పవిత్ర బైబిల్

దేవుని దయగల బహుమతి
ఆదికాండము
1. {ఆస్తి సమస్యలు} [PS] ఇస్సాకు ముసలివాడైనప్పుడు అతని చూపు సన్నగిల్లింది. ఇస్సాకు తేటగా చూడలేకపోయాడు. ఒకనాడు తన పెద్ద కుమారుని అతడు తన దగ్గరకు పిల్చాడు, “కుమారుడా” అన్నాడు. [PE][PS] “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు ఏశావు. [PE][PS]
2. ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో!
3. కనుక నీ విల్లు, అంబులు తీసుకొని వేటకు వెళ్లు. నేను తినటానికి ఒక జంతువును చంపు.
4. నాకు ఇష్టమైన భోజనం తయారు చేయి. అది నా దగ్గరకు తీసుకురా, నేను తింటాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను.”
5. కనుక ఏశావు వేటకు వెళ్లాడు. [PE][PS] ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఆ సంగతులు చెబతున్నప్పుడు రిబ్కా విన్నది.
6. తన కుమారుడైన యాకోబుతో రిబ్కా చెప్పింది: “విను, నీ సోదరుడు ఏశావుతో నీ తండ్రి మాట్లాడటం నేను విన్నాను.
7. ‘నేను తినటానికి ఒక జంతువును చంపి నా కోసం భోజనం సిద్ధం చేయి, నేను భోంచేస్తాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను’ అని నీ తండ్రి చెప్పాడు.
8. కనుక, కుమారుడా నేను చెప్పేది విని అలా చేయి.
9. మన మేకల మందలోనికి వెళ్లి, రెండు మేక పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నీ తండ్రికి ఇష్టమైన పద్ధతిలో నేను వాటిని సిద్ధం చేస్తాను.
10. అప్పుడు ఆ భోజనాన్ని నీవే నీ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్లు. ఆయన మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు.” [PE][PS]
11. అయితే యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు.
12. నా తండ్రి నన్ను తాకితే నేను ఏశావును కానని ఆయన తెలుసుకొంటాడు. అప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించడు. నేను ఆయన్ను మోసం చేయటానికి ప్రయత్నించినందువల్ల ఆయన నన్ను శపిస్తాడు.” [PE][PS]
13. కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే ఆ నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది. [PE][PS]
14. కనుక యాకోబు వెళ్లి రెండు మేకల్ని తీసుకొని, తెచ్చి వాటిని తల్లికి ఇచ్చాడు. ఇస్సాకుకు ఇష్టమైన ఒక ప్రత్యేక విధానంలో అతని తల్లి ఆ మేకలతో వంట చేసింది.
15. తర్వాత ఆమె, తన కుమారుడు ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. ఆ బట్టలను చిన్న కుమారుడు యాకోబుకు ధరింపజేసింది.
16. ఆ మేకల చర్మాలను రిబ్కా తీసుకొని, వాటిని యాకోబు చేతుల మీద వేసింది.
17. తర్వాత రిబ్కా తాను వండిన భోజనం తెచ్చి, దానిని యాకోబుకు యిచ్చింది. [PE][PS]
18. యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ” అని పిల్చాడు. [PE][PS] “ఏమీ కుమారుడా, ఎవరు నీవు” అన్నాడు తండ్రి. [PE][PS]
19. “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేసాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటిచే నీకొరకైన భోజనమును సిద్ధపరచితిని. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు. [PE][PS]
20. అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు. [PE][PS] “త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేసాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు. [PE][PS]
21. అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబతో. [PE][PS]
22. కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు.
23. యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. [PE][PS]
24. “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అన్నాడు ఇస్సాకు. [PE][PS] “అవును, నేనే”అని యాకోబు జవాబిచ్చాడు. [PS]
25. {యాకోబుకు ఆశీర్వాదం} [PS] అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను అది భోంచేసి, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేసాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు. [PE][PS]
26. అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు.
27. కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు: “నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనా ఉంది. [QBR]
28. విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్టు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక. [QBR]
29. మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక, [QBR2] జనములు నీకు సాగిలపడుదురు గాక, [QBR] నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు [QBR] నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, “నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడుతాడు, [QBR] నిన్ను ఆశీర్వదించే ప్రతి వ్యక్తీ ఆశీర్వదించబడుతాడు.” [PS]
30. {ఏశావు ఆశీర్వాదం} [PS] యాకోబును ఆశీర్వదించటం ముగించాడు ఇస్సాకు. అప్పుడు, తన తండ్రి ఇస్సాకును విడిచి యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి వచ్చాడు.
31. తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో భోజనం తయారు చేసాడు ఏశావు. దానిని ఏశావు తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, “నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను దీవించగలవు”. [PE][PS]
32. అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అన్నాడు అతనితో. [PE][PS] “నేను నీ మొదటి కుమారుణ్ణి ఏశావును” అన్నాడతను. [PE][PS]
33. అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి నా దగ్గరకు తీసుకు వచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు. [PE][PS]
34. ఏశావు తన తండ్రి మాటలు విన్నాడు. అతనిలో కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి “అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అని తన తండ్రితో చెప్పాడు. [PE][PS]
35. “నీ సోదరుడు నన్ను మోసం చేసాడు. అతను వచ్చి, నీ ఆశీర్వాదాలు తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు. [PE][PS]
36. “అతని పేరే యాకోబు (మోసగాడు). అది అతనికి సరైన పేరు. రెండుసార్లు అతడు నన్ను మోసం చేసాడు. జ్యేష్ఠత్వపు హక్కు తీసువేసుకొన్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసువేసుకొన్నాడు.” అని చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా మిగిల్చావా?” అని ప్రశ్నించాడు. [PE][PS]
37. “లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు. [PE][PS]
38. తన తండ్రిని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. “నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వదమే ఉందా? నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు ఏడ్వటం మొదలుబెట్టాడు. [PE][PS]
39. అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు: “నీవు సారం లేని దేశంలో నివసిస్తావు [QBR2] నీకు వర్షపాతం ఎక్కువగా ఉండదు. [QBR]
40. నీ మనుగడ కోసం నీవు పోరాడాలి, [QBR2] నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు [QBR] అయితే స్వతంత్రం కోసం [QBR2] నీవు పోరాడతావు అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.” [PS]
41. ఆ తరువాత తన తండ్రి అతణ్ణి ఆశీర్వదించడంవల్ల యాకోబును ఏశావు అసహ్యించుకొన్నాడు. ఏశావు “త్వరలోనే నా తండ్రి చనిపోతాడు, నేను అతని కోసం దుఃఖిస్తాను. కాని ఆ తర్వాత యాకోబును నేను చంపేస్తాను” అని తనలో తాను అనుకొన్నాడు. [PE][PS]
42. ఏశావు యాకోబును చంపాలని చేస్తున్న ఆలోచనను గూర్చి రిబ్కా విన్నది. యాకోబును పిలిపించి, అతనితో ఆమె ఇలా చెప్పింది. “ఇది విను, నీ అన్న ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.
43. అందుచేత, కుమారుడా, నేను చెప్పినట్టు చేయి. హారానులో నా సోదరుడు లాబాను ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి దాగుకో.
44. కొన్నాళ్లపాటు అతని దగ్గరే ఉండు. నీ అన్న కోపం చల్లారే వరకు అతని దగ్గరే ఉండు.
45. కొన్ని రోజులు కాగానే నీవు నీ అన్నకు చేసినది అతడు మరచిపోతాడు. అప్పుడు నిన్ను వెనుకకు తీసుకొని రావటానికి నేను ఒక సేవకుని పంపిస్తాను. నా ఇద్దరు కుమారులను ఒకేనాడు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు.” [PE][PS]
46. అప్పుడు రిబ్కా ఇస్సాకుతో, “నీ కుమారుడైన ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన ప్రజలు కారు గనుక వారితో నేను చాలా విసిగిపోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పింది. [PE]

Notes

No Verse Added

Total 50 Chapters, Current Chapter 27 of Total Chapters 50
ఆదికాండము 27:57
1. {ఆస్తి సమస్యలు} PS ఇస్సాకు ముసలివాడైనప్పుడు అతని చూపు సన్నగిల్లింది. ఇస్సాకు తేటగా చూడలేకపోయాడు. ఒకనాడు తన పెద్ద కుమారుని అతడు తన దగ్గరకు పిల్చాడు, “కుమారుడా” అన్నాడు. PEPS “ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని జవాబిచ్చాడు ఏశావు. PEPS
2. ఇస్సాకు చెప్పాడు: “చూడు, నేను ముసలివాడనయ్యాను. ఒకవేళ త్వరలో నేను చనిపోతానేమో!
3. కనుక నీ విల్లు, అంబులు తీసుకొని వేటకు వెళ్లు. నేను తినటానికి ఒక జంతువును చంపు.
4. నాకు ఇష్టమైన భోజనం తయారు చేయి. అది నా దగ్గరకు తీసుకురా, నేను తింటాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను.”
5. కనుక ఏశావు వేటకు వెళ్లాడు. PEPS ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో సంగతులు చెబతున్నప్పుడు రిబ్కా విన్నది.
6. తన కుమారుడైన యాకోబుతో రిబ్కా చెప్పింది: “విను, నీ సోదరుడు ఏశావుతో నీ తండ్రి మాట్లాడటం నేను విన్నాను.
7. ‘నేను తినటానికి ఒక జంతువును చంపి నా కోసం భోజనం సిద్ధం చేయి, నేను భోంచేస్తాను. అప్పుడు నేను మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాను’ అని నీ తండ్రి చెప్పాడు.
8. కనుక, కుమారుడా నేను చెప్పేది విని అలా చేయి.
9. మన మేకల మందలోనికి వెళ్లి, రెండు మేక పిల్లల్ని నా దగ్గరకు తీసుకురా. నీ తండ్రికి ఇష్టమైన పద్ధతిలో నేను వాటిని సిద్ధం చేస్తాను.
10. అప్పుడు భోజనాన్ని నీవే నీ తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్లు. ఆయన మరణించక ముందు నిన్ను ఆశీర్వదిస్తాడు.” PEPS
11. అయితే యాకోబు తన తల్లి రిబ్కాతో ఇలా చెప్పాడు: “అయితే నా సోదరుడి శరీరమంతా వెంట్రుకలు ఉంటాయి, అతనిలా నాకు వెంట్రుకలు ఉండవు.
12. నా తండ్రి నన్ను తాకితే నేను ఏశావును కానని ఆయన తెలుసుకొంటాడు. అప్పుడు ఆయన నన్ను ఆశీర్వదించడు. నేను ఆయన్ను మోసం చేయటానికి ప్రయత్నించినందువల్ల ఆయన నన్ను శపిస్తాడు.” PEPS
13. కనుక రిబ్కా, “ఏదైనా కష్టం వస్తే నింద నేను భరిస్తాను. నేను చెప్పినది చేయి. వెళ్లి మేకల్ని తెచ్చి నాకు ఇవ్వు” అని అతనితో చెప్పింది. PEPS
14. కనుక యాకోబు వెళ్లి రెండు మేకల్ని తీసుకొని, తెచ్చి వాటిని తల్లికి ఇచ్చాడు. ఇస్సాకుకు ఇష్టమైన ఒక ప్రత్యేక విధానంలో అతని తల్లి మేకలతో వంట చేసింది.
15. తర్వాత ఆమె, తన కుమారుడు ఏశావు ఎక్కువగా ఇష్టపడి ధరించే బట్టలు తెచ్చింది. బట్టలను చిన్న కుమారుడు యాకోబుకు ధరింపజేసింది.
16. మేకల చర్మాలను రిబ్కా తీసుకొని, వాటిని యాకోబు చేతుల మీద వేసింది.
17. తర్వాత రిబ్కా తాను వండిన భోజనం తెచ్చి, దానిని యాకోబుకు యిచ్చింది. PEPS
18. యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ” అని పిల్చాడు. PEPS “ఏమీ కుమారుడా, ఎవరు నీవు” అన్నాడు తండ్రి. PEPS
19. “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేసాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటిచే నీకొరకైన భోజనమును సిద్ధపరచితిని. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు. PEPS
20. అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు. PEPS “త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేసాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు. PEPS
21. అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబతో. PEPS
22. కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు.
23. యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. PEPS
24. “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అన్నాడు ఇస్సాకు. PEPS “అవును, నేనే”అని యాకోబు జవాబిచ్చాడు. PS
25. {యాకోబుకు ఆశీర్వాదం} PS అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను అది భోంచేసి, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేసాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు. PEPS
26. అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు.
27. కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు: “నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనా ఉంది.
28. విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్టు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.
29. మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక,
జనములు నీకు సాగిలపడుదురు గాక,
నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు
నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు, “నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడుతాడు,
నిన్ను ఆశీర్వదించే ప్రతి వ్యక్తీ ఆశీర్వదించబడుతాడు.” PS
30. {ఏశావు ఆశీర్వాదం} PS యాకోబును ఆశీర్వదించటం ముగించాడు ఇస్సాకు. అప్పుడు, తన తండ్రి ఇస్సాకును విడిచి యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి వచ్చాడు.
31. తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో భోజనం తయారు చేసాడు ఏశావు. దానిని ఏశావు తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, “నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను దీవించగలవు”. PEPS
32. అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అన్నాడు అతనితో. PEPS “నేను నీ మొదటి కుమారుణ్ణి ఏశావును” అన్నాడతను. PEPS
33. అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి నా దగ్గరకు తీసుకు వచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు. PEPS
34. ఏశావు తన తండ్రి మాటలు విన్నాడు. అతనిలో కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి “అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అని తన తండ్రితో చెప్పాడు. PEPS
35. “నీ సోదరుడు నన్ను మోసం చేసాడు. అతను వచ్చి, నీ ఆశీర్వాదాలు తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు. PEPS
36. “అతని పేరే యాకోబు (మోసగాడు). అది అతనికి సరైన పేరు. రెండుసార్లు అతడు నన్ను మోసం చేసాడు. జ్యేష్ఠత్వపు హక్కు తీసువేసుకొన్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసువేసుకొన్నాడు.” అని చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా మిగిల్చావా?” అని ప్రశ్నించాడు. PEPS
37. “లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు. PEPS
38. తన తండ్రిని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. “నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వదమే ఉందా? నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు ఏడ్వటం మొదలుబెట్టాడు. PEPS
39. అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు: “నీవు సారం లేని దేశంలో నివసిస్తావు
నీకు వర్షపాతం ఎక్కువగా ఉండదు.
40. నీ మనుగడ కోసం నీవు పోరాడాలి,
నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు
అయితే స్వతంత్రం కోసం
నీవు పోరాడతావు అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.” PS
41. తరువాత తన తండ్రి అతణ్ణి ఆశీర్వదించడంవల్ల యాకోబును ఏశావు అసహ్యించుకొన్నాడు. ఏశావు “త్వరలోనే నా తండ్రి చనిపోతాడు, నేను అతని కోసం దుఃఖిస్తాను. కాని తర్వాత యాకోబును నేను చంపేస్తాను” అని తనలో తాను అనుకొన్నాడు. PEPS
42. ఏశావు యాకోబును చంపాలని చేస్తున్న ఆలోచనను గూర్చి రిబ్కా విన్నది. యాకోబును పిలిపించి, అతనితో ఆమె ఇలా చెప్పింది. “ఇది విను, నీ అన్న ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు.
43. అందుచేత, కుమారుడా, నేను చెప్పినట్టు చేయి. హారానులో నా సోదరుడు లాబాను ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి దాగుకో.
44. కొన్నాళ్లపాటు అతని దగ్గరే ఉండు. నీ అన్న కోపం చల్లారే వరకు అతని దగ్గరే ఉండు.
45. కొన్ని రోజులు కాగానే నీవు నీ అన్నకు చేసినది అతడు మరచిపోతాడు. అప్పుడు నిన్ను వెనుకకు తీసుకొని రావటానికి నేను ఒక సేవకుని పంపిస్తాను. నా ఇద్దరు కుమారులను ఒకేనాడు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు.” PEPS
46. అప్పుడు రిబ్కా ఇస్సాకుతో, “నీ కుమారుడైన ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన ప్రజలు కారు గనుక వారితో నేను చాలా విసిగిపోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పింది. PE
Total 50 Chapters, Current Chapter 27 of Total Chapters 50
×

Alert

×

telugu Letters Keypad References