పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
నిర్గమకాండము

నిర్గమకాండము అధ్యాయము 24

1 మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. 2 మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. 3 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. 4 మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి 5 ఇశ్రాయేలీయులలో ¸°వనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి. 6 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. 7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. 8 అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. 9 తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి 10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను. 11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. 12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా 13 మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. 14 అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వాం 15 మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. 16 యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు 17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్ను లకు కనబడెను. 18 అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.
1 మరియు ఆయన మోషేతో ఇట్లనెనునీవును, అహరోనును, నాదాబును, అబీహును, ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. .::. 2 మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీ పింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. .::. 3 మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరుయెహోవా చెప్పిన మాట లన్నిటి ప్రకారము చేసెదమని యేక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. .::. 4 మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి .::. 5 ఇశ్రాయేలీయులలో ¸°వనస్థులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి. .::. 6 అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. .::. 7 అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. .::. 8 అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించిఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. .::. 9 తరువాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలీయుల పెద్దలలో డెబ్బదిమందియు ఎక్కి పోయి .::. 10 ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను. .::. 11 ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు; వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. .::. 12 అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనునీవు కొండయెక్కి నాయొద్దకు వచ్చి అచ్చటనుండుము; నీవు వారికి బోధించునట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతిపలకలను నీకిచ్చెదననగా .::. 13 మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండమీదికి ఎక్కెను. .::. 14 అతడు పెద్దలను చూచిమేము మీ యొద్దకు వచ్చువరకు ఇక్కడనే యుండుడి; ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు; ఎవనికైనను వ్యాజ్యెమున్నయెడల వారియొద్దకు వెళ్లవచ్చునని వాం .::. 15 మోషే కొండమీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. .::. 16 యెహోవా మహిమ సీనాయి కొండమీద నిలిచెను; మేఘము ఆరు దినములు దాని కమ్ముకొనెను; ఏడవ దినమున ఆయన ఆ మేఘములోనుండి మోషేను పిలిచినప్పుడు .::. 17 యెహోవా మహిమ ఆ కొండ శిఖరముమీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్ను లకు కనబడెను. .::. 18 అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే ఆ కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను. .::.
  • నిర్గమకాండము అధ్యాయము 1  
  • నిర్గమకాండము అధ్యాయము 2  
  • నిర్గమకాండము అధ్యాయము 3  
  • నిర్గమకాండము అధ్యాయము 4  
  • నిర్గమకాండము అధ్యాయము 5  
  • నిర్గమకాండము అధ్యాయము 6  
  • నిర్గమకాండము అధ్యాయము 7  
  • నిర్గమకాండము అధ్యాయము 8  
  • నిర్గమకాండము అధ్యాయము 9  
  • నిర్గమకాండము అధ్యాయము 10  
  • నిర్గమకాండము అధ్యాయము 11  
  • నిర్గమకాండము అధ్యాయము 12  
  • నిర్గమకాండము అధ్యాయము 13  
  • నిర్గమకాండము అధ్యాయము 14  
  • నిర్గమకాండము అధ్యాయము 15  
  • నిర్గమకాండము అధ్యాయము 16  
  • నిర్గమకాండము అధ్యాయము 17  
  • నిర్గమకాండము అధ్యాయము 18  
  • నిర్గమకాండము అధ్యాయము 19  
  • నిర్గమకాండము అధ్యాయము 20  
  • నిర్గమకాండము అధ్యాయము 21  
  • నిర్గమకాండము అధ్యాయము 22  
  • నిర్గమకాండము అధ్యాయము 23  
  • నిర్గమకాండము అధ్యాయము 24  
  • నిర్గమకాండము అధ్యాయము 25  
  • నిర్గమకాండము అధ్యాయము 26  
  • నిర్గమకాండము అధ్యాయము 27  
  • నిర్గమకాండము అధ్యాయము 28  
  • నిర్గమకాండము అధ్యాయము 29  
  • నిర్గమకాండము అధ్యాయము 30  
  • నిర్గమకాండము అధ్యాయము 31  
  • నిర్గమకాండము అధ్యాయము 32  
  • నిర్గమకాండము అధ్యాయము 33  
  • నిర్గమకాండము అధ్యాయము 34  
  • నిర్గమకాండము అధ్యాయము 35  
  • నిర్గమకాండము అధ్యాయము 36  
  • నిర్గమకాండము అధ్యాయము 37  
  • నిర్గమకాండము అధ్యాయము 38  
  • నిర్గమకాండము అధ్యాయము 39  
  • నిర్గమకాండము అధ్యాయము 40  
×

Alert

×

Telugu Letters Keypad References