1. {యెహోవా తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు} [PS] ఎదోమునుండి వస్తున్న ఇతడు ఎవరు? [QBR] ఎర్రటి వస్త్రాలు ధరించి బొస్రానుండి అతడు వస్తున్నాడు. [QBR2] అతడు తన వస్త్రాల్లో శోభిల్లుతున్నాడు. [QBR] అతడు మహా శక్తితో అతిశయంగా నడుస్తున్నాడు. [QBR2] “మిమ్మల్ని రక్షించే శక్తి నాకు ఉంది. నేను నిజాయితీగా మాట్లాడుచున్నాను” [QBR2] అని అతడు చెబుతున్నాడు.
2. “నీ వస్త్రాలు ఎందుకు అంత మరీ ఎర్రగా ఉన్నాయి? [QBR2] ద్రాక్షపండ్ల నుండి ద్రాక్షరసం చేసే వానిలా ఎర్రగా ఉన్నాయెందుకు నీ వస్త్రాలు?”
3. అతడు జవాబిస్తున్నాడు, “నా మట్టుకు నేను ద్రాక్షగానుగలో నడిచాను. [QBR2] నాకు ఎవ్వరూ సహాయం చేయలేదు. [QBR] నాకు కోపం వచ్చింది, ద్రాక్షపండ్ల మీద నడిచాను. [QBR2] ద్రాక్ష పండ్ల రసం నా బట్టలమీద చిమ్మింది. కనుక ఇప్పుడు నా బట్టలు మైలపడ్డాయి. [QBR]
4. ప్రజలను శిక్షించుటకు నేను ఒక సమయం ఏర్పరచుకొన్నాను. [QBR2] నా ప్రజలను నేను రక్షించి, కాపాడవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. [QBR]
5. చుట్టూ కలియజూశాను, కానీ నాకు సహాయం చేసేవాడు ఒక్కడూ నాకు కనబడలేదు. [QBR2] నన్ను ఒక్కరూ బలపర్చకపోవటం నాకు ఆశ్చర్యం కలిగించింది. [QBR] కనుక నా ప్రజలను రక్షించుటకు నా స్వంత శక్తి నేను ప్రయోగించాను. [QBR2] నా కోపమే నాకు బలం ఇచ్చింది. [QBR]
6. నేను కోపంగా ఉన్నప్పుడు, నేను ప్రజల మీద నడిచాను. [QBR2] నాకు వెర్రికోపం వచ్చినప్పుడు నేను వారిని శిక్షించాను. నేను వారి రక్తం నేలమీద ఒలకబోశాను.”
7. {యెహోవా తన ప్రజల ఎడల దయ చూపిస్తూ ఉన్నాడు} [PS] యెహోవా దయగలవాడు అని నేను జ్ఞాపకం చేసుకొంటాను. [QBR2] మరియు యెహోవాను స్తుతించటం నేను జ్ఞాపకం చేసుకొంటాను. [QBR] ఇశ్రాయేలు వంశానికి యెహోవా అనేకమైన మంచివాటిని ఇచ్చాడు. [QBR] యెహోవా మా యెడల చాలా దయచూపించాడు. [QBR2] యెహోవా మా యెడల కరుణ చూపించాడు. [QBR]
8. “వీరు నా పిల్లలు. ఈ పిల్లలు అబద్ధమాడరు” [QBR2] అని యెహోవా చెప్పాడు. [QBR] కనుక యెహోవా ఈ ప్రజలను రక్షించాడు. [QBR]
9. ప్రజలను చాలా కష్టాలు వచ్చాయి. [QBR2] కానీ యెహోవా వారికి విరోధంగా లేడు. [QBR] యెహోవా ప్రజలను ప్రేమించాడు. వారిని గూర్చి ఆయన విచారించాడు. [QBR2] కనుక యెహోవా ప్రజలను రక్షించాడు. [QBR] వారిని రక్షించేందుకు ఆయన తన ప్రత్యేక దేవదూతను పంపించాడు. [QBR2] మరియు యెహోవా ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం శాశ్వతంగా కొనసాగిస్తాడు. ఆ ప్రజలను గూర్చి శ్రద్ధ తీసుకోవటం ఎన్నడైనా చాలించాలని యెహోవా కోరలేదు. [QBR]
10. అయితే ప్రజలు యెహోవాకు విరోధం అయ్యారు. [QBR2] ఆయన పరిశుద్ధాత్మను ప్రజలు చాలా దుఃఖపర్చారు. [QBR] అందుచేత యెహోవా వారికి శత్రువు అయ్యాడు. [QBR2] యెహోవా ఆ ప్రజలకు విరోధంగా పోరాడాడు.
11. కానీ యెహోవా చాలా పూర్వకాలాన జరిగినదాన్ని ఇంకా జ్ఞాపకం ఉంచుకొంటాడు. [QBR2] మోషే, అతని ప్రజలూ యెహోవాకు జ్ఞాపకం. [QBR] సముద్రంలోనుండి ప్రజలను బయటకు తీసుకొనివచ్చిన వాడు యెహోవాయే. [QBR2] యెహోవా తన మందను (ప్రజలును) నడిపించటానికి తన కాపరులను (ప్రవక్తలను) వాడుకొన్నాడు. [QBR] అయితే మోషేలో తన ఆత్మను ఉంచిన ఆ యెహోవా ఇప్పుడు ఎక్కడ? [QBR]
12. యెహోవా తన కుడిచేత మోషేను నడిపించాడు. మోషేను నడిపించుటకుగాను యెహోవా తన అద్భుత శక్తిని ఉపయోగించాడు. [QBR] ప్రజలు సముద్రంలోనుండి నడువగలిగేట్టు [QBR2] యెహోవా నీళ్లను పాయలు చేశాడు. [QBR] ఈ గొప్ప కార్యాలు చేయటం వల్ల [QBR2] యెహోవా తన నామాన్ని ప్రఖ్యాతి చేసుకొన్నాడు. [QBR]
13. లోతైన సముద్రాల మధ్యనుండి తన ప్రజలను యెహోవా నడిపించాడు. [QBR2] ప్రజలు పడిపోకుండా నడిచారు. [QBR2] అరణ్యంలో గుర్రం నడచినట్టు వారు నడిచారు. [QBR]
14. ఒక ఆవు ఊరికే పొలంలో నడుస్తూ పడిపోదు. [QBR2] అదేవిధంగా ప్రజలు సముద్రంలోనుండి వెళ్తూ పడిపోలేదు. [QBR2] ఒక విశ్రాంతి స్థలానికి ప్రజలను యెహోవా ఆత్మ నడిపించింది. [QBR] అంతవరకు ప్రజలు క్షేమంగా ఉన్నారు. యెహోవా, నీవు నీ ప్రజలను నడిపించిన విధం అది. [QBR2] ప్రజలను నీవు నడిపించావు, నీ నామాన్ని నీవు ఆశ్చర్యకరమైనదిగా చేసుకొన్నావు.
15. {తన ప్రజలకు సహాయం చేయమని దేవునికొక ప్రార్థన} [PS] యెహోవా, పరలోకము నుండి చూడుము. [QBR2] ఇప్పుడు జరుగుతున్న సంగతులు చూడుము. [QBR] పరలోకంలో ఉన్న నీ మహాగొప్ప పవిత్ర నివాసంనుండి కిందనున్న మమ్మల్ని చూడుము. [QBR2] మా మీద నీ బలమైన ప్రేమ ఏది? [QBR2] నీ అంత రంగంలో నుండి బయలువెడలే నీ శక్తివంతమైన కార్యాలు ఏవి? [QBR2] నామీద నీ కరుణ ఏది? నామీద నీ దయగల ప్రేమను ఎందుకు దాచిపెడ్తున్నావు? [QBR]
16. చూడు, నీవు మా తండ్రివి! [QBR2] మేము అబ్రాహాము పిల్లలమని అతనికి తెలియదు. [QBR2] ఇశ్రాయేలు (యాకోబు) మమ్మల్ని గుర్తించలేడు. [QBR] యెహోవా, నీవు మా తండ్రివి. [QBR2] మమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించినవాడవు నీవే. [QBR]
17. యెహోవా, నీవు మమ్మల్ని నీ దగ్గర్నుండి ఎందుకు తోసివేస్తున్నావు? [QBR2] మేము నిన్ను అనుసరించటం మాకు కష్టతరంగా నీవెందుకు చేస్తున్నావు? [QBR] యెహోవా, మా దగ్గరకు తిరిగి రమ్ము. [QBR2] మేము నీ సేవకులం. [QBR] మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయి. [QBR2] మా కుటుంబాలు నీకు చెందినవి. [QBR]
18. నీ పరిశుద్ధ ప్రజలకు ఇప్పుడు చాలా కష్టాలు వచ్చాయి. [QBR2] మా శత్రువులు నీ పరిశుద్ధ ఆలయం మీద నడుస్తున్నారు. [QBR]
19. కొందరు మనుష్యులు నిన్ను వెంబడించరు. [QBR2] ఆ ప్రజలు నీ నామం ధరించరు. [QBR] మరియు మేము ఆ ప్రజల్లాగే ఉన్నాము. [PE]