1. {నిజంగా సంతృప్తిపరచే ఆహారం దేవుడు ఇస్తాడు} [PS] “దాహంతో ఉన్న ప్రజలారా [QBR2] మీరంతా వచ్చి నీళ్లు తాగండి! [QBR] మీ వద్ద డబ్బు లేకపోతే చింతపడకండి. [QBR2] రండి, మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, తాగండి! [QBR] మీకు డబ్బు అవసరం లేదు. [QBR2] మీకు తృప్తి కలిగేంతవరకు తినండి, తాగండి. ఆహారం, ద్రాక్షారసం ఉచితం! [QBR]
2. నిజంగా ఆహారం కానిదానికోసం మీ ధనం వ్యర్థం చేయటం ఎందుకు? [QBR2] మిమ్మల్ని నిజంగా సంతృప్తి పరచని దానికోసం మీరు ప్రయాసపడటం ఎందుకు? [QBR] నా మాట జాగ్రత్తగా వినండి, అప్పుడు మీరు మంచి ఆహారం భోజనం చేస్తారు. [QBR2] మీ ఆత్మను తృప్తిపరచే ఆహారం మీరు భోజనం చేస్తారు. [QBR]
3. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి, [QBR2] మీ ఆత్మలు జీవించున ట్టుగా మీరు నా మాట వినండి. నా వద్దకు రండి! [QBR] శాశ్వతంగా కొనసాగే ఒడంబడిక నేను మీతో చేస్తాను. [QBR2] అది నేను దావీదుతో చేసిన ఒడంబడికలా ఉంటుంది. దావీదు ఎడల శాశ్వతంగా దయగలిగి ఉంటానని నేను అతనికి వాగ్దానం చేసాను. [QBR2] మరి మీరు ఆ వాగ్దానాన్ని నమ్ముకోవచ్చు. [QBR]
4. రాజ్యాలన్నింటిలో నా శక్తికి దావీదును సాక్షిగా నేను చేశాను. [QBR] దావీదు అనేక రాజ్యాలకు పరిపాలకు నిగాను, సర్వసేనానిగాను ఉంటాడని నేను అతనికి వాగ్దానం చేశాను.”
5. నీవు యెరుగని స్థలాల్లో రాజ్యాలు ఉన్నాయి, [QBR2] కానీ ఆ రాజ్యాలను నీవు పిలుస్తావు. [QBR] ఆ రాజ్యాలకు నీవు తెలియదు. [QBR2] కానీ అవి నీ దగ్గరకు పరుగెడతాయి. [QBR] నీ దేవుడు యెహోవా ఇలా కోరుతున్నాడు కనుక ఇది జరుగుతుంది. [QBR2] ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు నిన్ను గౌరవిస్తున్నాడు. కనుక ఇది జరుగుతుంది. [QBR]
6. కనుక సమయం మించిపోక ముందే [QBR2] నీవు యెహోవా కోసం వెదకాలి. [QBR] ఆయన సమీపంగాఉన్నప్పుడు, [QBR2] ఇప్పుడే నీవు ఆయనను వేడుకోవాలి. [QBR]
7. దుర్మార్గులు వారి దుర్మార్గ జీవితాలు విడిచిపెట్టాలి. [QBR2] వారు తమ దురాలోచనలు నిలిపివేయాలి. [QBR] వారు తిరిగి యెహోవా దగ్గరకు రావాలి. [QBR2] అప్పుడు యెహోవా వారిని ఆదరిస్తాడు. [QBR] మన దేవుడు క్షమిస్తాడు గనుక [QBR2] ఆ మనుష్యులు యెహోవా దగ్గరకు రావాలి.
8. {మనుష్యులు దేవుణ్ణి అర్థం చేసుకోలేరు} [PS] యెహోవా చెబుతున్నాడు, “మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. [QBR2] మీ మార్గాలు నా మార్గాలవంటివి కావు. [QBR]
9. ఆకాశాలు భూమికంటె ఉన్నతంగా ఉన్నాయి. [QBR2] అదే విధంగా మీ మార్గాలకంటె నా మార్గాలు ఉన్నతంగా ఉన్నాయి. మరియు మీ తలంపులకంటె నా తలంపులు ఉన్నతంగా ఉన్నాయి.” [QBR] యెహోవా తానే ఈ సంగతులు చెప్పాడు.
10. “వర్షం, మంచు ఆకాశం నుండి కురుస్తాయి. [QBR2] అవినేలను తాకి, నేలను తడిచేయకుండా తిరిగి ఆకాశానికి వెళ్లవు. [QBR] అప్పుడు నేల మొక్కలను మొలిపించి, ఎదిగింప చేస్తుంది. [QBR2] ఈ మొక్కలు రైతుకోసం విత్తనాలు సిద్ధం చేస్తాయి. ప్రజలు ఆహారంగా రొట్టెలకోసం ఈ విత్తనాలు వినియోగిస్తారు. [QBR]
11. అదే విధంగా నా నోటినుండి నా మాటలు బయలు వెళ్తాయి. [QBR2] అవి సంగతులను సంభవింప చేసేంతవరకు తిరిగి రావు. [QBR] నేను ఏ సంగతులు సంభవించాలని అనుకొంటానో వాటిని నా మాటలు సంభవింపచేస్తాయి. [QBR2] ఏమి చేయాలని నేను నా మాటలను పంపిస్తానో వాటిని నా మాటలు సాధిస్తాయి.
12. “నా మాటలు సంతోషంగా బయలు వెళ్తాయి. [QBR2] అవి శాంతి కలిగిస్తాయి. [QBR] పర్వతాలు, కొండలు సంతోషంగా నాట్యంచేయటం మొదలు పెడతాయి [QBR2] పొలాల్లోని చెట్లన్నీ చప్పట్లుకొడ్తాయి. [QBR]
13. పొదలు ఉన్నచోట పెద్ద దేవదారు వృక్షాలు పెరుగుతాయి. [QBR2] కలుపు మొక్కలు ఉన్నచోట గొంజి వృక్షాలు పెరుగుతాయి. [QBR] ఈ సంగతులు యెహోవాను ప్రసిద్ధుని చేస్తాయి. [QBR2] యెహోవా శక్తిమంతుడు అనేందుకు ఈ సంగతులు రుజువు. ఈ రుజువు ఎన్నటికి నాశనం చేయబడదు.” [PE]