ప్రకటన గ్రంథము 8 : 1 (TEV)
ఆయన యేడవ ముద్రను విప్పినప్పుడు పరలోక మందు ఇంచుమించు అరగంటసేపు నిశ్శబ్దముగా ఉండెను.
ప్రకటన గ్రంథము 8 : 2 (TEV)
అంతట నేను దేవునియెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
ప్రకటన గ్రంథము 8 : 3 (TEV)
మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహా సనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
ప్రకటన గ్రంథము 8 : 4 (TEV)
అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను.
ప్రకటన గ్రంథము 8 : 5 (TEV)
ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను.
ప్రకటన గ్రంథము 8 : 6 (TEV)
అంతట ఏడు బూరలు పట్టుకొనియున్న ఆ యేడుగురు దూతలు ఊదుటకు సిద్ధపడిరి.
ప్రకటన గ్రంథము 8 : 7 (TEV)
మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
ప్రకటన గ్రంథము 8 : 8 (TEV)
రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.
ప్రకటన గ్రంథము 8 : 9 (TEV)
సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
ప్రకటన గ్రంథము 8 : 10 (TEV)
మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగముమీదను నీటిబుగ్గల మీదను పడెను.
ప్రకటన గ్రంథము 8 : 11 (TEV)
ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.
ప్రకటన గ్రంథము 8 : 12 (TEV)
నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
ప్రకటన గ్రంథము 8 : 13 (TEV)
మరియు నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు--బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములనుబట్టి భూనివాసులకు అయ్యో, అయ్యో, అయ్యో, అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: