కీర్తనల గ్రంథము 97 : 1 (TEV)
యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూ లోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక.
కీర్తనల గ్రంథము 97 : 2 (TEV)
మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
కీర్తనల గ్రంథము 97 : 3 (TEV)
అగ్ని ఆయనకు ముందు నడచుచున్నది అది చుట్టునున్న ఆయన శత్రువులను కాల్చివేయు చున్నది.
కీర్తనల గ్రంథము 97 : 4 (TEV)
ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయు చున్నవి భూమి దాని చూచి కంపించుచున్నది.
కీర్తనల గ్రంథము 97 : 5 (TEV)
యెహోవా సన్నిధిని సర్వలోకనాధుని సన్నిధిని పర్వతములు మైనమువలె కరగుచున్నవి.
కీర్తనల గ్రంథము 97 : 6 (TEV)
ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది
కీర్తనల గ్రంథము 97 : 7 (TEV)
వ్యర్థ విగ్రహములనుబట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించువారందరు సిగ్గుపడు దురు సకలదేవతలు ఆయనకు నమస్కారము చేయును.
కీర్తనల గ్రంథము 97 : 8 (TEV)
యెహోవా, సీయోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులనుబట్టి సంతోషించుచున్నారు యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు.
కీర్తనల గ్రంథము 97 : 9 (TEV)
ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై యున్నావు సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్న త్యము పొందియున్నావు.
కీర్తనల గ్రంథము 97 : 10 (TEV)
యెహోవాను ప్రేమించువారలారా, చెడుతనమును అసహ్యించుకొనుడి తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనులచేతిలోనుండి ఆయన వారిని విడిపించును.
కీర్తనల గ్రంథము 97 : 11 (TEV)
నీతిమంతులకొరకు వెలుగును యథార్థహృదయులకొరకు ఆనందమును విత్తబడి యున్నవి.
కీర్తనల గ్రంథము 97 : 12 (TEV)
నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి ఆయన పరిశుద్ధనామమునుబట్టి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12