పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
యోనా

యోనా అధ్యాయము 3

1 అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా 2 నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమా చారము దానికి ప్రకటన చేయుము. 3 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణ మునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము. 4 యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచుఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా 5 నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. 6 ఆ సంగతి నీనెవె రాజునకు వినబడి నప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి,తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను. 7 మరియు రాజైన తానును ఆయన మంత్రు లును ఆజ్ఞ ఇయ్యగా 8 ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, 9 మనుష్యు లందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలా త్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. 10 ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.
1 అంతట యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా .::. 2 నీవు లేచి నీనెవె మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమా చారము దానికి ప్రకటన చేయుము. .::. 3 కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞప్రకారము నీనెవె పట్టణ మునకు పోయెను. నీనెవె పట్టణము దేవుని దృష్టికి గొప్పదై మూడు దినముల ప్రయాణమంత పరిమాణముగల పట్టణము. .::. 4 యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచుఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా .::. 5 నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి. .::. 6 ఆ సంగతి నీనెవె రాజునకు వినబడి నప్పుడు అతడును తన సింహాసనము మీదనుండి దిగి,తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదెలో కూర్చుండెను. .::. 7 మరియు రాజైన తానును ఆయన మంత్రు లును ఆజ్ఞ ఇయ్యగా .::. 8 ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పు కొని పశ్చాత్తప్తుడై మనము లయముకాకుండ తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియు పుచ్చుకొన కూడదు, పశువులు గాని యెద్దులుగాని గొఱ్ఱలుగాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు, .::. 9 మనుష్యు లందరు తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలా త్కారమును మానివేయవలెను, మనుష్యులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వ కముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నీనెవె పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. .::. 10 ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదు నని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను. .::.
  • యోనా అధ్యాయము 1  
  • యోనా అధ్యాయము 2  
  • యోనా అధ్యాయము 3  
  • యోనా అధ్యాయము 4  
×

Alert

×

Telugu Letters Keypad References