పవిత్ర బైబిల్

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు
లేవీయకాండము

లేవీయకాండము అధ్యాయము 3

శాంతిబలి 1 “ఎవరైనా ఒక మంద లోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా అర్పించాలనుకుంటే, అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి. 2 అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. 3 అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వునూ, మూత్రపిండాలనూ, వాటిపైన కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి. 4 వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి. 5 అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది. 6 ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే, అతడు లోపం లేని దాన్ని అర్పించాలి. 7 తన అర్పణ కోసం గొర్రె పిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి. 8 తాను అర్పించబోయే దాని తల మీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. 9 ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి. 10 అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ కూడా వేరు చేయాలి. 11 వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి. 12 అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి. 13 ఆ వ్యక్తి దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. 14 తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి. 15 అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి. 16 వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది. 17 మీరు రక్తాన్ని గానీ కొవ్వుని గానీ తినకూడదు. మీరు నివాసముండే ప్రతిచోటా, మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం.”
1. {#1శాంతిబలి } “ఎవరైనా ఒక మంద లోని పశువుల్లో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా అర్పించాలనుకుంటే, అతడు లోపం లేని దాన్ని యెహోవా సన్నిధిలో అర్పించాలి. 2. అతడు తాను అర్పించబోయే పశువు తలపై తన చేతిని ఉంచాలి. తరువాత ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర దాన్ని వధించాలి. అప్పుడు యాజకులైన అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. 3. అతడు ఆ పశువు లోపలి భాగాలకు అంటి ఉన్న కొవ్వునూ, మూత్రపిండాలనూ, వాటిపైన కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ వేరు చేయాలి. 4. వాటిని యెహోవాకు శాంతి బలి అర్పణగా దహించాలి. 5. అహరోను కొడుకులు వాటిని బలిపీఠం మీద నిప్పులపై పేర్చిన కట్టెల పైన ఉన్న దహనబలి తో పాటు దహిస్తారు. అది యెహోవా కోసం కమ్మని సువాసనను కలుగజేస్తుంది. అది అగ్నితో చేసిన అర్పణగా ఉంటుంది. 6. ఎవరైనా ఒక గొర్రెల లేక మేకల మందలో నుండి ఒక మగదాన్ని గానీ ఆడదాన్ని గానీ శాంతిబలిగా యెహోవాకు అర్పించదలిస్తే, అతడు లోపం లేని దాన్ని అర్పించాలి. 7. తన అర్పణ కోసం గొర్రె పిల్లని అర్పించాలనుకుంటే దాన్ని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలి. 8. తాను అర్పించబోయే దాని తల మీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. 9. ఆ వ్యక్తి శాంతిబలి అర్పణను దహనబలి అర్పణగా యెహోవాకు అర్పిస్తాడు. ఆ బలి పశువు కొవ్వునూ, వెన్నెముక చివర వరకూ ఉండే కొవ్వు పట్టిన తోకనంతా, దాని అంతర్భాగాలకి పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి. 10. అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వునూ, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వునూ కూడా వేరు చేయాలి. 11. వీటన్నిటినీ యాజకుడు బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. ఇది యెహోవాకి అర్పించే దహనబలి. 12. అతడు అర్పించేది మేక అయితే దాన్ని యెహోవా ఎదుట అర్పించాలి. 13. ఆ వ్యక్తి దాని తల మీద చెయ్యి ఉంచి ప్రత్యక్ష గుడారం ఎదుట దాన్ని వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు. 14. తన అర్పణను దహనబలిగా యెహోవాకు అర్పిస్తాడు. అతడు దాని అంతర్భాగాలకు పట్టి ఉన్న కొవ్వునూ, వాటి దగ్గరలో కనిపించే కొవ్వునూ తీసి వేరు చేయాలి. 15. అలాగే రెండు మూత్ర పిండాలనూ, వాటితో ఉన్న కొవ్వును, మూత్రపిండాల దగ్గర కాలేయాన్ని అంటి ఉన్న కొవ్వును కూడా వేరు చేయాలి. 16. వీటన్నిటినీ యాజకుడు కమ్మని సువాసన వచ్చేలా బలిపీఠం పైన ఆహారంగా కాలుస్తాడు. కొవ్వు అంతా యెహోవాకే చెందుతుంది. 17. మీరు రక్తాన్ని గానీ కొవ్వుని గానీ తినకూడదు. మీరు నివాసముండే ప్రతిచోటా, మీ తరతరాల్లో ఇది మీకు శాశ్వతమైన శాసనం.”
  • లేవీయకాండము అధ్యాయము 1  
  • లేవీయకాండము అధ్యాయము 2  
  • లేవీయకాండము అధ్యాయము 3  
  • లేవీయకాండము అధ్యాయము 4  
  • లేవీయకాండము అధ్యాయము 5  
  • లేవీయకాండము అధ్యాయము 6  
  • లేవీయకాండము అధ్యాయము 7  
  • లేవీయకాండము అధ్యాయము 8  
  • లేవీయకాండము అధ్యాయము 9  
  • లేవీయకాండము అధ్యాయము 10  
  • లేవీయకాండము అధ్యాయము 11  
  • లేవీయకాండము అధ్యాయము 12  
  • లేవీయకాండము అధ్యాయము 13  
  • లేవీయకాండము అధ్యాయము 14  
  • లేవీయకాండము అధ్యాయము 15  
  • లేవీయకాండము అధ్యాయము 16  
  • లేవీయకాండము అధ్యాయము 17  
  • లేవీయకాండము అధ్యాయము 18  
  • లేవీయకాండము అధ్యాయము 19  
  • లేవీయకాండము అధ్యాయము 20  
  • లేవీయకాండము అధ్యాయము 21  
  • లేవీయకాండము అధ్యాయము 22  
  • లేవీయకాండము అధ్యాయము 23  
  • లేవీయకాండము అధ్యాయము 24  
  • లేవీయకాండము అధ్యాయము 25  
  • లేవీయకాండము అధ్యాయము 26  
  • లేవీయకాండము అధ్యాయము 27  
×

Alert

×

Telugu Letters Keypad References