పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఎజ్రా
1. {దేవాలయ పునర్నిర్మాణానికి విరోధులు} [PS] (1-2) ఆ ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న ఆ శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏస్హరద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు. [PE][PS]
2.
3. కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక చక్రవర్తి కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.” [PE][PS]
4. ఈ మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభించారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు నిరుత్సాహపరచి, నిరోధించసాగారు.
5. వాళ్లు ప్రభుత్వాధి కారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. ఆ అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక చక్రవర్తిగా వున్నకాలంలో దర్యావేషు పారశీక చక్రవర్తి అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది. [PE][PS]
6. యూదులను అడ్డుకొనేందుకుగాను ఆ శత్రువులు పారశీక చక్రవర్తికి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు [*అహష్వేరోషు సుమారు క్రీ.పూ 485-465 సంవత్సరాల్లో పారశీక చక్రవర్తి.] చక్రవర్తి అయిన ఏడాది వాళ్లోక లేఖ వ్రాశారు. [PS]
7. {యెరూషలేము పునర్నిర్మాణానికి విరోధులు} [PS] ఆ తరువాత అర్తహషస్త [†అర్తహషస్త క్రీ. పూ సుమారు 465-424 సంవత్సరాలో పారశీక చక్రవర్తి అయిన అహష్వేరోషు కొడుకు.] పారసీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు రాశారు. అలా రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, ఆ బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు ఆ లేఖలు అరమాయికు [‡అరమాయిక్ బబులోను సామ్రాజ్యంలో అధికార భాష.] భాషలో, అరమాయికు లిపిలో వ్రాశారు. [PE][PS]
8. [§8వ వచనం ఇక్కడ మూలభాష హెబ్రీనుండి అరమాయికకు మరుతుంది.] అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరే కంగా ఒక లేఖ వ్రాసి, పారసీక చక్రవర్తి అర్తహాషస్తకి పంపారు. ఆ లేఖలో వాళ్లిలా వ్రాశారు.
9. ప్రాంతీయాధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్పెలాయేలు, పారసీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన ఏలాము మరియు ఇతర పాంతాల ప్రజలమీది ముఖ్యాధికారులు,
10. గొప్పవాడైన బలవంతుడైన అషురుబనిపాలు సమరియా నగరానికీ, యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతలకూ తరలించిన ప్రజల మహజరు.
11. అర్తహాషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నదియొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు చేసుకున్న విన్నపం:
12. అర్తహషస్త మహారాజుగారికి, తమరు తమవద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి చేరుకున్నారు. ఆ యూదులు ఇప్పుడా నగరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. ఆ నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు పునాదులు కట్టుదిట్టంచేసి, ప్రాకారాల ు కడుతున్నారు. [*ప్రాకారాల ు కడుతున్నారు నగర రక్షణ చేసుకునే మార్గాల్లో యిదొకటి. యూదులు చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు సన్నాహాలు చేస్తున్నట్లు స్పురింపచేయడం యీ వ్యక్తుల సంకల్పం.]
13. అంతేకాదు అర్తహషస్త మహాప్రభూ, యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యెరూషలేము ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలిపేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానేస్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం కూడా మానేస్తారు. ఏలినవారికి ఆ సొమ్మంతా నష్టమవుతుంది.
14. ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసు కుంటున్నాము.
15. అర్తహషస్త మహారాజా, తమకు పూర్వం రాజ్యమేలిన రాజులు వ్రాయించిన చరిత్ర పత్రాలు తమరు పరిశీలించండి. ఆ పత్రాలవల్ల యెరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు వ్యతిరేకంగా తిరుగబడినట్లు తమకు తెలియవస్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. ప్రాచీనకాలం నుంచి యీ నగరంలో అనేక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి! యెరూషలేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే!
16. అర్తహషస్త మహారాజా, ఈ నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము. [PS]
17. అప్పుడు అర్తహషస్త చక్రవర్తి వాళ్లకి ఇలా సమాధానం ఇచ్చాడు: ప్రాంతీయాధికారి రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, సమరియాలోనూ, యూఫ్రటీసు నదికీ పశ్చిమానా మీతో బాటు నివసించేవారికి, శుభాకాంక్షలు.
18. మీరు మాకు పంపిన లేఖను అనువదించి మాకు వినిపించారు.
19. నా వెనుకటి రాజుల పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. ఆ పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవించాయి.
20. యెరూషలేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు ఆ రాజులకు చెల్లింపబడ్డాయి.
21. ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం.
22. ఈ వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్తవహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు ముట్టదు. [PS]
23. అర్తహషస్త చక్రవర్తి పంపిన ఈ లేఖ నకలు రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. ఆ యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన నిలిపివేయించారు. [PS]
24. {దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోవుట} [PS] దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది. [†దేవాలయ … నిలిచిపోయింది అహర్వేరోషు కాలంలో దేవాలయ నిర్మాణం కృషి నిలిపివేయబడిన ఘటనకి యిది ప్రస్తావన. అంతేగాని, అర్తహషస్త కాలంలో నగర ప్రాకారాల నిర్మాణ కృషి నిలిపివేయబడిన దానికి కాదు ప్రస్తావన.] పారసీక చక్రవర్తి దర్యావేషు పాలన రెండవ సంవత్సరం [‡దర్యావేషు … రెండవ సంవత్సరం క్రీ.పూ 520.] దాకా తిరిగి ఈ నిర్మాణ కృషి కొనసాగలేదు. [PE]

Notes

No Verse Added

Total 10 Chapters, Current Chapter 4 of Total Chapters 10
1 2 3 4 5 6 7 8 9 10
ఎజ్రా 4:13
1. {దేవాలయ పునర్నిర్మాణానికి విరోధులు} PS (1-2) ప్రాంతంలో నివసించే చాలామంది యూదా, బెన్యామీను జాతీయులకు విరోధులు. చెర నుంచి విముక్తులై తిరిగి వచ్చిన వాళ్లు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు దేవాలయం నిర్మిస్తున్నారని విన్న శత్రువులు జెరుబ్బాబెలు దగ్గరకీ, వంశ పెద్దల దగ్గరికీ వచ్చి, “నిర్మాణంలో మీకు మమ్మల్ని తోడ్పడనివ్వండి. మేమూ మీలాంటివాళ్లమే. మీ దేవుణ్ణి సహాయం నిమిత్తం మేమూ అర్థిస్తాము. అష్షూరు రాజైన ఏస్హరద్దోను మమ్మల్ని ఇక్కడికి తెచ్చినప్పట్నుంచీ మేము మీ దేవునికే బలులు సమర్పించాము” అన్నారు. PEPS
3. కాని, జెరుబ్బాబెలు, యేషూవ, ఇశ్రాయేలుకు చెందిన ఇతర వంశాల పెద్దలూ వాళ్లకి ఇలా సమాధానం చెప్పారు: “కుదరదు, మా దేవుని ఆలయ నిర్మాణంలో మాకు తోడ్పడే అవకాశం మీకు లేదు. యెహోవాకు ఆలయ నిర్మాణం చేసే హక్కు మాది మాత్రమే. యెహోవా ఇశ్రాయేలీయుల దేవుడు. ఇది పారశీక చక్రవర్తి కోరేషు మాకు ఇచ్చిన ఆజ్ఞ.” PEPS
4. మాటలతో వాళ్లకి కోపం వచ్చింది. దానితో వాళ్లు యూదులకు ఇబ్బందులు కలిగించ నారంభించారు. దేవాలయం నిర్మించకుండా యూదులను వాళ్లు నిరుత్సాహపరచి, నిరోధించసాగారు.
5. వాళ్లు ప్రభుత్వాధి కారులకు లంచాలిచ్చి, వాళ్లు యూదా ప్రజలకు వ్యతిరేకంగా పని చేసేలా చూశారు. అధికారులు యూదుల దేవాలయ నిర్మాణ పథకాలను భగ్నం చేసేందుకు నిరంతరం కృషిచేశారు. కోరెషు పారశీక చక్రవర్తిగా వున్నకాలంలో దర్యావేషు పారశీక చక్రవర్తి అయ్యేంత వరకూ వాళ్ల యీ ప్రయత్నం కొనసాగింది. PEPS
6. యూదులను అడ్డుకొనేందుకుగాను శత్రువులు పారశీక చక్రవర్తికి లేఖలు సైతం వ్రాశారు. అహష్వేరోషు *అహష్వేరోషు సుమారు క్రీ.పూ 485-465 సంవత్సరాల్లో పారశీక చక్రవర్తి. చక్రవర్తి అయిన ఏడాది వాళ్లోక లేఖ వ్రాశారు. PS
7. {యెరూషలేము పునర్నిర్మాణానికి విరోధులు} PS తరువాత అర్తహషస్త †అర్తహషస్త క్రీ. పూ సుమారు 465-424 సంవత్సరాలో పారశీక చక్రవర్తి అయిన అహష్వేరోషు కొడుకు. పారసీకానికి కొత్తగా రాజు అయిన కాలంలో, వాళ్లలో కొందరు యూదులమీద నిందారోపణలు చేస్తూ లేఖలు రాశారు. అలా రాసినవాళ్లు: బిష్లాము, మిత్రదాతు, టాబెయేలు, బృందానికి చెందిన ఇతరులు. వాళ్లు అర్తహషస్తకు లేఖలు అరమాయికు ‡అరమాయిక్ బబులోను సామ్రాజ్యంలో అధికార భాష. భాషలో, అరమాయికు లిపిలో వ్రాశారు. PEPS
8. §8వ వచనం ఇక్కడ మూలభాష హెబ్రీనుండి అరమాయికకు మరుతుంది. అప్పుడు ప్రాంతీయాధికారి రెహూమూ, కార్యదర్శి షిమ్షయి కూడా యెరూషలేము ప్రజలకి వ్యతిరే కంగా ఒక లేఖ వ్రాసి, పారసీక చక్రవర్తి అర్తహాషస్తకి పంపారు. లేఖలో వాళ్లిలా వ్రాశారు.
9. ప్రాంతీయాధికారి రెహూము, కార్యదర్శి షిమ్షయీ, న్యాయమూర్తులు, టర్పెలాయేలు, పారసీకం, అర్కె, బబులోను, సూసాకి చెందిన ఏలాము మరియు ఇతర పాంతాల ప్రజలమీది ముఖ్యాధికారులు,
10. గొప్పవాడైన బలవంతుడైన అషురుబనిపాలు సమరియా నగరానికీ, యూఫ్రటీసు నదికి పశ్చిమ ప్రాంతలకూ తరలించిన ప్రజల మహజరు.
11. అర్తహాషస్త ప్రభువుకి, యూఫ్రటీసు నదియొక్క పశ్చిమాన నివసించే తమ దాసులు చేసుకున్న విన్నపం:
12. అర్తహషస్త మహారాజుగారికి, తమరు తమవద్ద నుంచి పంపివేసిన యూదులు ఇక్కడికి చేరుకున్నారు. యూదులు ఇప్పుడా నగరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. యెరూషలేము ఒక చెడ్డ నగరం. నగర ప్రజలు ఎల్లప్పుడూ ఇతర రాజుల మీద తిరగబడుతూవచ్చారు. ఇప్పుడు యూదులు పునాదులు కట్టుదిట్టంచేసి, ప్రాకారాల కడుతున్నారు. *ప్రాకారాల కడుతున్నారు నగర రక్షణ చేసుకునే మార్గాల్లో యిదొకటి. యూదులు చక్రవర్తికి వ్యతిరేకంగా తిరుగుబాటు సన్నాహాలు చేస్తున్నట్లు స్పురింపచేయడం యీ వ్యక్తుల సంకల్పం.
13. అంతేకాదు అర్తహషస్త మహాప్రభూ, యెరూషలేము నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యెరూషలేము ప్రజలు తమ వృత్తిపన్నులు చెల్లించడం నిలిపేస్తారు. తమ గౌరవార్థం డబ్బు పంపడం మానేస్తారు. వాళ్లు సుంకం పన్నులు చెల్లించడం కూడా మానేస్తారు. ఏలినవారికి సొమ్మంతా నష్టమవుతుంది.
14. ప్రభువుల పట్ల మాకు బాధ్యతవుంది. తమకీ నష్టాలు వాటిల్లడం మేము చూడలేము. అందుచేతనే తమకీ విషయాలు తెలియజేసు కుంటున్నాము.
15. అర్తహషస్త మహారాజా, తమకు పూర్వం రాజ్యమేలిన రాజులు వ్రాయించిన చరిత్ర పత్రాలు తమరు పరిశీలించండి. పత్రాలవల్ల యెరూషలేము ఎల్లప్పుడూ యితర రాజులకు వ్యతిరేకంగా తిరుగబడినట్లు తమకు తెలియవస్తుంది. ఇతర రాజులకూ, రాజ్యాలకూ వీళ్ల తిరుగుబాట్లు పెద్దకీడుగా పరిణమించాయి. ప్రాచీనకాలం నుంచి యీ నగరంలో అనేక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి! యెరూషలేము నాశనం చేయబడినది సరిగ్గా అందుకే!
16. అర్తహషస్త మహారాజా, నగరమూ, దాని ప్రాకారాలూ తిరిగి నిర్మింపబడినట్లయితే, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతంమీద తమకు అదుపు తప్పిపోతుందని తమకు తెలియజేయాలని కోరుకుంటున్నాము. PS
17. అప్పుడు అర్తహషస్త చక్రవర్తి వాళ్లకి ఇలా సమాధానం ఇచ్చాడు: ప్రాంతీయాధికారి రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, సమరియాలోనూ, యూఫ్రటీసు నదికీ పశ్చిమానా మీతో బాటు నివసించేవారికి, శుభాకాంక్షలు.
18. మీరు మాకు పంపిన లేఖను అనువదించి మాకు వినిపించారు.
19. నా వెనుకటి రాజుల పత్రాలు గాలించవలసిందిగా నేను ఆదేశించాను. పత్రాలు చదివి వినిపించారు. రాజులకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేసిన సుదీర్ఘ చరిత్ర యెరూషలేముకు ఉన్నట్లు మేము కనుగొన్నాము. యెరూషలేములో తరచూ పితూరీలు, తిరుగుబాట్లు సంభవించాయి.
20. యెరూషలేమునూ, యూఫ్రటీసు నదికి పశ్చిమానగల ప్రాంతమంతటినీ శక్తిసంపన్నులైన రాజులు పాలించారు. పన్నులు, రాజుల గౌరవార్థం కానుకలు, సుంకం పన్నులు రాజులకు చెల్లింపబడ్డాయి.
21. ఇప్పుడిక మీరు చేయవలసినది, వాళ్లని పని నిలిపివేయవలసినదిగా ఆజ్ఞ జారీ చేయడం. యెరూషలేము పునర్నిర్మాణం జరగకుండా మీరా ఆజ్ఞ ఇవ్వాలని నా ఆదేశం.
22. వ్యవహారంలో అశ్రద్ధ జరగకుండా మీరు జాగ్రత్తవహించాలి. మనం యెరూషలేము పునర్నిర్మాణాన్ని కొనసాగనివ్వరాదు. అదే జరిగితే మాకింక యెరూషలేమునుంచి ఎంత మాత్రమూ డబ్బు ముట్టదు. PS
23. అర్తహషస్త చక్రవర్తి పంపిన లేఖ నకలు రెహూముకీ, కార్యదర్శి షిమ్షయికీ, వాళ్లతోవున్న ఇతర ప్రజలకు అందింది. దాన్ని చదివిన మీదట వాళ్లు వెంటనే యెరూషలేములోని యూదుల వద్దకు వెళ్లారు. యూదుల చేత నిర్మాణపు పనిని వాళ్లు బలవంతాన నిలిపివేయించారు. PS
24. {దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోవుట} PS దానితో, యెరూషలేములోని యెహోవా దేవాలయ నిర్మాణపు పని నిలిచిపోయింది. †దేవాలయ నిలిచిపోయింది అహర్వేరోషు కాలంలో దేవాలయ నిర్మాణం కృషి నిలిపివేయబడిన ఘటనకి యిది ప్రస్తావన. అంతేగాని, అర్తహషస్త కాలంలో నగర ప్రాకారాల నిర్మాణ కృషి నిలిపివేయబడిన దానికి కాదు ప్రస్తావన. పారసీక చక్రవర్తి దర్యావేషు పాలన రెండవ సంవత్సరం ‡దర్యావేషు రెండవ సంవత్సరం క్రీ.పూ 520. దాకా తిరిగి నిర్మాణ కృషి కొనసాగలేదు. PE
Total 10 Chapters, Current Chapter 4 of Total Chapters 10
1 2 3 4 5 6 7 8 9 10
×

Alert

×

telugu Letters Keypad References