కీర్తనల గ్రంథము 94 : 1 (TEV)
యెహోవా, ప్రతికారముచేయు దేవా, ప్రతికారముచేయు దేవా, ప్రకాశింపుము
కీర్తనల గ్రంథము 94 : 2 (TEV)
భూలోక న్యాయాధిపతీ లెమ్ము గర్విష్టులకు ప్రతిఫలమిమ్ము
కీర్తనల గ్రంథము 94 : 3 (TEV)
యెహోవా, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు? భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు?
కీర్తనల గ్రంథము 94 : 4 (TEV)
వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు దోషము చేయువారందరు బింకములాడు చున్నారు.
కీర్తనల గ్రంథము 94 : 5 (TEV)
యెహోవా చూచుటలేదు యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని
కీర్తనల గ్రంథము 94 : 6 (TEV)
యెహోవా, వారు నీ ప్రజలను నలుగగొట్టుచున్నారు నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు
కీర్తనల గ్రంథము 94 : 7 (TEV)
విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు తండ్రిలేనివారిని హతముచేయుచున్నారు.
కీర్తనల గ్రంథము 94 : 8 (TEV)
జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుదురు?
కీర్తనల గ్రంథము 94 : 9 (TEV)
చెవులను కలుగచేసినవాడు వినకుండునా? కంటిని నిర్మించినవాడు కానకుండునా?
కీర్తనల గ్రంథము 94 : 10 (TEV)
అన్యుజనులను శిక్షించువాడు మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపకమానునా?
కీర్తనల గ్రంథము 94 : 11 (TEV)
నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసి యున్నది.
కీర్తనల గ్రంథము 94 : 12 (TEV)
యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 94 : 13 (TEV)
భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు.
కీర్తనల గ్రంథము 94 : 14 (TEV)
యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు.
కీర్తనల గ్రంథము 94 : 15 (TEV)
నీతిని స్థాపించుటకై న్యాయపుతీర్పు జరుగును యథార్థహృదయులందరు దాని ననుసరించెదరు.
కీర్తనల గ్రంథము 94 : 16 (TEV)
దుష్టులమీదికి నా పక్షమున ఎవడు లేచును? దోషము చేయువారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును?
కీర్తనల గ్రంథము 94 : 17 (TEV)
యెహోవా నాకు సహాయము చేసియుండని యెడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి యుండును.
కీర్తనల గ్రంథము 94 : 18 (TEV)
నాకాలు జారెనని నేననుకొనగా యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది.
కీర్తనల గ్రంథము 94 : 19 (TEV)
నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది.
కీర్తనల గ్రంథము 94 : 20 (TEV)
కట్టడవలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందుకలుగునా?
కీర్తనల గ్రంథము 94 : 21 (TEV)
దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారిమీద పడుదురు దోషులని నిర్దోషులకు మరణము విధించుదురు.
కీర్తనల గ్రంథము 94 : 22 (TEV)
యెహోవా నాకు ఎత్తయిన కోట నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము.
కీర్తనల గ్రంథము 94 : 23 (TEV)
ఆయన వారిదోషము వారిమీదికి రప్పించును వారి చెడుతనమునుబట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: