పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ద్వితీయోపదేశకాండమ
1. {భద్రతా పట్టణాలు} [PS] “ఇతర రాజ్యాలకు చెందిన దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆ రాజ్యాలను యెహోవా నాశనం చేస్తాడు. ఆ ప్రజలు నివసించిన చోట మీరు నివపిస్తారు. వారి పట్టణాలు, ఇండ్లు మీరు స్వాధీనం చేసుకొంటారు. అది జరిగి నప్పుడు,
2. (2-3) దేశాన్ని మీరు మూడు భాగాలు చేయాలి. తర్వాత ఒక్కో ప్రాంతంలో ఉండే ప్రజలందరకి దగ్గరగా ఉండేటట్టు ఆ భాగంలో ఒక ఒక పట్టణాన్ని మీరు ఏర్పరచు కోవాలి. ఆ పట్టణాలకు మీరు త్రోవలు వేయాలి. ఒక వ్యక్తిని చంపిన ఏ వ్యక్తిగాని అక్కడికి పారి పోవచ్చును. [PE][PS]
3.
4. “ఎవరినైనా చంపేసి భద్రతకోసం ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయే మనిషికి నియమాలు ఇవి, అతడు ప్రమాదవశాత్తు మరొకరిని చంపినవాడై ఉండాలి. అతడు తాను చంపిన వ్యక్తిని ద్వేషించిన వాడు కాకూడదు.
5. ఒక ఉదాహరణ: ఒక మనిషి మరొక వ్యక్తితో కలసి కట్టెలు కొట్టుకొనేందుకు అడవికి వెళ్లవచ్చును. ఒక చెట్టును నరకడానికి అతడు తన గొడ్డలిని విసురుతాడు కాని ఆ గొడ్డలి దాని పిడినుండి ఊడి పోతుంది. ఆ గొడ్డలి ఊడి వెళ్లి అవతల మనిషికి తగుల్తుంది, అతడు చనిపోతాడు. అప్పుడు ఆ గొడ్డలి విసరిన మనిషి ఆ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి భద్రంగా ఉండవచ్చును.
6. అయితే ఆ పట్టణం చాలా దూరంగా ఉంటే అతడు కావాల్సినంత వేగంగా పరుగెత్తలేక పోవచ్చును. అతను చంపిన మనిషి బంధువు ఎవరైన అతణ్ణి తరిమి, అతడు ఆ పట్టణం చేరక ముందే పట్టుకోవచ్చును. ఆ దగ్గర బంధువు చాలా కోపంతో అతణ్ణి చంపివేయ వచ్చును. కానీ ఆ మనిషి మరణ పాత్రుడుకాడు. అతడు చంపినవాణ్ణి అతడు ద్వేషించలేదు.
7. కనుక ఈ పనికోసం మూడు పట్టణాలను నిర్ణయించు కోవాల్సిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. [PE][PS]
8. “మీ దేవుడైన యెహోవా మీ దేశాన్ని విస్తరింపచేస్తానని మీ తండ్రులకు వాగ్దానం చేసాడు. మీ పూర్వీకులకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశం ఆయన మీకు ఇస్తాడు.
9. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలకు మీరు పూర్తిగా విధేయులై, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి, ఎల్లప్పుడూ ఆయన మార్గాలలో జీవిస్తే, ఆయన దీనిని చేస్తాడు. తర్వాత యెహోవా మీ దేశాన్ని విస్తృతపరచినప్పుడు భద్రత కోసం యింకా మూడు పట్టణాలను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అవి మొదటి మూడు పట్టణాలకు చేర్చ బడాలి.
10. అప్పుడు మీ స్వంతంగా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అమాయక ప్రజలు చంపబడరు. మరియు ఏ మరణం విషయంలోనూ మీరు దోషులుగా ఉండరు. [PE][PS]
11. “అయితే ఒకడు మరొకడ్ని ద్వేషించాడను కోండి. అతడు దాగుకొని, తాను ద్వేషించే మనిషిని చంపేందుకు వేచి ఉంటాడు. అతడు ఆ వ్యక్తిని చంపేసి భద్రతకోసం ఈ పట్టణాల్లో ఒక దానికి పారిపోతాడు.
12. అలా జరిగితే అతని స్వగ్రామంలోని పెద్దలు ఎవరినైనా పంపి అతణ్ణి పట్టుకొని ఆశ్రయపురంనుండి తీసుకొని వెళ్లిపోవాలి. అతణ్ణి శిక్షించాల్సిన బాధ్యత గల బంధువులకు ఆ పెద్దలు అప్పగించాలి. ఆ హంత కుడు మరణించాలి.
13. అతని కోసం మీరు విచారించకూడదు. నిర్దోషులను చంపిన పాపంనుండి ఇశ్రాయేలీయులను మీరు తప్పించాలి అప్పుడు మీకు అంతా మేలు అవుతుంది. [PS]
14. {ఆస్తుల సరిహద్దులు} [PS] “నీవు నీ పొరుగువాని సరిహద్దు రాళ్లు తీసివేయకూడదు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో పూర్వీకులు ఈ సరిహద్దు రాళ్లను పెట్టారు. [PS]
15. {సాక్ష్యాలు} [PS] “ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్టు నేరారోపణ ఉంటే, ఆ వ్యక్తి దోషి అని నిర్దారణ చేయటానికి ఒక్క సాక్ష్యం చాలదు. ఆ వ్యక్తి నిజంగా తప్పు చేసాడని నిరూపించటానికి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అవసరం. [PE][PS]
16. “ఒక సాక్షి మరో వ్యక్తి తప్పు చేసాడని, అతని మీద అబద్ధం చెప్పి, అతనికి హాని చేయాలని చూడవచ్చును.
17. అప్పుడు ఒకరితో ఒకరు వాదించు కొంటున్న ఆ ఇద్దరు వ్యకులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి వెళ్లి, అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, న్యాయమూర్తులచే తీర్పు పొందాలి.
18. న్యాయ మూర్తులు జాగ్రత్తగా ప్రశ్నలు వేయాలి. సాక్షి అవతలి వ్యక్తిమీద అబద్ధాలు చెప్పినట్టు వారు తెలుసు కోవచ్చు. ఒకవేళ సాక్షి అబద్ధం చెప్పి ఉంటే
19. మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. ఈ విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి.
20. మిగిలిన ప్రజలంతా ఇది విని భయపడతారు. మళ్లీ అలాంటి చెడు కార్యం ఇంకెవ్వరూ ఎన్నడూ చేయరు. [PE][PS]
21. “తప్పు చేసిన వాడ్ని మీరు శిక్షించినప్పుడు మీరు విచారించకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు తీసివేయాలి. ( నేరస్థునికి శిక్ష విధించినట్టుగానే). [PE]

Notes

No Verse Added

Total 34 Chapters, Current Chapter 19 of Total Chapters 34
ద్వితీయోపదేశకాండమ 19:41
1. {భద్రతా పట్టణాలు} PS “ఇతర రాజ్యాలకు చెందిన దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. రాజ్యాలను యెహోవా నాశనం చేస్తాడు. ప్రజలు నివసించిన చోట మీరు నివపిస్తారు. వారి పట్టణాలు, ఇండ్లు మీరు స్వాధీనం చేసుకొంటారు. అది జరిగి నప్పుడు,
2. (2-3) దేశాన్ని మీరు మూడు భాగాలు చేయాలి. తర్వాత ఒక్కో ప్రాంతంలో ఉండే ప్రజలందరకి దగ్గరగా ఉండేటట్టు భాగంలో ఒక ఒక పట్టణాన్ని మీరు ఏర్పరచు కోవాలి. పట్టణాలకు మీరు త్రోవలు వేయాలి. ఒక వ్యక్తిని చంపిన వ్యక్తిగాని అక్కడికి పారి పోవచ్చును. PEPS
4. “ఎవరినైనా చంపేసి భద్రతకోసం మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయే మనిషికి నియమాలు ఇవి, అతడు ప్రమాదవశాత్తు మరొకరిని చంపినవాడై ఉండాలి. అతడు తాను చంపిన వ్యక్తిని ద్వేషించిన వాడు కాకూడదు.
5. ఒక ఉదాహరణ: ఒక మనిషి మరొక వ్యక్తితో కలసి కట్టెలు కొట్టుకొనేందుకు అడవికి వెళ్లవచ్చును. ఒక చెట్టును నరకడానికి అతడు తన గొడ్డలిని విసురుతాడు కాని గొడ్డలి దాని పిడినుండి ఊడి పోతుంది. గొడ్డలి ఊడి వెళ్లి అవతల మనిషికి తగుల్తుంది, అతడు చనిపోతాడు. అప్పుడు గొడ్డలి విసరిన మనిషి మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి భద్రంగా ఉండవచ్చును.
6. అయితే పట్టణం చాలా దూరంగా ఉంటే అతడు కావాల్సినంత వేగంగా పరుగెత్తలేక పోవచ్చును. అతను చంపిన మనిషి బంధువు ఎవరైన అతణ్ణి తరిమి, అతడు పట్టణం చేరక ముందే పట్టుకోవచ్చును. దగ్గర బంధువు చాలా కోపంతో అతణ్ణి చంపివేయ వచ్చును. కానీ మనిషి మరణ పాత్రుడుకాడు. అతడు చంపినవాణ్ణి అతడు ద్వేషించలేదు.
7. కనుక పనికోసం మూడు పట్టణాలను నిర్ణయించు కోవాల్సిందిగా నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను. PEPS
8. “మీ దేవుడైన యెహోవా మీ దేశాన్ని విస్తరింపచేస్తానని మీ తండ్రులకు వాగ్దానం చేసాడు. మీ పూర్వీకులకు ఇస్తానని ఆయన వాగ్దానం చేసిన దేశం ఆయన మీకు ఇస్తాడు.
9. వేళ నేను మీకు ఇస్తున్న ఆయన ఆజ్ఞలకు మీరు పూర్తిగా విధేయులై, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించి, ఎల్లప్పుడూ ఆయన మార్గాలలో జీవిస్తే, ఆయన దీనిని చేస్తాడు. తర్వాత యెహోవా మీ దేశాన్ని విస్తృతపరచినప్పుడు భద్రత కోసం యింకా మూడు పట్టణాలను మీరు ఏర్పాటు చేసుకోవాలి. అవి మొదటి మూడు పట్టణాలకు చేర్చ బడాలి.
10. అప్పుడు మీ స్వంతంగా మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో అమాయక ప్రజలు చంపబడరు. మరియు మరణం విషయంలోనూ మీరు దోషులుగా ఉండరు. PEPS
11. “అయితే ఒకడు మరొకడ్ని ద్వేషించాడను కోండి. అతడు దాగుకొని, తాను ద్వేషించే మనిషిని చంపేందుకు వేచి ఉంటాడు. అతడు వ్యక్తిని చంపేసి భద్రతకోసం పట్టణాల్లో ఒక దానికి పారిపోతాడు.
12. అలా జరిగితే అతని స్వగ్రామంలోని పెద్దలు ఎవరినైనా పంపి అతణ్ణి పట్టుకొని ఆశ్రయపురంనుండి తీసుకొని వెళ్లిపోవాలి. అతణ్ణి శిక్షించాల్సిన బాధ్యత గల బంధువులకు పెద్దలు అప్పగించాలి. హంత కుడు మరణించాలి.
13. అతని కోసం మీరు విచారించకూడదు. నిర్దోషులను చంపిన పాపంనుండి ఇశ్రాయేలీయులను మీరు తప్పించాలి అప్పుడు మీకు అంతా మేలు అవుతుంది. PS
14. {ఆస్తుల సరిహద్దులు} PS “నీవు నీ పొరుగువాని సరిహద్దు రాళ్లు తీసివేయకూడదు. మీరు నివసించేందుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో పూర్వీకులు సరిహద్దు రాళ్లను పెట్టారు. PS
15. {సాక్ష్యాలు} PS “ఒక వ్యక్తి ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏదైనా చేస్తున్నట్టు నేరారోపణ ఉంటే, వ్యక్తి దోషి అని నిర్దారణ చేయటానికి ఒక్క సాక్ష్యం చాలదు. వ్యక్తి నిజంగా తప్పు చేసాడని నిరూపించటానికి ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు అవసరం. PEPS
16. “ఒక సాక్షి మరో వ్యక్తి తప్పు చేసాడని, అతని మీద అబద్ధం చెప్పి, అతనికి హాని చేయాలని చూడవచ్చును.
17. అప్పుడు ఒకరితో ఒకరు వాదించు కొంటున్న ఇద్దరు వ్యకులూ యెహోవా ప్రత్యేక ఆలయానికి వెళ్లి, అప్పట్లో నాయకులుగా ఉన్న యాజకులు, న్యాయమూర్తులచే తీర్పు పొందాలి.
18. న్యాయ మూర్తులు జాగ్రత్తగా ప్రశ్నలు వేయాలి. సాక్షి అవతలి వ్యక్తిమీద అబద్ధాలు చెప్పినట్టు వారు తెలుసు కోవచ్చు. ఒకవేళ సాక్షి అబద్ధం చెప్పి ఉంటే
19. మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి.
20. మిగిలిన ప్రజలంతా ఇది విని భయపడతారు. మళ్లీ అలాంటి చెడు కార్యం ఇంకెవ్వరూ ఎన్నడూ చేయరు. PEPS
21. “తప్పు చేసిన వాడ్ని మీరు శిక్షించినప్పుడు మీరు విచారించకూడదు. ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, కాలికి కాలు తీసివేయాలి. ( నేరస్థునికి శిక్ష విధించినట్టుగానే). PE
Total 34 Chapters, Current Chapter 19 of Total Chapters 34
×

Alert

×

telugu Letters Keypad References