పవిత్ర బైబిల్

ఈజీ టు రీడ్ వెర్షన్ (ERV) - తెలుగు
యోబు గ్రంథము
1. {యోబుకు ఎలీఫజు జవాబు} [PS] అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జనాబిచ్చాడు:
2. “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే [QBR2] నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు. [QBR2] జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు. [QBR]
3. జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని [QBR2] ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా? [QBR]
4. యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే [QBR2] ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు. [QBR]
5. నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి. [QBR2] యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు. [QBR]
6. నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు. [QBR2] ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి. [QBR2] నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి.
7. “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా? [QBR2] కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా? [QBR]
8. దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా? [QBR2] నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా? [QBR]
9. యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు. [QBR2] నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం. [QBR]
10. తల నెరసిన మనుషులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు. [QBR2] అవును, చివరికి నీ తండ్రీకంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు. [QBR]
11. దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు [QBR2] కానీ నీకు అది మాత్రమే చాలాదు. [QBR] సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము. [QBR]
12. యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు? [QBR2] సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు? [QBR]
13. నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు [QBR2] నీవు దేవునికి విరోధంగా ఉన్నావు.
14. “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు. [QBR2] స్త్రీనుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు. [QBR]
15. దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు. [QBR2] దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు. [QBR]
16. మనవుడు అంతకంటే దౌర్భాగ్యుడు. [QBR2] మానవుడు అసహ్యమైవాడు మరియు పాడైపోయాడు. [QBR2] అతడు మంచి నీళ్లు తాగినట్టుగా కిడును తాగు తాడు.
17. “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను. [QBR2] నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను. [QBR]
18. జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను. [QBR2] ఆ జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు. [QBR2] ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు. [QBR]
19. వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది. [QBR2] వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ దేశంలో లేరు. [QBR]
20. దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు. [QBR2] క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు, [QBR]
21. భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి [QBR2] మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు. [QBR]
22. దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు. [QBR2] అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది. [QBR]
23. అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు. [QBR2] కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికిచావు మూడిందని అతనికి తెలుసు. [QBR]
24. చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు [QBR2] ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయాలు అతనిపై దాడి చేస్తాయి. [QBR]
25. ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్దుడు దేవునికి విధేయుడ య్యేందుకు నిరాకరిస్తాడు. [QBR2] సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. [QBR]
26. ఆ మనిషి చాలా మొండివాడు. [QBR2] దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు. [QBR]
27. దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు. [QBR] వాని నడుం కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు. [QBR2]
28. కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు. [QBR2] ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివసిస్తాడు. [QBR2] అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు. [QBR]
29. దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు. [QBR2] అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు. [QBR2] అతని పంటలు ఎక్కువగా పండవు. [QBR]
30. దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు. [QBR2] అగ్గిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు. [QBR2] దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది. [QBR]
31. దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు. [QBR2] ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక. [QBR]
32. దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే [QBR2] వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి వచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు. [QBR]
33. ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు. [QBR2] ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు. [QBR]
34. ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము. [QBR2] డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి. [QBR]
35. వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు. [QBR2] మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.” [PE]

గమనికలు

No Verse Added

మొత్తం 42 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 15 / 42
యోబు గ్రంథము 15:34
యోబుకు ఎలీఫజు జవాబు 1 అప్పుడు తేమానువాడైన ఎలీఫజు యోబుకు జనాబిచ్చాడు: 2 “యోబూ! నీవు నిజంగా జ్ఞానం గలవాడవైతే నీవు వట్టి మాటలతో జవాబు ఇవ్వవు. జ్ఞానం గల మనిషి పూర్తిగా తూర్పు వేడిగాలి (పనికిమాలిన మాటల) తో ఉండడు. 3 జ్ఞానం గల మనిషి పనికిమాలిన మాటలతో, అర్థం లేని ఉపన్యాసాలతో వాదిస్తాడని నీవు తలుస్తావా? 4 యోబూ! నీ యిష్టం వచ్చినట్టు నీవు ఉంటే ఎవ్వరూ దేవుణ్ణి గౌరవించరు, ఆయన్ని ప్రార్థించరు. దేవుని సన్నిధియందు చేసే ధ్యానానికి నీవు ఆటంకం తెస్తావు. 5 నీవు చెప్పే విషయాలు నీ పాపాన్ని తేటగా చూపిస్తాయి. యోబూ! నీవు తెలివిగల మాటలు ప్రయోగించి నీ పాపాన్ని దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నావు. 6 నీది తప్పు అని నేను నీకు రుజువు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? నీ స్వంత నోటితో నీవు పలికే విషయాలే నీ తప్పును తెలియ జేస్తున్నాయి. నీ స్వంత పెదాలు నీకు విరోధంగా మాట్లాడుతున్నాయి. 7 “యోబూ! మొట్ట మొదట పుట్టింది నీవే అని తలుస్తున్నావా? కొండలు చేయబడక ముందే నీవు జన్మించావా? 8 దేవుని రహస్య పథకాలు నీవు విన్నావా? నీ మట్టుకు నీవు ఒక్కడవు మాత్రమే జ్ఞానం గలవాడవని తలుస్తున్నావా? 9 యోబూ! నీకు తెలిసిన దానికంటే మాకు ఎక్కువ తెలుసు. నీవు గ్రహించలేని విషయాలు మేము గ్రహిస్తాం. 10 తల నెరసిన మనుషులు మరియు వృద్ధులు మాతో ఏకీభవిస్తారు. అవును, చివరికి నీ తండ్రీకంటే పెద్ద వాళ్లు కూడా మా పక్షంగా ఉన్నారు. 11 దేవుడు నిన్ను ఆదరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ నీకు అది మాత్రమే చాలాదు. సౌమ్యమయిన పద్ధతిలో దేవుని సందేశం మేము నీకు చెప్పాము. 12 యోబూ! నీవెందుకు అర్థం చేసుకోవు? సత్యాన్ని ఎందుకు చూడలేక పోతున్నావు? 13 నీవు ఈ కోపపు మాటలు చెప్పినప్పుడు నీవు దేవునికి విరోధంగా ఉన్నావు. 14 “ఒక మనిషి వాస్తవంగా పరిశుద్ధంగా ఉండలేడు. స్త్రీనుంచి జన్మించిన మనిషి, దేవునితో సరిపడి ఉండ జాలడు. 15 దేవుడు కనీసం తన దూతలను కూడ నమ్మడు. దూతలు నివసించే ఆకాశం కూడా పవిత్రమైనది కాదు. 16 మనవుడు అంతకంటే దౌర్భాగ్యుడు. మానవుడు అసహ్యమైవాడు మరియు పాడైపోయాడు. అతడు మంచి నీళ్లు తాగినట్టుగా కిడును తాగు తాడు. 17 “యోబూ, నా మాట విను. నేను దానిని నీకు వివరిస్తాను. నాకు తెలిసిన దానిని నేను నీతో చెబుతాను. 18 జ్ఞానం గల మనుష్యులు నాతో చెప్పిన విషయాలు నేను నీతో చెబుతాను. ఆ జ్ఞానం గల మనుష్యుల పూర్వీకులు ఈ విషయాలను వారితో చెప్పారు. ఆ జ్ఞానులు రహస్యాలేమీ నా దగ్గర దాచిపెట్టలేదు. 19 వారికే (జ్ఞానులకే) దేశం ఇవ్వబడింది. వారిని ఇబ్బంది పెట్టేందుకు పరాయివాళ్లు ఎవరూ ఆ దేశంలో లేరు. 20 దుర్మార్గుడు తన జీవితకాలమంతా బాధతో శ్రమ పడతాడు. క్రూరమైన మనిషి తన కోసం దాచ బడిన సంవత్సరాలన్నింటిలో శ్రమపడతాడు, 21 భయంకర శబ్దాలు అతని చెవులకు వినిపిస్తాయి మరియు అతడు క్షేమంగా ఉన్నానని అనుకొన్నప్పుడు శత్రువు అతని మీద దాడి చేస్తాడు. 22 దుర్మార్గపు వ్యక్తి చాలా విసిగిపోతాడు. చీకటి నుండి తప్పించుకొనే ఆశ అతనికి ఉండదు. అతణ్ణి చంపివేసేందుకు ఎక్కడో ఒక ఖడ్గం కనిపెడుతూనే ఉంటుంది. 23 అతడు అటూ ఇటూ ఆహారం కోసం ‘ఎక్కడ అది’ అంటూ సంచరిస్తూనే ఉంటాడు. కాని అతని శరీరం రాబందులకు ఆహారం అవుతుంది. అతనికిచావు మూడిందని అతనికి తెలుసు. 24 చింత, శ్రమ అతణ్ణి భయపెడుతున్నాయి. అతణ్ణి నాశనం చేసేందుకు ఒక రాజు సిద్ధంగా ఉన్నట్టు ఈ విషయాలు అతనిపై దాడి చేస్తాయి. 25 ఎందుకంటే దుర్మార్గుడు దేవుని మీద తన పిడికిలి బిగిస్తాడు కనుక దుర్మార్దుడు దేవునికి విధేయుడ య్యేందుకు నిరాకరిస్తాడు. సర్వశక్తిమంతుడైన దేవునికి విరోధంగా దుర్మార్గుడు బలవంతునిగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. 26 ఆ మనిషి చాలా మొండివాడు. దుర్మార్గుడు తన బలమైన లావుపాటి కేడెముతో దేవుని మీద దాడి చేస్తాడు. 27 దుర్మార్గుడు ధనవంతుడై ముఖం కొవ్వుతో నిండి ఉండివుండవచ్చు. వాని నడుం కొవ్వు పొరలతో బలిసి ఉండవచ్చు. 28 కానీ శిథిలమైన పట్టణాల్లో వాడు నివసిస్తాడు. ఎవరూ నివసించని ఇండ్లలో ఆ దుర్మార్గుడు నివసిస్తాడు. అవి పడిపోయేట్టు ఉన్న శిథిల గృహాలు. 29 దుర్మార్గుడు ధనికుడుగా ఉండవచ్చు. అతని ఐశ్వర్యం ఎక్కువ కాలం ఉండదు. అతని పంటలు ఎక్కువగా పండవు. 30 దుర్మార్గుడు చీకటిని తప్పించుకోలేడు. అగ్గిచేత కొమ్మలు కాలిపోయిన చెట్టులా అతడు ఉంటాడు. దేవుని శ్వాస దుర్మార్గుని తుడిచివేస్తుంది. 31 దుర్మార్గుడు పనికిమాలిన వాటిని నమ్ముకొని తనను తానే మోసం చేసుకోకూడదు. ఎందుకంటే, వానికి ఏమీ దొరకదు కనుక. 32 దుర్మార్గుని ఆయుష్షు తీరిపోకముందే వాడు ముసలివాడై, ఎండిపోతాడు. మళ్లీ ఎన్నటికి వచ్చగా ఉండని ఎండిపోయిన కొమ్మలా అతడు ఉంటాడు. 33 ద్రాక్షాపండ్లు పక్వానికి రాకముందే రాలిపోతున్న ద్రాక్షావల్లిలా దుర్మార్గుడు ఉంటాడు. ఆ వ్యక్తి పూలు రాలిపోయిన ఒలీవ చెట్టులా ఉంటాడు. 34 ఎందుకంటే, దేవుడు లేని ప్రజల పని వ్యర్థము. డబ్బును ప్రేమించే మనుష్యుల ఇండ్లు అగ్నిచేత నాశనం చేయబడతాయి. 35 వారు కష్టాలకు పథకం వేసి దుర్మార్గపు పనులు చేస్తారు. మనుష్యులను మోసం చేసేందుకు వారు ప్రయత్నం చేస్తారు.”
మొత్తం 42 అధ్యాయాలు, ఎంపిక చేయబడింది అధ్యాయము 15 / 42
Common Bible Languages
West Indian Languages
×

Alert

×

telugu Letters Keypad References