కీర్తనల గ్రంథము 85 : 1 (TEV)
యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు.
కీర్తనల గ్రంథము 85 : 2 (TEV)
నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.)
కీర్తనల గ్రంథము 85 : 3 (TEV)
నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు
కీర్తనల గ్రంథము 85 : 4 (TEV)
మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.మా మీదనున్న నీ కోపము చాలించుము.
కీర్తనల గ్రంథము 85 : 5 (TEV)
ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా?
కీర్తనల గ్రంథము 85 : 6 (TEV)
నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా?
కీర్తనల గ్రంథము 85 : 7 (TEV)
యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము.
కీర్తనల గ్రంథము 85 : 8 (TEV)
దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక.
కీర్తనల గ్రంథము 85 : 9 (TEV)
మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది.
కీర్తనల గ్రంథము 85 : 10 (TEV)
కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి.
కీర్తనల గ్రంథము 85 : 11 (TEV)
భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును.
కీర్తనల గ్రంథము 85 : 12 (TEV)
యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును.
కీర్తనల గ్రంథము 85 : 13 (TEV)
నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13