పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
యెహొషువ

యెహొషువ అధ్యాయము 16

1 యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను, 2 తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును. 3 అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను. 4 అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. 5 ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను. 6 వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానా త్షీలోనువరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహావరకు తూర్పున దాని దాటి 7 యానో హానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. 8 తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. 9 ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్య బడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. 10 అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు.
1 యోసేపు పుత్రులకు చీటివలన వచ్చిన వంతు యెరికో యెదుట యొర్దాను దరినుండెను, .::. 2 తూర్పుననున్న ఆ యెరికో యేటివెంబడిగా యెరికోనుండి బేతేలు మన్య దేశమువరకు అరణ్యము వ్యాపించును. .::. 3 అది బేతేలు నుండి లూజువరకు పోయి అతారోతు అర్కీయుల సరి హద్దువరకు సాగి క్రింది బేత్‌హోరోనువరకును గెజెరు వరకును పడమటివైపుగా యప్లేతీయుల సరిహద్దువరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రమువరకు సాగెను. .::. 4 అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. .::. 5 ఎఫ్రాయిమీయుల సరిహద్దు, అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్‌హోరోనువరకు తూర్పుగా వ్యాపించెను. .::. 6 వారి సరిహద్దు మిక్మెతాతునొద్దనున్న సముద్రము వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తానా త్షీలోనువరకు తూర్పువైపుగా చుట్టు తిరిగి యానోహావరకు తూర్పున దాని దాటి .::. 7 యానో హానుండి అతారోతువరకును నారాతావరకును యెరికోకు తగిలి యొర్దాను నొద్ద తుదముట్టెను. .::. 8 తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా యేటివరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశములచొప్పున ఎఫ్రాయిమీయుల గోత్ర స్వాస్థ్యము. .::. 9 ఎఫ్రాయిమీయులకు అచ్చటచ్చట ఇయ్య బడినపట్టణములు పోగా ఆ పట్టణములన్నియు వాటి గ్రామములును మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. .::. 10 అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటివరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీయులమధ్య నివసించుచు పన్నుకట్టు దాసులైయున్నారు. .::.
  • యెహొషువ అధ్యాయము 1  
  • యెహొషువ అధ్యాయము 2  
  • యెహొషువ అధ్యాయము 3  
  • యెహొషువ అధ్యాయము 4  
  • యెహొషువ అధ్యాయము 5  
  • యెహొషువ అధ్యాయము 6  
  • యెహొషువ అధ్యాయము 7  
  • యెహొషువ అధ్యాయము 8  
  • యెహొషువ అధ్యాయము 9  
  • యెహొషువ అధ్యాయము 10  
  • యెహొషువ అధ్యాయము 11  
  • యెహొషువ అధ్యాయము 12  
  • యెహొషువ అధ్యాయము 13  
  • యెహొషువ అధ్యాయము 14  
  • యెహొషువ అధ్యాయము 15  
  • యెహొషువ అధ్యాయము 16  
  • యెహొషువ అధ్యాయము 17  
  • యెహొషువ అధ్యాయము 18  
  • యెహొషువ అధ్యాయము 19  
  • యెహొషువ అధ్యాయము 20  
  • యెహొషువ అధ్యాయము 21  
  • యెహొషువ అధ్యాయము 22  
  • యెహొషువ అధ్యాయము 23  
  • యెహొషువ అధ్యాయము 24  
×

Alert

×

Telugu Letters Keypad References