కీర్తనల గ్రంథము 95 : 1 (TEV)
రండి యెహోవానుగూర్చి ఉత్సాహధ్వని చేయు... దము మన రక్షణ దుర్గమునుబట్టి సంతోషగానము చేయు దము
కీర్తనల గ్రంథము 95 : 2 (TEV)
కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము.
కీర్తనల గ్రంథము 95 : 3 (TEV)
యెహోవా మహా దేవుడు దేవతలందరికి పైన మహాత్మ్యముగల మహారాజు
కీర్తనల గ్రంథము 95 : 4 (TEV)
భూమ్యగాధస్థలములు ఆయన చేతిలోనున్నవి పర్వతశిఖరములు ఆయనవే.
కీర్తనల గ్రంథము 95 : 5 (TEV)
సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను.
కీర్తనల గ్రంథము 95 : 6 (TEV)
ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
కీర్తనల గ్రంథము 95 : 7 (TEV)
రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించు దము నేడు మీరు ఆయన మాట నంగీకరించినయెడల ఎంత మేలు.
కీర్తనల గ్రంథము 95 : 8 (TEV)
అరణ్యమందు మెరీబాయొద్ద మీరు కఠినపరచుకొని నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి.
కీర్తనల గ్రంథము 95 : 9 (TEV)
అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి
కీర్తనల గ్రంథము 95 : 10 (TEV)
నలువది ఏండ్లకాలము ఆ తరమువారివలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలిసికొనలేదని అనుకొంటిని.
కీర్తనల గ్రంథము 95 : 11 (TEV)
కావున నేను కోపించివీరెన్నడును నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసితిని.

1 2 3 4 5 6 7 8 9 10 11