1. ఆ దేశపు రాజుకు మీరు ఒక కానుక పంపాలి. సెలానుండి అరణ్యంగుండా సీయోను కుమార్తె కొండకు (యెరూషలేము) మీరు ఒక గొర్రెపిల్లను పంపాలి.
2. మోయాబు స్త్రీలు అర్నోను నది దాటేందుకు ప్రయత్నిస్తారు. [QBR2] సహాయం కోసం వారు ఒకచోట నుండి మరోచోటుకు పరుగులెత్తుతారు. [QBR2] వారు, గూడు నేల కూలినప్పుడు తప్పిపోయిన చిన్న పిట్ట పిల్లలా ఉంటారు. [QBR]
3. “మాకు సహాయం చేయండి, [QBR2] మేం ఏం చేయాలో మాకు చెప్పండి! [QBR] మధ్యాహ్నపు ఎండనుండి నీడ కాపాడినట్టు [QBR2] మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి. [QBR] మా శత్రువుల నుండి మేం పారిపోతున్నాం [QBR2] మమ్మల్ని దాచిపెట్టండి. [QBR2] మమ్మల్ని మా శత్రువులకు అప్పగించకండి అని వారంటారు. [QBR]
4. ఆ మోయాబు ప్రజలు వారి ఇండ్లనుండి బలవంతంగా వెళ్లగొట్టిబడ్డారు. [QBR2] కనుక వాళ్లను మీ దేశంలో నివాసం ఉండనియ్యండి. [QBR2] వారి శత్రువులనుండి వారిని కాపాడండి.” దోచుకోవటం ఆగిపోతుంది. [QBR2] శత్రువు ఓడించబడతాడు. [QBR] ఇతరులను బాధించే పురుషులు దేశం నుండి వెళ్లిపోతారు. [QBR]
5. అప్పుడు కొత్త రాజు వస్తాడు. [QBR2] ఈ రాజు దావీదు వంశంవాడు. [QBR2] ఆయన నిజాయితీ పరుడు. ఆయన ప్రేమ, దయగలవాడు. [QBR] ఈ రాజు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. [QBR2] సరియైనవి, మంచివి ఆయన చేస్తాడు.
6. మోయాబు ప్రజలు చాలా గర్విష్ఠులని, [QBR2] మోసగాళ్లని మేము విన్నాం. [QBR] ఈ ప్రజలు తిరుగు బాటు దారులు, గర్విష్ఠులు. [QBR2] అయితే వారి గొప్పలన్నీ వట్టి మాటలే. [QBR]
7. ఆ గర్వం చేత మొత్తం మోయాబు దేశం శ్రమ అనుభవిస్తుంది. మోయాబు ప్రజలంతా ఏడుస్తారు. [QBR] ప్రజలు విచారిస్తారు. గతంలో వారికి ఉన్నవన్నీ మళ్లీ కావాలనుకొంటారు. [QBR2] కీర్హరెశెతు ద్రాక్షపండ్ల అడలు కావాలని వారు కోరుకొంటారు. [QBR]
8. హెష్బోను పొలాలు, సిబ్మా ద్రాక్ష వల్లులు, ద్రాక్ష పండ్లు ఫలించటం లేదని ప్రజలు విచారంగా ఉంటారు. [QBR2] విదేశీ పాలకులు ద్రాక్ష వల్లులను నరికివేశారు. [QBR2] శత్రుసైన్యాలు యాజరు పట్టణం వరకు చాలా దూరం, అరణ్యంలోనికి విస్తరించారు. సముద్రం వరకు వారు విస్తరించారు. [QBR]
9. “ద్రాక్ష పండ్లు నాశనం చేయబడ్డాయి. [QBR2] కనుక యాజరు, సిబ్మా ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. [QBR] పంట ఉండదు గనుక హెష్బోను, [QBR2] ఏలాలే ప్రజలతోబాటు నేనూ ఏడుస్తాను. [QBR] వేసవి పండ్లు ఏమీ ఉండవు. [QBR2] సంతోషపు కేకలు అక్కడ ఉండవు. [QBR]
10. కర్మెలులో పాటలు పాడటం మరియు సంతోషం ఉండదు. [QBR2] పంట కోత సమయంలో సంతోషం అంతా నేను నిలిపివేస్తాను. [QBR] ద్రాక్షపండ్లు ద్రాక్షరసం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. [QBR2] కానీ అవన్నీ వ్యర్థం అవుతాయి. [QBR]
11. అందుచేత మోయాబు గూర్చి నాకు చాలా విచారం కీర్హరెశు గూర్చి నాకు చాలా విచారం [QBR2] ఈ పట్టణాల గూర్చి నాకు ఎంతెంతో దుఃఖం. [QBR]
12. మోయాబు ప్రజలు ఎత్తయిన వారి పూజాస్థలాలకు వెళ్తారు. [QBR] ప్రజలు ప్రార్థించాలని ప్రయత్నిస్తారు. [QBR2] కానీ సంభవించిన సంగతులన్నీ వారు చూస్తారు, ప్రార్థించలేనంత బలహీనులవుతారు.” [PS]
13. మోయాబును గూర్చి ఈ విషయాలు యెహోవా ఎన్నోసార్లు చెప్పాడు.
14. ఇప్పుడు “మూడు సంవత్సరాల్లో (కూలీ వాని కాలం లెక్క ప్రకారం) ఆ ప్రజలందరూ ఉండరు, వారికి అతిశయాస్పదమైనవన్నీ పోతాయి. కొంతమంది మనుష్యులు మిగిలి ఉంటారు. కానీ వారు ఎక్కువ మంది ఉండరు” అని యెహోవా చెబుతున్నాడు. [PE]