ప్రకటన గ్రంథము 12 : 1 (TEV)
అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన యొక స్త్రీ ఆమె పాదములక్రిందచంద్రుడును శిరస్సుమీద పండ్రెండు నక్షత్రముల కిరీటమును
ప్రకటన గ్రంథము 12 : 2 (TEV)
ఆమె గర్భిణియై ప్రసవవేదనపడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను.
ప్రకటన గ్రంథము 12 : 3 (TEV)
అంతట పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో యెఱ్ఱని మహాఘటసర్పము; దానికి ఏడు తలలును పది కొమ్ములును ఉండెను; దాని తలలమీద ఏడు కిరీటము లుండెను.
ప్రకటన గ్రంథము 12 : 4 (TEV)
దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగము నీడ్చి వాటిని భూమిమీద పడవేసెను. కననైయున్న ఆ స్త్రీ కనగానే, ఆమె శిశువును మింగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ యెదుట నిలుచుండెను.
ప్రకటన గ్రంథము 12 : 5 (TEV)
సమస్త జనములను ఇనుపదండముతో ఏలనైయున్న యొక మగశిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవునియొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను.
ప్రకటన గ్రంథము 12 : 6 (TEV)
ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను; అచ్చట వారు వెయ్యిన్ని రెండువందల అరువది దినములు ఆమెను పోషింపవలెనని దేవుడామెకు ఒక స్థలము సిద్ధపరచియుంచెను.
ప్రకటన గ్రంథము 12 : 7 (TEV)
అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖా యేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా
ప్రకటన గ్రంథము 12 : 8 (TEV)
ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను.
ప్రకటన గ్రంథము 12 : 9 (TEV)
కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి.
ప్రకటన గ్రంథము 12 : 10 (TEV)
మరియు ఒక గొప్ప స్వరము పరలోక మందు ఈలాగు చెప్పుట వింటినిరాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను.
ప్రకటన గ్రంథము 12 : 11 (TEV)
వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్య మునుబట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు.
ప్రకటన గ్రంథము 12 : 12 (TEV)
అందుచేత పరలోకమా, పరలోకనివాసులారా, ఉత్సహించుడి; భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగి
ప్రకటన గ్రంథము 12 : 13 (TEV)
ఆ ఘటసర్పము తాను భూమిమీద పడద్రోయబడి యుండుట చూచి, ఆ మగశిశువును కనిన స్త్రీని హింసిం చెను;
ప్రకటన గ్రంథము 12 : 14 (TEV)
అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు రెండు ఆమెకు ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పముఖమును చూడ కుండ ఆమె ఒకకాలము కాలములు అర్ధకాలము పోషిం
ప్రకటన గ్రంథము 12 : 15 (TEV)
కావున ఆ స్త్రీ, ప్రవాహమునకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోటినుండి నీళ్లు నదీప్రవాహముగా ఆమె వెనుక వెళ్లగ్రక్కెనుగాని
ప్రకటన గ్రంథము 12 : 16 (TEV)
భూమి ఆ స్త్రీకి సహకారియై తన నోరు తెరచి ఆ ఘటసర్పము, తన నోటనుండి గ్రక్కిన ప్రవాహమును మింగివేసెను.
ప్రకటన గ్రంథము 12 : 17 (TEV)
అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని, దేవుని అజ్ఞలు గైకొనుచు యేసునుగూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: