ్రంథము 76 : 4 (TEV)
దుష్టమృగములుండు పర్వతముల సౌందర్యముకంటె నీవు అధిక తేజస్సుగలవాడవు.
కీర్తనల గ్రంథము 76 : 5 (TEV)
కఠినహృదయులు దోచుకొనబడి యున్నారు వారు నిద్రనొంది యున్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించెను.
కీర్తనల గ్రంథము 76 : 6 (TEV)
యాకోబు దేవా, నీ గద్దింపునకు రథసారథులకును గుఱ్ఱములకును గాఢనిద్ర కలిగెను.
కీర్తనల గ్రంథము 76 : 7 (TEV)
నీవు, నీవే భయంకరుడవు నీవు కోపపడు వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు?
కీర్తనల గ్రంథము 76 : 8 (TEV)
నీవు తీర్చిన తీర్పు ఆకాశములోనుండి వినబడజేసితివి
కీర్తనల గ్రంథము 76 : 9 (TEV)
దేశములో శ్రమనొందిన వారినందరిని రక్షించుటకై న్యాయపుతీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను.(సెలా.)
కీర్తనల గ్రంథము 76 : 10 (TEV)
నరుల ఆగ్రహము నిన్ను స్తుతించును ఆగ్రహశేషమును నీవు ధరించుకొందువు.
కీర్తనల గ్రంథము 76 : 11 (TEV)
మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టునున్నవారందరు భయంకరుడగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను.
కీర్తనల గ్రంథము 76 : 12 (TEV)
అధికారుల పొగరును ఆయన అణచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు.
❮
❯