కీర్తనల గ్రంథము 91 : 1 (TEV)
మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు.
కీర్తనల గ్రంథము 91 : 2 (TEV)
ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ము కొను నా దేవుడని నేను యెహోవానుగూర్చి చెప్పుచున్నాను.
కీర్తనల గ్రంథము 91 : 3 (TEV)
వేటకాని ఉరిలోనుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండ నిన్ను రక్షించును
కీర్తనల గ్రంథము 91 : 4 (TEV)
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము, కేడెమును డాలునై యున్నది.
కీర్తనల గ్రంథము 91 : 5 (TEV)
రాత్రివేళ కలుగు భయమునకైనను పగటివేళ ఎగురు బాణమునకైనను
కీర్తనల గ్రంథము 91 : 6 (TEV)
చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయు రోగమునకైనను నీవు భయపడకుందువు.
కీర్తనల గ్రంథము 91 : 7 (TEV)
నీ ప్రక్కను వేయి మంది పడినను నీ కుడిప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొద్దకురాదు.
కీర్తనల గ్రంథము 91 : 8 (TEV)
నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును
కీర్తనల గ్రంథము 91 : 9 (TEV)
యెహోవా, నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసికొనియున్నావు
కీర్తనల గ్రంథము 91 : 10 (TEV)
నీకు అపాయమేమియు రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు
కీర్తనల గ్రంథము 91 : 11 (TEV)
నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును
కీర్తనల గ్రంథము 91 : 12 (TEV)
నీ పాదములకు రాయి తగులకుండ వారు నిన్ను తమ చేతులమీద ఎత్తి పట్టుకొం దురు
కీర్తనల గ్రంథము 91 : 13 (TEV)
నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు.
కీర్తనల గ్రంథము 91 : 14 (TEV)
అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను
కీర్తనల గ్రంథము 91 : 15 (TEV)
అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చె దను శ్రమలో నేనతనికి తోడై యుండెదను అతని విడిపించి అతని గొప్ప చేసెదను
కీర్తనల గ్రంథము 91 : 16 (TEV)
దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

BG:

Opacity:

Color:


Size:


Font: