కీర్తనల గ్రంథము 77 : 1 (TEV)
నేను ఎలుగెత్తి దేవునికి మొఱ్ఱపెట్టుదును ఆయనకు మనవి చేయుదును దేవుడు నాకు చెవియొగ్గువరకు నేను ఎలుగెత్తి ఆయ నకు మనవి చేయుదును.
కీర్తనల గ్రంథము 77 : 2 (TEV)
నా ఆపత్కాలమందు నేను ప్రభువును వెదకితిని రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండ చాప బడియున్నది. నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక యున్నది.
కీర్తనల గ్రంథము 77 : 3 (TEV)
దేవుని జ్ఞాపకము చేసికొనునప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను నేను ధ్యానించునప్పుడు నా ఆత్మ క్రుంగిపోవుచున్నది (సెలా.)
కీర్తనల గ్రంథము 77 : 4 (TEV)
నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేక యున్నాను.
కీర్తనల గ్రంథము 77 : 5 (TEV)
తొల్లిటి దినములను, పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును.
కీర్తనల గ్రంథము 77 : 6 (TEV)
నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకము చేసి కొందును హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ నీ తీర్పుమార్గము శ్రద్ధగా వెదకెను.
కీర్తనల గ్రంథము 77 : 7 (TEV)
ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?
కీర్తనల గ్రంథము 77 : 8 (TEV)
ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పి పోయెనా?
కీర్తనల గ్రంథము 77 : 9 (TEV)
దేవుడు కటాక్షింప మానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)
కీర్తనల గ్రంథము 77 : 10 (TEV)
అందుకునేనీలాగు అనుకొనుచున్నాను మహోన్నతుని దక్షిణహస్తము మార్పునొందెననుకొను టకు నాకు కలిగిన శ్రమయే కారణము.
కీర్తనల గ్రంథము 77 : 11 (TEV)
యెహోవా చేసిన కార్యములను,పూర్వము జరిగిన నీ ఆశ్చర్యకార్యములను నేను మనస్సునకు తెచ్చుకొందును
కీర్తనల గ్రంథము 77 : 12 (TEV)
నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును నీ క్రియలను నేను ధ్యానించుకొందును.
కీర్తనల గ్రంథము 77 : 13 (TEV)
#NAME?
కీర్తనల గ్రంథము 77 : 14 (TEV)
ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని యున్నావు.
కీర్తనల గ్రంథము 77 : 15 (TEV)
నీ బాహుబలమువలన యాకోబు యోసేపుల సంతతి వారగు నీ ప్రజలను నీవు విమోచించియున్నావు.
కీర్తనల గ్రంథము 77 : 16 (TEV)
దేవా, జలములు నిన్ను చూచెను జలములు నిన్ను చూచి దిగులుపడెను అగాధజలములు గజగజలాడెను.
కీర్తనల గ్రంథము 77 : 17 (TEV)
మేఘరాసులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను.
కీర్తనల గ్రంథము 77 : 18 (TEV)
నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను భూమి వణకి కంపించెను.
కీర్తనల గ్రంథము 77 : 19 (TEV)
నీ మార్గము సముద్రములో నుండెను. నీ త్రోవలు మహా జలములలో ఉండెను. నీ యడుగుజాడలు గుర్తింపబడక యుండెను.
కీర్తనల గ్రంథము 77 : 20 (TEV)
మాషే అహరోనులచేత నీ ప్రజలను మందవలె నడి పించితివి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: