1. {జోఫరు యోబుతో మాట్లాడటం} [PS] అప్పుడు నయమాతీ దేశపువాడైన జోఫరు యోబుకు జవాబిచ్చాడు:
2. “ఈ మాటల ప్రవాహానికి జవాబు ఇచ్చి తీరాల్సిందే! [QBR2] ఈ వాగుడు అంతా కలిసి, యోబు చెప్పింది సరే అనిపిస్తోందా? లేదు. [QBR]
3. యోబూ, నీకు చెప్పేందుకు [QBR2] మా పద్ద జవాబు లేదనుకొంటున్నావా? [QBR] నీవు దేవునిగూర్చి నవ్వి నప్పుడు, [QBR2] నిన్ను ఎవ్వరూ హెచ్చరించరు అనుకొంటున్నావా? [QBR]
4. యోబూ! నీవు దేవునితో, [QBR2] ‘నా నమ్మకాలు సరి యైనవే, [QBR2] కనుక చూడు నేను పరిశుద్ధమైన వాడినే’ అని చెబుతున్నావు. [QBR]
5. యోబూ! దేవుడే నీకు జవాబిచ్చి, [QBR2] నీవు చేసేది తప్పు అని చెబితే బాగుండును అని నేను ఆశిస్తున్నాను. [QBR]
6. అప్పుడు జ్ఞాన రహస్యాలు దేవుడు నీతో చెప్పగలడు. [QBR2] ప్రతి విషయానికీ, నిజంగా రెండు వైపులు ఉంటాయని ఆయన నీతో చెబుతాడు. [QBR] అది నిజమైన జ్ఞానం! యోబూ! ఇది తెలుసుకో: [QBR2] దేవుడు నిన్ను నిజంగా శిక్షించాల్సిన దానికంటె తక్కువగానే శిక్షిస్తున్నాడు.
7. “యోబూ, దేవుని రహస్య సత్యాలను నీవు గ్రహించగలవా? [QBR2] సర్వశక్తిమంతుడైన దేవుని గొప్పదనాన్నీ, శక్తినీ చూపించే హద్దులను నీవు గ్రహించలేవు. [QBR]
8. అతని జ్ఞానం ఆకాశమంత ఎత్తయినది! [QBR2] ఆ హద్ధులు సమాధి లోతులకంటె లోతైనవి. [QBR] కానీ, అది నీవు గ్రహించలేవు! [QBR]
9. దేవుడు భూమికంటే గొప్పవాడు, [QBR2] సముద్రంకంటే పెద్దవాడు.
10. “దేవుడు ఒకవేళ నిన్ను బంధిస్తే, నిన్ను న్యాయ స్థానానికి తీసుకొనివస్తే, [QBR2] ఏ మనిషీ ఆయనను వారించలేడు. [QBR]
11. నిజంగా, ఎవరు పనికిమాలిన వాళ్లో దేవునికి తెలుసు. [QBR2] దేవుడు దుర్మార్గాన్ని చూసినప్పుడు, ఆయన దానిని జ్ఞాపకం ఉంచుకొంటాడు. [QBR]
12. ఒక అడవి గాడిద ఎలాగైతే ఒక మనిషికి జన్మ ఇవ్వలేదో, [QBR2] అలాగే బుద్ధిహినుడు ఎన్నటికీ జ్ఞాని కాజాలడు. [QBR]
13. అయితే యోబూ! దేవుణ్ణి మాత్రమే సేవించటానికి, నీవు నీ హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి. [QBR2] ఆయన తట్టు నీవు నీ చేతులు ఎత్తి ఆరాధించాలి. [QBR]
14. నీ ఇంట్లో ఉన్న పాపం నీవు తొలగించి వేయాలి. [QBR2] నీ గుడారంలో చెడు నివాసం చేయనియ్యకు. [QBR]
15. అప్పుడు నీవు సిగ్గుపడకుండా దేవుని తట్టు నిశ్చలంగా చూడగలుగుతావు. [QBR2] నీవు బలంగా నిలబడతావు. భయపడవు. [QBR]
16. యోబూ! అప్పుడు నీవు నీ కష్టం మరచిపోగలవు. [QBR2] నీ కషాలను దొర్లిపోయిన నీళ్లలా నీవు జ్ఞాపకం చేసుకొంటావు. [QBR]
17. అప్పుడు మధ్యాహ్నపు సూర్యకాంతి కంటె నీ జీవితం ఎక్కువ ప్రకాశమానంగా ఉంటుంది. [QBR2] జీవితపు గాఢాంధకార ఘడియలు సూర్యోదయంలా ప్రకాశిస్తాయి. [QBR]
18. యోబూ! నిరీక్షణ ఉంది గనుక నీవు క్షేమంగా ఉంటావు. [QBR2] దేవుడు నిన్ను సురక్షితంగా వుంచి నీకు విశ్రాంతినిస్తాడు. [QBR]
19. నీవు విశ్రాంతిగా పండుకొంటావు. నిన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు, బాధించరు. [QBR2] మరియు అనేక మంది నీ సహాయం వేడుకొంటారు. [QBR]
20. కానీ, చెడ్డవాళ్లు సహాయం కోసం చూస్తారు, [QBR2] అయితే ఆశ ఏమి ఉండదు. వారు వారి కష్టాలు తప్పించుకోలేరు. [QBR2] వారు చస్తారు అనేది ఒక్కటే వారికి ఉన్న ఆశ.” [PE]