1. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతో షింపనియ్యక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను.
|
3. యెహోవా, పాతాళములోనుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండ నీవు నన్ను బ్రదికించితివి.
|
5. ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, రాత్రి యుండినను ఉదయమున సంతోషము కలుగును.
|
7. యెహోవా, దయకలిగి నీవే నా పర్వతమును స్థిర పరచితివి నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత జెందితిని
|
8. యెహోవా, నీకే మొఱ్ఱపెట్టితిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగినయెడల నా ప్రాణమువలన ఏమి లాభము?
|
12. నీవు నా గోనెపట్ట విడిపించి, సంతోషవస్త్రము నన్ను ధరింపజేసియున్నావు యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించె దను.
|