1. {ఇశ్రాయేలు శిక్ష ముగుస్తుంది} [PS] మీ దేవుడు చెబతున్నాడు, [QBR] “ఆదరించండి, నా ప్రజలను ఆదరించండి! [QBR]
2. యెరూషలేముతో దయగా మాట్లాడండి. [QBR2] ‘నీ సేవాసమయం అయిపోయింది [QBR2] నీ పాపాలకు విలువ నీవు చెల్లించావు’ అని యెరూషలేముతో చెప్పండి [QBR] యెరూషలేము చేసిన ప్రతి పాపానికి రెండేసి సార్లు యెహోవా యెరూషలేమును శిక్షించాడు.”
3. వినండి! ఒక మనిషి గట్టిగా ఎడారిలో బోధిస్తున్న శబ్దం మీరు వినగలరు. [QBR] “యెహోవా మార్గాన్ని సిద్ధం చేయండి. [QBR2] ఎడారిలో మన దేవుని కోసం తిన్ననిదైన ఒక రాజమార్గాన్ని వేయండి. కరకు సమనేలగా చేయండి. [QBR]
4. ప్రతి లోయనూ పూడ్చండి [QBR2] ప్రతి పర్వతాన్ని కొండను చదును చేయండి. [QBR] వంకర మార్గాలను చక్కగా చేయండి. [QBR2] కరకు నేలను సమనేలగా చేయండి. [QBR]
5. అప్పుడు యెహోవా మహిమ కనబడుతుంది [QBR2] మనుష్యులందరూ కలిసి యెహోవా మహిమను చూస్తారు. [QBR] సాక్షాత్తూ యెహోవాయే ఈ సంగతులు చెప్పాడు కనుక ఇది జరుగుతుంది.”
6. ఒక స్వరం పలికింది, “మాట్లాడు” అని. [QBR2] కనుక ఆ మనిషి అన్నాడు, “నేనేమి చెప్పను?” [QBR] ఆ స్వరం అంది, “ఇలా చెప్పు: మనుష్యులు అందరూ గడ్డిలా ఉన్నారు. [QBR2] మనుష్యుల మంచి తనం కొత్త గడ్డి పరకలా ఉంది. [QBR]
7. యెహోవా నుండి ఒక బలమైన గాలి గడ్డిమీద వీస్తుంది. [QBR2] ఆ గడ్డి ఎండిపోయి, చస్తుంది. [QBR2] సత్యం ఏమిటంటే: మనుష్యులంతా గడ్డి. [QBR]
8. గడ్డి చచ్చిపోయి ఎండిపోతుంది. [QBR2] కానీ మన దేవుని మాటలు శాశ్వతంగా నిలిచి ఉంటాయి.”
9. {రక్షణః దేవుని శుభ వార్త} [PS] సీ యోనూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. [QBR2] ఎత్తయిన పర్వతం మీదకు ఎక్కి గట్టిగా ప్రకటించు. [QBR] యెరూషలేమూ, నీవు చెప్పాల్సిన శుభవార్త ఉంది. [QBR2] భయపడవద్దు. గట్టిగా మాట్లాడు. [QBR] యూదా పట్టణాలన్నింటికి ఈ విషయాలు చెప్పు: [QBR2] “చూడు, ఇదిగో మీ దేవుడు! [QBR]
10. చూడు, యెహోవా, నా ప్రభువు శక్తితో వస్తున్నాడు. [QBR2] మనుష్యులందరినీ పాలించుటకు ఆయన తన శక్తిని ప్రయోగిస్తాడు. [QBR] యెహోవా తన ప్రజలకు ప్రతిఫలం తెస్తాడు. [QBR2] వారి జీతం యెహోవా దగ్గర ఉర ది [QBR]
11. గొర్రెల కాపరి తన గొర్రెలను నడిపించినట్టు యెహోవా తన ప్రజలను నడిపిస్తాడు. [QBR2] యెహోవా తన హస్తాన్ని (శక్తిని) ఉపయోగించి తన గొర్రెలను ఒక చోట చేరుస్తాడు. [QBR2] గొర్రెపిల్లలను యెహోవా పట్టుకొని వాటిని ఆయన తన చేతుల్లో ఎత్తుకొంటాడు. వాటి తల్లులు ఆయన చెంత నడుస్తాయి.” దేవుడు లోకాన్ని చేశాడు; దాన్ని ఆయన పరిపాలిస్తాడు
12. మహా సముద్రాలను తన పిడికిటిలో కొలిచింది ఎవరు? [QBR2] ఆకాశాన్ని కొలిచేందుకు తన చేతిని ఉపయోగించింది ఎవరు? [QBR] భూమిమీద ధూళి అంతటినీ కొలి చేందుకు పాత్రను ఉపయోగించింది ఎవరు? [QBR2] పర్వతాలను, కొండలను తూకం వేసేందుకు త్రాసులను ఉపయోగించింది ఎవరు? యెహోవాయే. [QBR]
13. యెహోవా చేయాల్సింది ఏమిటో ఆయన ఆత్మకు ఎవరూ చెప్పలేదు. [QBR2] యెహోవా చేసిన వాటిని ఎలా చేయాలో ఆయనకు చెప్పిన వారెవరూ లేరు. [QBR]
14. యెహోవా ఎవరి సహాయమైనా అడిగాడా? [QBR2] న్యాయంగా ఉండటం ఎలా అనేది ఎవరైనా యెహోవాకు నేర్పించారా? [QBR2] యెహోవాకు ఎవరైనా తెలివిని ఉపదేశించారా? [QBR2] యెహోవా జ్ఞానాన్ని వినియోగించటం ఆయనకు ఎవరైనా నేర్పించారా? [QBR2] లేదు. ఇవన్నీ యెహోవాకు ముందే తెలుసు. [QBR]
15. చూడండి, యెహోవా లోకంలో రాజ్యాలన్నీ ఒక చిన్న భాగమే. రాజ్యాలు చేదలోనుంచి జారే ఒక బొట్టు వంటివి. [QBR] దూర దేశాలన్నింటినీ యెహోవా తీసుకొని ఆయన వాటిని తన త్రాసులో వేస్తే [QBR2] అవి చిన్న ధూళి కణాల్లా ఉంటాయి. [QBR]
16. యెహోవాకు సమిధలుగా లెబానోను చెట్లన్నీ చాలవు. [QBR2] లెబానోను జంతువులన్నీ యెహోవాకు బలి అర్పణగా చాలవు. [QBR]
17. లోక రాజ్యాలన్నింటినీ దేవునితో నీవు పోలిస్తే రాజ్యాలు శూన్యం [QBR2] దేవునితో పోలిస్తే రాజ్యాలన్నీ కలిసి ఏ మాత్రం విలువ చేయవు.
18. {దేవుడు ఎలాంటివాడవి ప్రజలు ఊహించలేరు} [PS] నీవు దేనినైనా దేవునితో పోల్చగలవా? [QBR2] లేదు నీవు దేవుని పటము చేయగలవా? లేదు. [QBR]
19. కానీ కొందరు మనుష్యులు బండనుండి చెక్కనుండి విగ్రహాలు చేసి [QBR2] వాటికి దేవుళ్లని పేరుపెడుతున్నారు. [QBR] ఒక పనివాడు ఒక విగ్రహం చేస్తాడు. [QBR2] బంగారం పనివాడు ఆ విగ్రహానికి బంగారం పూత పూస్తాడు. అప్పుడు అతడు ఆ విగ్రహానికి వెండి గొలుసులు చేస్తాడు. [QBR]
20. పేదవాడు ఖరీదైన ఆ విగ్రహాలు కొనలేడు. [QBR2] కనుక పేదవాడు కుళ్లిపోని ఒక చెట్టును చూస్తాడు. [QBR] తర్వాత ఒక మనిషికి డబ్బిచ్చి దానిమీద ఒక దేవుని బొమ్మ చెక్కిస్తాడు. [QBR2] అదీ, పేదవాని దేవుడు. మరి ఆ “దేవుడు” కనీసం కదలడు. [QBR]
21. తప్పకుండా సత్యం నీకు తెలుసు కదూ? [QBR2] తప్పక అది నీవు విన్నావు. [QBR2] ఆదిలోనే ఎవరో ఒకరు నీతో సత్యం చెప్పారు. [QBR2] భూమిని చేసింది ఎవరో తప్పక నీకు తెలుసు. [QBR]
22. నిజమైన దేవుడు భూగోళానికి పైగా కూర్చుని ఉంటాడు. [QBR2] ఆయనతో పోల్చి చూస్తే మనుష్యులు మిడతల్లా ఉంటారు. [QBR] ఆయన ఆకాశాలను బట్ట తెరచినట్టు తెరిచాడు. [QBR2] ఆయన ఆకాశాలను ఒక గుడారంలా దాని కింద కూర్చునేందుకు పరిచాడు. [QBR]
23. నిజమైన దేవుడు పరిపాలకులను పాము ఖ్యత లేనివారినిగా చేస్తాడు. [QBR2] ఆయన ఈ లోకపు న్యాయ మూర్తులను పూర్తిగా నిష్ప్రయోజకులనుగా చేస్తాడు. [QBR]
24. ఆ పరిపాలకులు మొక్కల్లా ఉన్నారు వారు భూమిలో నాటబడ్డారు [QBR2] కానీ వారు నేలలో వేరు తన్నుకొనక ముందే [QBR] దేవుడు ఆ మొక్కల మీద గాలి విసరజేస్తాడు. [QBR2] దాంతో అవి చచ్చి, ఎండి పోతాయి. [QBR2] గాలి వాటిని గడ్డి పరకల్లా కొట్టుకొని పోజేస్తుంది. [QBR]
25. పరిశుద్ధుడు (దేవుడు) చెబతున్నాడు: “నన్ను నీవు ఎవరితోనైనా పోల్చగలవా? [QBR2] లేదు. నాకు ఎవరు సమానం కాదు.”
26. పైన ఆకాశాలను చూడు [QBR2] ఆ నక్షత్రాలన్నింటినీ ఎవరు సృష్టించారు? [QBR2] ఆకాశంలోని ఆ “సైన్యాలు” అన్నింటిని ఎవరు సృష్టించారు? [QBR2] ప్రతి నక్షత్రం దాని పేరుతో సహా ఎవరికి తెలుసు? [QBR] సత్యవంతుడైన దేవుడు చాలా బలం, శక్తి గలవాడు, [QBR2] అందుచేత ఈ నక్షత్రాల్లో ఒక్కటి కూడ తప్పిపోదు.
27. యాకోబూ, ఇది నిజం! [QBR2] ఇశ్రాయేలూ, దీనిని నీవు నమ్మాలి! [QBR] “నేను జీవించే విధము యెహోవా చూడలేదు [QBR2] దేవుడు నన్ను కనుగొని శిక్షించాడు అని నీవెందుకు చెపుతున్నావు?”
28. యెహోవా అలసిపోడు, ఆయనకు విశ్రాంతి అవసరంలేదు. [QBR2] భూమిమీద దూర స్థలాలన్నింటినీ యెహోవాయే సృష్టించాడు యెహోవా నిత్యమూ జీవిస్తాడు. [QBR]
29. బలహీనులు బలంగా ఉండేటట్టు యెహోవా సహాయం చేస్తాడు. [QBR2] శక్తిలేని వాళ్లను ఆయన శక్తి మంతులుగా చేస్తాడు. [QBR]
30. యువకులు అలసిపోతారు, వారికి విశ్రాంతి కావాలి. [QBR2] చివరికి బాలురు కూడ తొట్రిల్లి, పడిపోతారు. [QBR]
31. కాని యెహోవా మీద విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడే మనుష్యులు తిరిగి బలంగల వాళ్లవుతారు. అది వారు పక్షి రాజులా రెక్కలు కలిగి ఉన్నట్టుగా ఉంటుంది. [QBR2] వారు విశ్రాంతి అవసరం లేకుండా పరుగుల మీద పరుగులు తీస్తూ ఉంటారు. [QBR2] వారు అలసి పోకుండా నడుస్తారు. [PE]