పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
యెహెజ్కేలు

గమనికలు

No Verse Added

యెహెజ్కేలు అధ్యాయము 8

1. ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను. 2. అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను. 3. మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూష లేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను. 4. అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. 5. నర పుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. 6. అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు. 7. అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కన బడెను. 8. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వు మని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను. 9. నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయు చున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా 10. నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహ ములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను. 11. మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను. 12. అప్పుడా యన నాకు సెలవిచ్చినదేమనగానరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశ మును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా. 13. మరియు ఆయననీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి 14. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని. 15. అప్పుడాయననరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి 16. యెహోవా మందిరపు లోపలి ఆవరణ ములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమున కును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మను ష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయు చుండిరి. 17. అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. 18. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును.
1. ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను. .::. 2. అంతట నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను, నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజియైనట్టుగాను ఆయన నాకు కనబడెను. .::. 3. మరియు చెయ్యివంటిది ఒకటి ఆయన చాపి నా తలవెండ్రుకలు పట్టుకొనగా ఆత్మ భూమ్యాకాశముల మధ్యకు నన్నెత్తి, నేను దేవుని దర్శనములను చూచుచుండగా యెరూష లేమునకు ఉత్తరపువైపుననున్న ఆవరణ ద్వారముదగ్గర రోషము పుట్టించు విగ్రహస్థానములో నన్ను దించెను. .::. 4. అంతట లోయలో నాకు కనబడిన దర్శనరూపముగా ఇశ్రాయేలీయుల దేవుని ప్రభావము అచ్చట కనబడెను. .::. 5. నర పుత్రుడా, ఉత్తరపువైపు తేరి చూడుమని యెహోవా నాకు సెలవియ్యగా నేను ఉత్తరపువైపు తేరి చూచితిని; ఉత్తరపువైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించు ఈ విగ్రహము కనబడెను. .::. 6. అంతట ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనునరపుత్రుడా, వారు చేయు దానిని నీవు చూచుచున్నావు గదా; నా పరిశుద్ధస్థలమును నేను విడిచిపోవునట్లుగా ఇశ్రాయేలీయులు ఇక్కడ చేయు అత్యధికమైన హేయకృత్యములు చూచితివా? యీతట్టు తిరిగినయెడల వీటికంటె మరి యధికమైన హేయక్రియలు చూచెదవు. .::. 7. అప్పుడు ఆవరణద్వారముదగ్గర నన్ను ఆయన దింపగా గోడలోనున్న సందు ఒకటి నాకు కన బడెను. .::. 8. నరపుత్రుడా, ఆ గోడకు కన్నము త్రవ్వు మని ఆయన నాకు సెలవియ్యగా నేను గోడకు కన్నము త్రవ్వినంతలో ద్వారమొకటి కనబడెను. .::. 9. నీవు లోపలికి చొచ్చి, యిక్కడ వారెట్టి హేయకృత్యములు చేయు చున్నారో చూడుమని ఆయన నాకు సెలవియ్యగా .::. 10. నేను లోపలికి పోయి చూచితిని; అప్పుడు ప్రాకెడి సకల జంతువుల ఆకారములును హేయమైన మృగముల ఆకారములును, అనగా ఇశ్రాయేలీయుల దేవతల విగ్రహ ములన్నియు గోడమీద చుట్టును వ్రాయబడియున్నట్టు కనబడెను. .::. 11. మరియు ఒక్కొకడు తన చేతిలో ధూపార్తి పట్టుకొని ఇశ్రాయేలీయుల పెద్దలు డెబ్బది మందియు, వారిమధ్యను షాఫాను కుమారుడైన యజన్యాయు, ఆ యాకారములకు ఎదురుగా నిలిచి యుండగా, చిక్కని మేఘమువలె ధూపవాసన ఎక్కుచుండెను. .::. 12. అప్పుడా యన నాకు సెలవిచ్చినదేమనగానరపుత్రుడా యెహోవా మమ్మును కానక యుండును, యెహోవా దేశ మును విసర్జించెను అని యనుకొని, ఇశ్రాయేలీయుల పెద్దలు చీకటిలో తమ విగ్రహపు గదులలో వారిలో ప్రతివాడు చేయుదానిని నీవు చూచుచున్నావు గదా. .::. 13. మరియు ఆయననీవు ఈతట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయకృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి .::. 14. యెహోవా మందిరపు ఉత్తర ద్వారము దగ్గర నన్ను దింపగా, అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతనుగూర్చి యేడ్చుట చూచితిని. .::. 15. అప్పుడాయననరపుత్రుడా, యిది చూచితివి గాని నీవు తిరిగి చూచిన యెడల వీటిని మించిన హేయకృత్యములు చూతువని నాతో చెప్పి .::. 16. యెహోవా మందిరపు లోపలి ఆవరణ ములో నన్ను దింపగా, అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖమంటపమునకును బలిపీఠమున కును మధ్యను ఇంచుమించు ఇరువది యయిదుగురు మను ష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును వారి ముఖములు తూర్పుతట్టును తిరిగి యుండెను; వారు తూర్పున నున్న సూర్యునికి నమస్కారము చేయు చుండిరి. .::. 17. అప్పుడాయన నాతో ఇట్లనెనునరపుత్రుడా, నీవు చూచితివే; యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలా త్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు, తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. .::. 18. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరచి, వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొఱ్ఱపెట్టినను నేను ఆలకింప కుందును. .::.
  • యెహెజ్కేలు అధ్యాయము 1  
  • యెహెజ్కేలు అధ్యాయము 2  
  • యెహెజ్కేలు అధ్యాయము 3  
  • యెహెజ్కేలు అధ్యాయము 4  
  • యెహెజ్కేలు అధ్యాయము 5  
  • యెహెజ్కేలు అధ్యాయము 6  
  • యెహెజ్కేలు అధ్యాయము 7  
  • యెహెజ్కేలు అధ్యాయము 8  
  • యెహెజ్కేలు అధ్యాయము 9  
  • యెహెజ్కేలు అధ్యాయము 10  
  • యెహెజ్కేలు అధ్యాయము 11  
  • యెహెజ్కేలు అధ్యాయము 12  
  • యెహెజ్కేలు అధ్యాయము 13  
  • యెహెజ్కేలు అధ్యాయము 14  
  • యెహెజ్కేలు అధ్యాయము 15  
  • యెహెజ్కేలు అధ్యాయము 16  
  • యెహెజ్కేలు అధ్యాయము 17  
  • యెహెజ్కేలు అధ్యాయము 18  
  • యెహెజ్కేలు అధ్యాయము 19  
  • యెహెజ్కేలు అధ్యాయము 20  
  • యెహెజ్కేలు అధ్యాయము 21  
  • యెహెజ్కేలు అధ్యాయము 22  
  • యెహెజ్కేలు అధ్యాయము 23  
  • యెహెజ్కేలు అధ్యాయము 24  
  • యెహెజ్కేలు అధ్యాయము 25  
  • యెహెజ్కేలు అధ్యాయము 26  
  • యెహెజ్కేలు అధ్యాయము 27  
  • యెహెజ్కేలు అధ్యాయము 28  
  • యెహెజ్కేలు అధ్యాయము 29  
  • యెహెజ్కేలు అధ్యాయము 30  
  • యెహెజ్కేలు అధ్యాయము 31  
  • యెహెజ్కేలు అధ్యాయము 32  
  • యెహెజ్కేలు అధ్యాయము 33  
  • యెహెజ్కేలు అధ్యాయము 34  
  • యెహెజ్కేలు అధ్యాయము 35  
  • యెహెజ్కేలు అధ్యాయము 36  
  • యెహెజ్కేలు అధ్యాయము 37  
  • యెహెజ్కేలు అధ్యాయము 38  
  • యెహెజ్కేలు అధ్యాయము 39  
  • యెహెజ్కేలు అధ్యాయము 40  
  • యెహెజ్కేలు అధ్యాయము 41  
  • యెహెజ్కేలు అధ్యాయము 42  
  • యెహెజ్కేలు అధ్యాయము 43  
  • యెహెజ్కేలు అధ్యాయము 44  
  • యెహెజ్కేలు అధ్యాయము 45  
  • యెహెజ్కేలు అధ్యాయము 46  
  • యెహెజ్కేలు అధ్యాయము 47  
  • యెహెజ్కేలు అధ్యాయము 48  
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References