పవిత్ర బైబిల్

బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI) తెలుగు వెర్షన్
ఆదికాండము

గమనికలు

No Verse Added

ఆదికాండము అధ్యాయము 18

1. మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కన బడెను. 2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి 3. ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. 4. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. 5. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారునీవు చెప్పి నట్లు చేయుమనగా 6. అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగా వెళ్లినీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. 7. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. 8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయు చుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను. 9. వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను. 10. అందుకాయనమీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వాం 11. అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక 12. శారానేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమాను డును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. 13. అంతట యెహోవా అబ్రాహాముతోవృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. 15. శారా భయపడినేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవి్వతివనెను. 16. అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను. 17. అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? 18. అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. 19. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరి గించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను. 20. మరియు యెహోవాసొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను 21. నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను. 22. ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. 23. అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెనుదుష్టులతోకూడ నీతి మంతులను నాశనము చేయుదువా? 24. ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? 25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు 26. యెహోవాసొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను 27. అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 28. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; 29. అతడింక ఆయనతో మాటలాడుచుఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయనఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా 30. అతడు ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కన బడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చె 31. అందు కతడుఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయ కుందుననగా 32. అతడు ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను. 33. యెహోవా అబ్రా హాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
1. మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కన బడెను. .::. 2. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి .::. 3. ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు. .::. 4. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. .::. 5. కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారునీవు చెప్పి నట్లు చేయుమనగా .::. 6. అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగా వెళ్లినీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. .::. 7. మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. .::. 8. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయు చుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను. .::. 9. వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను. .::. 10. అందుకాయనమీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వాం .::. 11. అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక .::. 12. శారానేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమాను డును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. .::. 13. అంతట యెహోవా అబ్రాహాముతోవృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల? .::. 14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. .::. 15. శారా భయపడినేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవి్వతివనెను. .::. 16. అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను. .::. 17. అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా? .::. 18. అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. .::. 19. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరి గించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను. .::. 20. మరియు యెహోవాసొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను .::. 21. నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను. .::. 22. ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను. .::. 23. అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెనుదుష్టులతోకూడ నీతి మంతులను నాశనము చేయుదువా? .::. 24. ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? .::. 25. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు .::. 26. యెహోవాసొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను .::. 27. అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. .::. 28. ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను; .::. 29. అతడింక ఆయనతో మాటలాడుచుఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయనఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా .::. 30. అతడు ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కన బడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చె .::. 31. అందు కతడుఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయ కుందుననగా .::. 32. అతడు ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను. .::. 33. యెహోవా అబ్రా హాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను. .::.
  • ఆదికాండము అధ్యాయము 1  
  • ఆదికాండము అధ్యాయము 2  
  • ఆదికాండము అధ్యాయము 3  
  • ఆదికాండము అధ్యాయము 4  
  • ఆదికాండము అధ్యాయము 5  
  • ఆదికాండము అధ్యాయము 6  
  • ఆదికాండము అధ్యాయము 7  
  • ఆదికాండము అధ్యాయము 8  
  • ఆదికాండము అధ్యాయము 9  
  • ఆదికాండము అధ్యాయము 10  
  • ఆదికాండము అధ్యాయము 11  
  • ఆదికాండము అధ్యాయము 12  
  • ఆదికాండము అధ్యాయము 13  
  • ఆదికాండము అధ్యాయము 14  
  • ఆదికాండము అధ్యాయము 15  
  • ఆదికాండము అధ్యాయము 16  
  • ఆదికాండము అధ్యాయము 17  
  • ఆదికాండము అధ్యాయము 18  
  • ఆదికాండము అధ్యాయము 19  
  • ఆదికాండము అధ్యాయము 20  
  • ఆదికాండము అధ్యాయము 21  
  • ఆదికాండము అధ్యాయము 22  
  • ఆదికాండము అధ్యాయము 23  
  • ఆదికాండము అధ్యాయము 24  
  • ఆదికాండము అధ్యాయము 25  
  • ఆదికాండము అధ్యాయము 26  
  • ఆదికాండము అధ్యాయము 27  
  • ఆదికాండము అధ్యాయము 28  
  • ఆదికాండము అధ్యాయము 29  
  • ఆదికాండము అధ్యాయము 30  
  • ఆదికాండము అధ్యాయము 31  
  • ఆదికాండము అధ్యాయము 32  
  • ఆదికాండము అధ్యాయము 33  
  • ఆదికాండము అధ్యాయము 34  
  • ఆదికాండము అధ్యాయము 35  
  • ఆదికాండము అధ్యాయము 36  
  • ఆదికాండము అధ్యాయము 37  
  • ఆదికాండము అధ్యాయము 38  
  • ఆదికాండము అధ్యాయము 39  
  • ఆదికాండము అధ్యాయము 40  
  • ఆదికాండము అధ్యాయము 41  
  • ఆదికాండము అధ్యాయము 42  
  • ఆదికాండము అధ్యాయము 43  
  • ఆదికాండము అధ్యాయము 44  
  • ఆదికాండము అధ్యాయము 45  
  • ఆదికాండము అధ్యాయము 46  
  • ఆదికాండము అధ్యాయము 47  
  • ఆదికాండము అధ్యాయము 48  
  • ఆదికాండము అధ్యాయము 49  
  • ఆదికాండము అధ్యాయము 50  
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References