పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
జెకర్యా

జెకర్యా అధ్యాయము 13

1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును. 2 ఇదే సైన్య ములకధిపతియగు యెహోవా వాక్కుఆ దినమున విగ్ర హముల పేళ్లు ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రా త్మను దేశములో లేకుండచేతును. 3 ఎవడైనను ఇక ప్రవచ నము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులునీవు యెహోవా నామమున అబద్ధము పలుకు చున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు. 4 ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. 5 వాడునేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును. 6 నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. 7 ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు. 8 దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు. 9 ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు.
1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించు టకై దావీదు సంతతివారికొరకును, యెరూషలేము నివా సులకొరకును ఊట యొకటి తియ్యబడును. .::. 2 ఇదే సైన్య ములకధిపతియగు యెహోవా వాక్కుఆ దినమున విగ్ర హముల పేళ్లు ఇకను జ్ఞాపకమురాకుండ దేశములోనుండి నేను వాటిని కొట్టివేతును; మరియు ప్రవక్తలను అపవిత్రా త్మను దేశములో లేకుండచేతును. .::. 3 ఎవడైనను ఇక ప్రవచ నము పలుక బూనుకొనినయెడల వానిని కన్న తలి దండ్రులునీవు యెహోవా నామమున అబద్ధము పలుకు చున్నావే; నీవికను బ్రదుకతగదని వానితో చెప్పుదురు; వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తలిదండ్రులే వాని పొడుచుదురు. .::. 4 ఆ దినమున తాము పలికిన ప్రవచనములనుబట్టియు, తమకు కలిగిన దర్శనమునుబట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. .::. 5 వాడునేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకనియొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును. .::. 6 నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడుఇవి నన్ను ప్రేమించినవారి యింట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. .::. 7 ఖడ్గమా, నా గొఱ్ఱల కాపరిమీదను నా సహకారి మీదను పడుము; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కుగొఱ్ఱలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారిమీద నేను నా హస్తమునుంచుదును; ఇదే యెహోవా వాక్కు. .::. 8 దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు. .::. 9 ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. .::.
  • జెకర్యా అధ్యాయము 1  
  • జెకర్యా అధ్యాయము 2  
  • జెకర్యా అధ్యాయము 3  
  • జెకర్యా అధ్యాయము 4  
  • జెకర్యా అధ్యాయము 5  
  • జెకర్యా అధ్యాయము 6  
  • జెకర్యా అధ్యాయము 7  
  • జెకర్యా అధ్యాయము 8  
  • జెకర్యా అధ్యాయము 9  
  • జెకర్యా అధ్యాయము 10  
  • జెకర్యా అధ్యాయము 11  
  • జెకర్యా అధ్యాయము 12  
  • జెకర్యా అధ్యాయము 13  
  • జెకర్యా అధ్యాయము 14  
×

Alert

×

Telugu Letters Keypad References