పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
దినవృత్తాంతములు మొదటి గ్రంథము

దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 20

1 మరుసటి యేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమ కూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను. 2 దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను. 3 దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేము నకు తిరిగివచ్చిరి. 4 అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. 5 మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది. 6 మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు. 7 వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. 8 గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి.
1 మరుసటి యేట రాజులు యుద్ధమునకు బయలుదేరు కాలమున యోవాబు సైన్యములో శూరులైన వారిని సమ కూర్చి, అమ్మోనీయుల దేశమును పాడుచేసివచ్చి రబ్బాకు ముట్టడివేసెను; దావీదు యెరూషలేములోనేయుండగా యోవాబు రబ్బాను ఓడించి జనులను హతముచేసెను. .::. 2 దావీదు వచ్చి వారి రాజు తలమీదనున్న కిరీటమును తీసి కొనెను; దాని యెత్తు రెండు మణుగుల బంగారము, అందులో రత్నములు చెక్కియుండెను, దానిని దావీదు ధరించెను. మరియు అతడు బహు విస్తారమైన కొల్లసొమ్ము ఆ పట్టణములోనుండి తీసికొనిపోయెను. .::. 3 దానియందున్న జనులను అతడు వెలుపలికి కొనిపోయి, వారిలో కొందరిని రంపములతో కోయించెను, కొందరిని ఇనుపదంతెలతో చీరించెను; కొందరిని గొడ్డళ్ళతో నరికించెను. ఈ ప్రకారము అతడు అమ్మోనీయుల పట్టణములన్నిటికిని చేసెను, అంతట దావీదును జనులందరును యెరూషలేము నకు తిరిగివచ్చిరి. .::. 4 అటుతరువాత గెజెరులోనున్న ఫిలిష్తీయులతో యుద్ధము కలుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతివాడగు సిప్పయి అను నొకని హతము చేసెను, అందువలన ఫిలిష్తీయులు లొంగుబాటునకు తేబడిరి. .::. 5 మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది. .::. 6 మరల గాతులో యుద్ధము జరిగెను; మంచి యెత్తరియగు ఒకడు అచ్చట ఉండెను, వానికి చేతిచేతికి కాలికాలికి ఆరేసి చొప్పున ఇరువది నాలుగు వ్రేళ్లుండెను, వాడు రెఫాయీయుల సంతతివాడు. .::. 7 వాడు ఇశ్రాయేలీయులను దూషింపగా దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యోనాతాను వాని చంపెను. .::. 8 గాతులోనున్న రెఫాయీయుల సంతతివారగు వీరు దావీదుచేతను అతని సేవకులచేతను హతులైరి. .::.
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 1  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 2  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 3  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 4  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 5  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 6  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 7  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 8  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 9  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 10  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 11  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 12  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 13  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 14  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 15  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 16  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 17  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 18  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 19  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 20  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 21  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 22  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 23  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 24  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 25  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 26  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 27  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 28  
  • దినవృత్తాంతములు మొదటి గ్రంథము అధ్యాయము 29  
×

Alert

×

Telugu Letters Keypad References