కీర్తనల గ్రంథము 83 : 1 (TEV)
దేవా, ఊరకుండకుము దేవా, మౌనముగా ఉండకుము ఊరకుండకుము.
కీర్తనల గ్రంథము 83 : 2 (TEV)
నీ శత్రువులు అల్లరిచేయుచున్నారు నిన్ను ద్వేషించువారు తల యెత్తి యున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 3 (TEV)
నీ ప్రజలమీద వారు కపటోపాయములు పన్ను చున్నారు నీ మరుగుజొచ్చిన వారిమీద ఆలోచన చేయు చున్నారు
కీర్తనల గ్రంథము 83 : 4 (TEV)
వారుఇశ్రాయేలను పేరు ఇకను జ్ఞాపకము రాక పోవునట్లు జనముగా నుండకుండ వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 5 (TEV)
ఏకమనస్సుతో వారు ఆలోచన చేసికొనియున్నారు నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 6 (TEV)
గుడారపువాసులైన ఎదోమీయులును ఇష్మాయేలీయు లును మోయాబీయులును హగ్రీయీలును
కీర్తనల గ్రంథము 83 : 7 (TEV)
గెబలువారును అమ్మోనీయులును అమాలేకీయులును ఫిలిష్తీయులును తూరు నివాసులును నీకు విరోధముగా నిబంధన చేసికొనియున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 8 (TEV)
అష్షూరు దేశస్థులు వారితో కలిసియున్నారు లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు.(సెలా.)
కీర్తనల గ్రంథము 83 : 9 (TEV)
మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.
కీర్తనల గ్రంథము 83 : 10 (TEV)
వారు ఏన్దోరులో నశించిరి భూమికి పెంట అయిరి.
కీర్తనల గ్రంథము 83 : 11 (TEV)
ఓరేబు జెయేబు అనువారికి నీవు చేసినట్లు వారి ప్రధానులకును చేయుము జెబహు సల్మున్నా అనువారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము.
కీర్తనల గ్రంథము 83 : 12 (TEV)
దేవుని నివాసస్థలములను మనము ఆక్రమించు కొందమని వారు చెప్పుకొనుచున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 13 (TEV)
నా దేవా, సుడి తిరుగు ధూళివలెను గాలి యెదుటి వగుడాకులవలెను వారిని చేయుము
కీర్తనల గ్రంథము 83 : 14 (TEV)
అగ్ని అడవిని కాల్చునట్లు కారుచిచ్చు కొండలను తగుల పెట్టునట్లు
కీర్తనల గ్రంథము 83 : 15 (TEV)
నీ తుపానుచేత వారిని తరుముము నీ సుడిగాలిచేత వారికి భీతి పుట్టించుము.
కీర్తనల గ్రంథము 83 : 16 (TEV)
యెహోవా, వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము.
కీర్తనల గ్రంథము 83 : 17 (TEV)
వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురు గాక వారు భ్రమసి నశించుదురు గాక.
కీర్తనల గ్రంథము 83 : 18 (TEV)
యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురు గాక.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18