కీర్తనల గ్రంథము 99 : 1 (TEV)
యెహోవా రాజ్యము చేయుచున్నాడు జనములు వణకును ఆయన కెరూబులమీద ఆసీనుడై యున్నాడు భూమి కదలును.
కీర్తనల గ్రంథము 99 : 2 (TEV)
సీయోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు.
కీర్తనల గ్రంథము 99 : 3 (TEV)
భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించె దరు. యెహోవా పరిశుద్ధుడు.
కీర్తనల గ్రంథము 99 : 4 (TEV)
యథార్థతనుబట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరచియున్నావు యాకోబు సంతతిమధ్య నీవు నీతి న్యాయములను జరిగించియున్నావు.
కీర్తనల గ్రంథము 99 : 5 (TEV)
మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి ఆయన పరిశుద్ధుడు.
కీర్తనల గ్రంథము 99 : 6 (TEV)
ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి ఆయన నామమునుబట్టి ప్రార్థన చేయువారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొఱ్ఱపెట్టగా ఆయన వారి కుత్తరమిచ్చెను.
కీర్తనల గ్రంథము 99 : 7 (TEV)
మేఘస్తంభములోనుండి ఆయన వారితో మాట లాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి
కీర్తనల గ్రంథము 99 : 8 (TEV)
యెహోవా మా దేవా, నీవు వారికుత్తరమిచ్చితివి వారిక్రియలను బట్టి ప్రతికారము చేయుచునే వారి విషయములో నీవు పాపము పరిహరించు దేవుడ వైతివి.
కీర్తనల గ్రంథము 99 : 9 (TEV)
మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: