4. వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
|
5. అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.
|
6. అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
|
7. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయునుయెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
|
8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచునుయెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును.
|
9. యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునుయెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
|
10. అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
|
13. దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహముచేయకుండ నిందా రహితుడనగుదును.
|
14. యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక.
|