పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
మత్తయి సువార్త

మత్తయి సువార్త అధ్యాయము 24

1 యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా... ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. 2 అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 3 ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా 4 యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. 5 అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. 6 మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. 7 జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. 8 అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము. 9 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. 10 అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. 11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; 12 అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. 13 అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును. 14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రక టింపబడును; అటుతరువాత అంతము వచ్చును. 15 కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక 16 యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను 17 మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; 18 పొలములో ఉండు వాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు. 19 అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. 20 అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. 21 లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు. 22 ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. 23 ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి. 24 అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. 25 ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. 26 కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్య ములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడిఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి 27 మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. 28 పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. 29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును. 30 అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశ మందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభా వముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదను 31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు. 32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. 33 ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నా డని తెలిసికొనుడి. 34 ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. 36 అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు. 37 నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. 38 జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి 39 జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును. 40 ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. 42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. 43 ఏ జామున దొంగవచ్చునో యింటి యజ మానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. 44 మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. 45 యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు? 46 యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. 47 అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 48 అయితే దుష్టు డైన యొక దాసుడునా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని 49 తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె 50 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును. 51 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును.
1 యేసు దేవాలయమునుండి బయలుదేరి వెళ్లుచుండగా... ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. .::. 2 అందుకాయన మీరు ఇవన్నియు చూచుచున్నారు గదా; రాతిమీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. .::. 3 ఆయన ఒలీవల కొండమీద కూర్చుండియున్నప్పుడు శిష్యులాయనయొద్దకు ఏకాంతముగా వచ్చిఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? మాతో చెప్పుమనగా .::. 4 యేసు వారితో ఇట్లనెనుఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి. .::. 5 అనేకులు నా పేరట వచ్చినేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోస పరచెదరు. .::. 6 మరియు మీరు యుద్ధములనుగూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు; మీరు కలవరపడకుండ చూచుకొనుడి. ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు. .::. 7 జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును. .::. 8 అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును; ఇవన్నియు వేదన లకు ప్రారంభము. .::. 9 అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు; మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. .::. 10 అనేకులు అభ్యంతరపడి, యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. .::. 11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు; .::. 12 అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. .::. 13 అంతమువరకు సహించినవా డెవడో వాడే రక్షింపబడును. .::. 14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రక టింపబడును; అటుతరువాత అంతము వచ్చును. .::. 15 కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక .::. 16 యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను .::. 17 మిద్దెమీద ఉండువాడు తన యింటిలోనుండి ఏదైనను తీసికొని పోవుటకు దిగకూడదు; .::. 18 పొలములో ఉండు వాడు, తన బట్టలు తీసికొని పోవుటకు ఇంటికి రాకూడదు. .::. 19 అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ. .::. 20 అప్పుడు మహా శ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతిదినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. .::. 21 లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పు డును కలుగబోదు. .::. 22 ఆ దినములు తక్కువ చేయబడక పోయిన యెడల ఏ శరీరియు తప్పించుకొనడు. ఏర్పరచ బడినవారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. .::. 23 ఆ కాలమందు ఎవడైననుఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మ కుడి. .::. 24 అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచు టకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు. .::. 25 ఇదిగో ముందుగా నేను మీతో చెప్పియున్నాను. .::. 26 కాబట్టి ఎవరైననుఇదిగో అరణ్య ములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్లకుడిఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి .::. 27 మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. .::. 28 పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును. .::. 29 ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింప బడును. .::. 30 అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశ మందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభా వముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదను .::. 31 మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు. .::. 32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చు కొనుడి. అంజూరపుకొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. .::. 33 ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే, ద్వారముదగ్గరనే యున్నా డని తెలిసికొనుడి. .::. 34 ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. .::. 35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు. .::. 36 అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలై నను కుమారుడైనను ఎరుగరు. .::. 37 నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. .::. 38 జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి .::. 39 జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును. .::. 40 ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసి కొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. .::. 41 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. .::. 42 కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. .::. 43 ఏ జామున దొంగవచ్చునో యింటి యజ మానునికి తెలిసియుండినయెడల అతడు మెలకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. .::. 44 మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. .::. 45 యజమానుడు తన యింటివారికి తగినవేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు డెవడు? .::. 46 యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. .::. 47 అతడు తన యావదాస్తిమీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. .::. 48 అయితే దుష్టు డైన యొక దాసుడునా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని .::. 49 తనతోడి దాసులను కొట్ట మొదలుపెట్టి, త్రాగుబోతులతో తినుచు త్రాగుచునుంటె .::. 50 ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి, వానిని నరికించి వేషధారులతో కూడ వానికి పాలు నియ మించును. .::. 51 అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. .::.
  • మత్తయి సువార్త అధ్యాయము 1  
  • మత్తయి సువార్త అధ్యాయము 2  
  • మత్తయి సువార్త అధ్యాయము 3  
  • మత్తయి సువార్త అధ్యాయము 4  
  • మత్తయి సువార్త అధ్యాయము 5  
  • మత్తయి సువార్త అధ్యాయము 6  
  • మత్తయి సువార్త అధ్యాయము 7  
  • మత్తయి సువార్త అధ్యాయము 8  
  • మత్తయి సువార్త అధ్యాయము 9  
  • మత్తయి సువార్త అధ్యాయము 10  
  • మత్తయి సువార్త అధ్యాయము 11  
  • మత్తయి సువార్త అధ్యాయము 12  
  • మత్తయి సువార్త అధ్యాయము 13  
  • మత్తయి సువార్త అధ్యాయము 14  
  • మత్తయి సువార్త అధ్యాయము 15  
  • మత్తయి సువార్త అధ్యాయము 16  
  • మత్తయి సువార్త అధ్యాయము 17  
  • మత్తయి సువార్త అధ్యాయము 18  
  • మత్తయి సువార్త అధ్యాయము 19  
  • మత్తయి సువార్త అధ్యాయము 20  
  • మత్తయి సువార్త అధ్యాయము 21  
  • మత్తయి సువార్త అధ్యాయము 22  
  • మత్తయి సువార్త అధ్యాయము 23  
  • మత్తయి సువార్త అధ్యాయము 24  
  • మత్తయి సువార్త అధ్యాయము 25  
  • మత్తయి సువార్త అధ్యాయము 26  
  • మత్తయి సువార్త అధ్యాయము 27  
  • మత్తయి సువార్త అధ్యాయము 28  
×

Alert

×

Telugu Letters Keypad References